HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

20, జనవరి 2011, గురువారం

తలంటు స్నానం తో ఎన్ని లాభాలో [దయ చేసి పూర్తిగా చదవండి]

మన భారతీయ జీవన విధానములో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంది . ప్రతీ రోజు స్నానం చెయ్యడం మన పద్దతి .కొంతమంది రొండు పూటలా చేస్తారు .పండగ వోచ్చినపుడు ప్రత్యెక స్నానం చెయ్యడం అందరికి తెలిసిందే .వస్తు గుణ దీపిక లో తలంటు స్నానం గురించి వ్రాయబడింది. సంక్రాంతి నాడు తలంటు స్నానం ఒక ప్రత్యెక కార్యక్రమమని అందరికి తెలుసు .తలంటు స్నానాన్ని అబ్యాన్గన స్నానమని అంటారు . కొబ్బరి నూనె,నువ్వులనూనె,ఆవునెయ్యి ,ఆముదం వీటిలో దేనినైన అబ్యాన్గన స్నానానికి వాడవొచ్చు .నూనె చాలా మంచిది .ముందుగా నూనె శరీరానికి బాగా పట్టించి మర్దనా చెయ్యాలి .కనీసం పదినిమిషాలు ఆగిన తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టాలి ,తర్వాత మరో పది నిమిషాలు ఆగాలి తర్వాత పొడి పిండి తో మొత్తం దేహానికి పట్టిన నలుగును వదిలించుకోవాలి. తర్వాత శరీరమంతా శుబ్ర పడేలా రెండు బకెట్ నీళ్ళతో స్నానం చెయ్యాలి. ఈ విధముగా చేయడం వలన గజ్జి, చిడుము, సర్పి, దద్డురులు మొ .చర్మ రోగములు ,దుస్వప్నములు దరి చేరావు. శరీరం మీద మలినాలను ,దుర్గందాల ను పోగొడుతుంది సుఖ నిద్ర ,శరీరం తేలికగా వుండడం ,దేహానికి పుష్టి,కాంతి , మృదుత్వం కలుగుతుంది. కండ్లకు చాలవ చేస్తుంది, పైత్యాన్ని అనుస్తుంది .వృదాప్యం తొందరగా రాదు,అలసటనూ, వాతమును పోగొడుతుంది.సుఖ నిద్ర పట్టును, కాంతి, ఆయుష్షు పెరుగుదల ,బుద్ధి బలిమి ,దేహపుష్టి ,వీర్య వృద్ది కలుగుతాయి .జటరాగ్ని బాగుంటుంది .దేహము కాళ్ళు చేతులు ,గోళ్ళు, సిరస్సులందు పుట్టిన తాపమును ,మంటలను పోగొట్టును .మాడపట్టున చమురు ను వుంచి మర్దించడం వలన చెవులకు ,తక్కిన అవయములకు బలము నిచ్చును .తలవెంట్రుకలు వృద్ధ్హిపరచును ,మృదుత్వాన్ని ఇచ్చును .అరిపాదాలకు చమురు మర్దించడం వలన మంటలను పోగొట్టును .అరికాళ్ళ నొప్పులు హరించును .
అబ్యాన్గన స్నానం వలన ఇన్ని రకముల ప్రయోజనములు వున్నై కాబట్టే మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు .
ఆధునిక యుగంలో అబ్యాన్గన స్నానానికి ప్రాధాన్యత తగ్గిపోవడము వలన దేహానికి అనారోగ్యం ఎక్కువ అవుతోంది .పూర్వ కాలంలో చర్మ వ్యాధులు చాలా తక్కువుగా ఉండేవి. వారం వారం అబ్యాన్గన స్నానం చాలామంచిది .కనీసం పండగలలోనైనా అబ్యాన్గన స్నానం చేస్తే ఏంటో మంచిది .
[ఇది జయధ్వని వార పత్రిక నుండి సేకరణ ]

2 కామెంట్‌లు:

  1. chaalaa.. bagundandee! shompolatho.. 2 nimishaalalo.. thalanti snaanam chese pillakaayalu abyangana snanam chesthaaraa?body massage laki prmukyatha icchi paruguletti dabbulu vadhilinchukuni.. haayigaa feel avuthaaru. manchi vehayaalani ilaage cheputhoo..undandi.

    రిప్లయితొలగించండి