HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

24, ఏప్రిల్ 2011, ఆదివారం

41 రోజుల తర్వాత దర్సన మిస్తా --బాబా



బాబా 1985 కోడై కెనాల్ ఆశ్రమంలోను, తన 65 వ జన్మ దినోస్తవం సందర్భంలోనూ బాబా చెప్పారని ఆ మాటలు ఇప్పుడు నిజముతున్నట్లుగా, తనచుట్టూ పోలీసు పహారా, ఎవరినీ దర్సనానికి అనుమతినివ్వకపోవడం ఇవన్ని అప్పుడు బాబా చెప్పినవేనని ఇటలీకి చెందిన డేనియల్ అనే భక్తుడు చెప్పినట్లుగా వుంది.--డైలీ పేపర్ నుండి సేకరణ, [11 వ పేజీ 24-04-2011

19, ఏప్రిల్ 2011, మంగళవారం

పేగులు ఎందుకు అరుస్తాయి ?

ఒకో సారి కొందరికి పేగుల్లోంచి 'కుర్ కుర్ ' మంటూ చప్పుళ్ళు వినిపిస్తాయి .ప్రేవులలో గ్యాస్ కదులుతూ ఉన్నపుడు ఈ చప్పుళ్ళు వినిపిస్తాయి . ఫ్లుఇడ్ తో నిండుకున్న చిన్న ప్రేవుల కండరాల తాలూకు సంకోచ వ్యాకోచాల మూలంగా ఈ చప్పుడు వినిపిస్తుంది.
ప్రేవుల గోడల కండరాలు తమ సంకోచ వ్యాకోచాల ద్వారా ప్రేవుల లోని వ్యర్ధ పదార్ధాలని బయటకి నెట్టడానికి ప్రయత్నిస్తాయి .వ్యర్ధ పదార్ధాలతో పాటు గ్యాస్ కూడా కదుల్తూ చప్పుడు వినిపిస్తుంది .
ప్రేవుల చప్పుడు స్టేత్ స్కోప్ తో వింటే ఎప్పుడైనా వినిపిస్తుంది .ప్రేవుల నుంచి చప్పుడు అసలు వినిపించక పొతే గాబరా పడాలి గాని వినిపిస్తూవుంటే గాబరాపదనవసరం లేదు.
ప్రేవుల చప్పుడు వినిపించడం ప్రేవులు బాగా పనిచేస్తున్నై అనే అందుకు సూచన.

17, ఏప్రిల్ 2011, ఆదివారం

హార్ట్ బర్న్ జాగ్రత్తలు

రోజూ మీరు హార్ట్ బర్న్ తో బాధపడుతున్నారంటే ముందు ముందు మీకు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టవొచ్చు.కొన్నాళ్ళకి ఇది అన్నవాహిక క్యాన్సర్ కి దారి తీసే ప్రామాదముంది.
*సరిగ్గా పడుకోబోయేముందు అన్నం తినవద్దు.
*తిన్నవెంటనే ముందుకు వొంగోకూడదు .
*waistline వద్ద వదులుగా వుండే దుస్తులు ధరించాలి.
*తెంపులు రాకుండగా ఉండడానికి అన్నం తినటానికి ఒక గంటముందు , లేక తిన్న వెంటనే మంచినీళ్ళు తాగటం మంచిది *కొవ్వు పదార్ధాలు,మషాలా పదార్ధాలు కల ఆహారాన్ని ,పిప్పరమెంట్,చాక్లెట్స్ ని తినకుండా వుండాలి .
*కాఫీ, టీ లను తగ్గించాలి.
*అన్నిటిలోకి ముఖ్యమైనది -బరువును తగ్గించుకోవడం ,పొగ మానటం.

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

మలబద్దానికి తేనే

పూర్వం గ్రీకులు మలబద్దనికి తేనెను మందుగా వాడేవారు. సుఖ విరోచనం కావడం కోసం వాళ్ళు గ్లాసెడు మంచినీల్లలో రెండు గరిటెల తేనే కలుపుకొని తాగేవారట . ఈ చిట్కా చాలా మందికి పనిచేస్తుంది. ఎలాగంటే: తేనెలో గ్లూకోజ్ కంటే ప్రక్తోజ్ అధికం గా వుంటుంది.ఈ ర్తోండు ప్రక్రుతి సిద్ధమైన చక్కేర్లు .మనం తీసుకొనే ఆహారం లో గ్లూకోజ్ కంటే ప్రక్టజ్ మన శరీరం లో శరీరం లో సరిగ్గా జీర్ణం కాదు. జీర్ణం కానీ చక్కరను [ఇక్కడ ఫ్రక్టోజ్] ను శరీరం బయటకి విసర్జిన్చాల్సి వస్తుంది .దానివలన టాలేట్ కి వెళ్ళవలసి వొస్తుంది. యాపిల్ ,యాపిల్ జూస్,పియర్స్ ,పియర్స్ జూస్ లోనూ కాక ఒక్క తేనెలో మాత్రమె గ్లూకోజ్ కంటే ఫ్రక్టోజ్ అధికముగా వుంటుంది. అందువల్ల యాపిల్ ,పియార్స్ లలో కేలరీలు అతి తక్కువుగా వుంటాయి.కాబట్టి బరువు ఎక్కుతామనే భయము లేకుండగా మలబద్దాన్నినివారించటం కోసం రోజు మీరు వీటిని ఎన్నైనా తినవోచ్చును . కానీ తేనే విషయములో అలా కాదు .తేనెలో కేలరీలు ఎక్కువుగా వుంటాయి .ఒక టేబుల్ స్పూన్ తేనే లో 64 కాలరీలు ఎక్కువ వుంటాయి . మీరు సన్నగా వుండి ,లేక బరువేక్కినా పర్వాలేదనుకుంటే గ్లాసుడు వేడి నీటిలో మూడు తఅబ్లె స్పూన్ల తేనెను కలుపుకొని తాగితే ప్రేగులు చలనం కలిగి సుఖ విరోచన మౌతుంది .

13, ఏప్రిల్ 2011, బుధవారం

రోదసి యాత్రకు 50 ఏళ్ళు

సోవియెట్ యూనియన్ కు చెందిన యూరి గగారిన్ రోదసి యాత్ర నిర్వహించి నేటికి సరిగ్గా 50 ఏళ్ళు పూర్తైంది .1961 ఏప్రిల్ 12 న వోస్టాక్ అంతరిక్ష వాహక నౌక గగారిన్ ను అంతరిక్షం లోకి తీసుకువెళ్ళింది .సోవియెట్ యునిఒన్ సాధించిన ఘన విజయమిది. 50 ఏళ్ళ క్రితం సాధించిన ఈ విజయం విప్లవాత్మకమైనది.

'తీన్ మార్' తొలి రోజు షోలు 4000

'తీన్ మార్' తొలి రోజు షోలు 4000




ఈమధ్య పెద్ద హీరోల సినిమాలని రికార్డుల పేరిట ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీనిని పెద్ద గొప్పగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే, సినిమా ఒకవేళ అటు ఇటు అయినా, ఓపెనింగ్స్ రూపంలో కొంత వరకైనా లాగేయడానికి నిర్మాతలు వేసే ప్లాన్ ఇదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ నెల 14 న రిలీజ్ అవుతున్న 'తీన్ మార్' సినిమాని కూడా అలాగే మొత్తం 1150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారట.
హైదరాబాదులో 60 థియేటర్లు కాకుండా, నైజాంలో మరో 200 థియేటర్లలో దీనిని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే, తొలి రోజు టోటల్ గా 4000 షోలు పడతాయట! ఒక్క హైదరాబాదు ప్రసాద్ ఐమాక్స్ లోనే ఆ రోజు 30 షోలు వేస్తున్నారు. గతంలో ఇతరులవి ఈ థియేటర్లో 20 షోల రికార్డ్ వుంటే, పవన్ సినిమా మాత్రం 25 షోల రికార్డ్ వుంది. ఇప్పుడా రికార్డుని తనే క్రాస్ చేస్తున్నాడన్నమాట. ఇదిలా ఉంచితే, ఈ లెక్కన ఒక్క తొలి రోజే అన్ని షోలకు కలిపి 8 కోట్లు షేర్ వస్తుందట!
















11, ఏప్రిల్ 2011, సోమవారం

'టాం అండ్ జెర్రీ'ల ప్రేమ కథ!



'టాం అండ్ జెర్రీ'ల ప్రేమ కథ!

చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేట్టు ఉండేది. తెలుగు సినిమా వజ్రోత్సవాలప్పుడు, చిరంజీవికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంలో జరిగిన ఫంక్షన్లోనూ వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎవరూ మరచిపోలేరు. చిరు, మోహన్ బాబుల వార్ కేవలం వారి మధ్యే కాకుండా..వాళ్ల అభిమానుల మధ్య కూడా నడిచింది. అయితే ఉన్నట్టుండి ఈమధ్య వీళ్లిద్దరూ మంచి దోస్తులైపోయారు. మేమిద్దరం 'టాం అండ్ జెర్రీ' అంటూ ఇద్దరూ ఒకర్నొకరు తెగ పొగిడేసుకుంటున్నారు.
ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజుకి చిరంజీవి తిరుపతి వెళ్లడం...నిన్న టి.ఎస్సార్ అవార్డ్స్ ఫంక్షన్లో ఒకరి మీద మరొకరు జోకులేసుకోవడం...చూసిన జనం 'వీరిద్దరి మధ్య ఇంత ఘాటు ప్రేమ ఎలా ఏర్పడిందా?' అనే ఆలోచనలో పడ్డారు. అయితే చిరు కాంగ్రెస్ పార్టీలో చేరడం, సోనియా దగ్గర పరపతి సంపాదించడం చూసి మోహన్ బాబు, ఎందుకైనా మంచిదని చిరుతో రాజీ పడ్డాడనీ, చిరు కూడా మోహన్ బాబు లాంటి 'ఫైర్ బ్రాండ్' తన పక్షాన వుండడం ఉపయోగకరమేనన్న ఆలోచనతో హ్యాపీగా ఫీలయ్యాడనీ టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది.
ఏమైనా, రాజకీయాల్లోనూ సినీ రంగంలోనూ శాశ్వత మిత్రులు...శాశ్వత శత్రువులు ఉండరనే విషయాన్ని చిరు, మోహన్ బాబులు మరోసారి నిరూపించారు.


4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉగాది గీతి

పచ్చదనమై పల్లవించు ,

మావికోమ్మై చిగురించు

వేపపువ్వై పుష్పించు

నువ్వే వసంతమై హాసించు

ఉగాది కోయల వత్సరమంతా
నీ హృదిలోనే వసించు
-----------రఫాయిల్
ఆఫీసు అసిస్టెంట్,
పోస్టల్ స్టోర్ డిపో
రాజముండ్రి

3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఉగాది subhaakankshalu

ఉగాది శుభాకాంక్షలు