HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

10, జులై 2011, ఆదివారం

సంధ్యావందనం ఎందుకు చేయాలి?

సంధ్యావందనం ఎందుకు చేయాలి?

(Purpose of Sandhyavandanam)

సంధ్యావందనం అనే ఆచారాన్ని ఒక సంప్రదాయంగా, మొక్కుబడిగా చేయడం కంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మరింత శ్రద్ధాసక్తులతో చేసే అవకాశం ఉంది. సూర్యభగవానుడు ఒక్కడే. కానీ, ఆయనలో అద్వితీయమైన మూడు శక్తులు, ఏడు రంగుల కిరణాలు ఉన్నాయి.

"ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్నివిష్టః" అనేది మంత్రం. అంటే సూర్యుడు స్పష్టంగా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇందుకు వేదాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి.

సూర్యునిలో కనిపించే సప్త వర్ణాలే సప్త అశ్వాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వెలిగించే పరబ్రహ్మ తత్వం సూర్యుడు. త్రిమూర్తుల శక్తులను విడివిడిగా చూపించే దివ్య నారాయణ మూర్తి సూర్యుడు. సూర్యభగవానుడిలో సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే మూడు మహా శక్తులు కేంద్రీకృతం అయ్యుంటాయి. అందుకే సూర్యునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో మూడుసార్లు సంధ్యావందనం చేయాలి.

త్రి సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల సూర్యునిలో దాగివున్న సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులు మన సొంతం అవుతాయి.

ఆయా శక్తులను

"గాయత్రీం ఆవాహయామి

సావిత్రీం ఆవాహయామి

సరస్వతీం ఆవాహయామి"

అనే మంత్ర సాయంతో ఆకర్షించి గ్రహించే సాధన సంధ్యావందనం. ఈ మంత్రాన్ని మూడుసార్లు భక్తిగా స్మరించి, నమస్కరించుకోవాలి. త్రి సంధ్యల్లోనూ క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించాలి. ఈ మూడు శక్తులూ ఘనీభవించిన మూర్తియే గాయత్రి. కనుకనే గాయత్రిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, అఘమర్షణం,అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం, ఉపస్థానం అనేవి అంగాలు.

మూడు సంధ్యలూ ఒకే మాదిరిగా ఉండవు. సూర్య తాపము, ప్రభావము వేరువేరుగా ఉంటాయి. ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయంత్ర సూర్యుని వృద్దార్క అని అంటారు. ఉదయానే ఏమంత ప్రభావం చూపడు. సాయంత్ర వేళలో సూర్యుడు గొప్ప ప్రభావాన్ని చూపుతాడు. ఇక మధ్యాహ్న సమయంలో సూర్యుని వేడిమి సహించలేనిదిగా ఉంటుంది. అయితే మూడు దశల్లోనూ సూర్యుని కిరణాలను చూడటం చాలా అవసరం. కనుకనే సంధ్యావందనం పేరుతో ఒక ఆచారాన్ని ప్రతిపాదించారు. దాన్ని కొనసాగించడంవల్ల మనసుకు శాంతి అనుభూతమౌతుంది. శరీర ఆరోగ్యమూ బాగుంటుంది.

7 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా చెప్పారు.ఈ కాలంలో వాళ్ళకి ఇటువంటివి తెలియవలసిన అవసరం ఎంతయినా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా!

    చతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మణేభ్య శ్హుభంభవతు వాశిస్ట మైత్రావరణ కౌండిన్య ప్రవరాన్విత, కౌండిన్యస గోత్రః, ఆపస్తంబ సూత్రః, శ్రీకృష్ణ యదుసాఖద్యాయి శ్రీ తటవర్తి కృష్ణమోహన్ శర్మ ఆహంభో అభివాదయే.

    మీకు వీలు ఉన్నప్పుడు గృహస్తు సంద్యావందనం చేసే ప్రక్రియ పూర్తిగా తెలియచేయగలరు.

    రిప్లయితొలగించండి
  3. శూద్రలు సంధ్యావందనం తెలియచేయగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యన్నామధేయశ్రవణానుకీర్తనాద్యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్
      శ్వాదోऽపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్


      మనని మనం గొప్పగా తలచుకుంటూ ఉండకుండా ఉండటానికీ, ఏ రోజు చేసిన పాపాన్ని ఆ రోజు తొలగించుకోవడానికి సంధ్యావందనం ఎలా చేస్తామో అలా ఈ శ్లోకాన్ని నిత్య పారాయణ చేసుకోవాలి. సంధ్యావందనం చేయకపోయినా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ఆపకూడదు.
      గాయత్రీ మంత్రం యొక్క అర్థం ఈ శ్లోకములో ఉంది.
      "ఏ మహానుభావుని యొక్క నామమును వినడం వలనా, పలకడం వలన, ఎవరికి తలవంచి నమస్కరించడం వలన, ఎవరికి నమస్కరించడం వలన, కుక్క మాన్సం తినే వాడైనా వెంటనే యజ్ఞ్యాధికారాన్ని పొందుతాడు. అలాంటి నీ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించినవాడికి కలగనిది ఏమిటి?"
      నీ దివ్య మంగళ విగ్రహాన్ని మేము మాటి మాటికీ ధ్యానం చేస్తామూ (తత్ సవితుః వరేణ్యం). వెంటనే వాడు యజ్ఞ్యం చేయగలడు (ధియో యోనః ప్రచోదయాత్). యజ్ఞ్యం అంటే మనదీ అనుకుంటున్న ద్రవ్యమూ,నాదీ అనుకునే ఆస్థిని పరమాత్మకు అర్పించే బుద్ధి కలుగుతుంది.
      ఆ గాయత్రీ మంత్రార్థాన్నే ఈ శ్లోకములో చెప్పబడినది.

      తొలగించండి
  4. చాలా చక్కగా చెప్పారు.ఈ కాలంలో వాళ్ళకి ఇటువంటివి తెలియవలసిన అవసరం ఎంతయినా ఉంది
    చతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మణేభ్య శ్హుభంభవతు వాశిస్ట మైత్రావరణ కౌండిన్య ప్రవరాన్విత, కౌండిన్యస గోత్రః, ఆపస్తంబ సూత్రః, శ్రీకృష్ణ యదుసాఖద్యాయి శ్రీ తటవర్తి కృష్ణమోహన్ శర్మ ఆహంభో అభివాదయే.

    మీకు వీలు ఉన్నప్పుడు గృహస్తు సంద్యావందనం చేసే ప్రక్రియ పూర్తిగా తెలియచేయగలరు

    రిప్లయితొలగించండి