HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

19, ఏప్రిల్ 2011, మంగళవారం

పేగులు ఎందుకు అరుస్తాయి ?

ఒకో సారి కొందరికి పేగుల్లోంచి 'కుర్ కుర్ ' మంటూ చప్పుళ్ళు వినిపిస్తాయి .ప్రేవులలో గ్యాస్ కదులుతూ ఉన్నపుడు ఈ చప్పుళ్ళు వినిపిస్తాయి . ఫ్లుఇడ్ తో నిండుకున్న చిన్న ప్రేవుల కండరాల తాలూకు సంకోచ వ్యాకోచాల మూలంగా ఈ చప్పుడు వినిపిస్తుంది.
ప్రేవుల గోడల కండరాలు తమ సంకోచ వ్యాకోచాల ద్వారా ప్రేవుల లోని వ్యర్ధ పదార్ధాలని బయటకి నెట్టడానికి ప్రయత్నిస్తాయి .వ్యర్ధ పదార్ధాలతో పాటు గ్యాస్ కూడా కదుల్తూ చప్పుడు వినిపిస్తుంది .
ప్రేవుల చప్పుడు స్టేత్ స్కోప్ తో వింటే ఎప్పుడైనా వినిపిస్తుంది .ప్రేవుల నుంచి చప్పుడు అసలు వినిపించక పొతే గాబరా పడాలి గాని వినిపిస్తూవుంటే గాబరాపదనవసరం లేదు.
ప్రేవుల చప్పుడు వినిపించడం ప్రేవులు బాగా పనిచేస్తున్నై అనే అందుకు సూచన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి