HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

27, జూన్ 2010, ఆదివారం

ఉత్తరం

కేవలం క్షేమ సమాచార వ్యాపార లావాదేవిల సమాహారమే కాదు
రాసినా, చదివినా హృదయాన్ని ఆవిస్కరింప చేసే అక్షర అమ్ములపొది ఉత్తరమంటే .

అక్షరాలకు పెదవులను కడపడమే కాకుండగా , భావాలకు హృదయాలను మోపగాలిగితే
ఉత్తరం ఉత్తరమే కాదు- ఓ గ్రంధాలయం కూడా !

దూర తీరాలె కాదు , వీధికి ఎదురు వీధి, సందు ప్రక్క సందు
దగ్గర దగ్గరగా మసలుతున్నా చేతి ఉత్తరాలతో చేరువై ఓ ఇంటి వారైనా
వాళ్ళ ప్రేమ సౌధానికి పునాది రాయిగా నిలిచింది ఉత్తరమే కదా !

తినగా తినగా వేము అన్నట్టు ఉత్తరాలు రాసి రాసి కవులైన వాళ్లెందరో ......
చదివి, రాసి ఉత్తేజితులైన నాటి దేశ నాయకులేన్దరికో ఉత్తరమే మహత్యం ,ఉత్తరమే శరణ్యం!

అనర్ధాలు, అల్లకల్లోలానికి ఆటంబాంబులే అక్కరలేదు
ఆటవికత ఆవహించిన చేతుల్లో అక్షరాలూ అంతటివే ....
అలాంటి ఉత్తరాలు తులసివనంలో గంజాయి మొక్కలు

ఒక్క సెంటీగ్రేడ్ ఉస్త్నోగ్రత పెరిగి లక్ష టన్నుల గోధుమ పంట గల్లంతైనట్లు
చిన్న సెల్ ఫోన్ మోజుకు చేరువై ఆనిముత్యల్లంటి భావ పుష్టి పద సమూహ ఉత్తరాలని
ఒల్దేజి హోమేలలో తల్లితండ్రులను చేస్తుంటే
ఏ భాషా శిశువైనా పరిపుష్టిగా ఎలా పెరుగుతుంది !
తల్లిపాల ఉత్తరాలని పట్టందే !!

25, జూన్ 2010, శుక్రవారం

దీపారాధన ఫలితాలు

1. దీపానికి ఒత్తులు వేయుతవలన కలుగు ఫలితాలు .
తామర కాదా వొత్తులు వేస్తె మూడు జన్మల పాపాలు పోతాయి
అరటి దూట నారతో ఒత్తులు వేస్తె తమ కుల దేవత శాపం పోవును.
కొత్త పసుపు తువ్వాలుతో ఒత్తులు వేస్తె దాంపత్య జీవితం అన్యోన్యం గా వుంటుంది.
కొత్త తెలుపు గుడ్డని పంనేరులో ముంచి [నానబెట్టి] ఎండబెట్టిన తరువాత ఒత్తులుగా తయారు చేసి వేసుకొంటే లక్ష్మి కటాక్షం లభించి దుస్త శక్తులు తోలుగును.
2.దీపం లో వేసే నూనె వలన కలుగు ఫలితాలు .
నెయ్యి -------- లక్ష్మి కటాక్షం
ఆముదం ------కస్టాలు తొలుగుట
నువ్వులనూనె ------ మద్యమం
గమనిక: వేరుశనగ నూనె మొదలైన తక్కువరకం నూనెలతో ఆరాధన చెయ్యరాదు .
3. దీపం ఈ దిశలో ఉండవలెను
తూర్పు -----కస్టాలు తీరి మంచి జరుగును
పడమర ---- గ్రహ దోషం పోవును ,
అన్నదమ్ముల మద్య పగ చల్లరును
ఉత్తరం ----- విద్య ,సుభాకార్యములు మంచిగా జరుగును
దక్షిణం ---- అపసకునం

20, జూన్ 2010, ఆదివారం

వేకువ జామున లేవడం వలన ఫలితాలు

౧. ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలకు బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో నిదుర లేవ వలెను . ముందుగా శ్రమగా అనిపించినా అలవాటు అయ్యేకొలది సులభం అనిపిస్తుంది .దీని వలన ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుషు కలుగుతాయి . బ్రహ్మ ముహూర్త వేళలో దేవతలు, మన పెద్దలు మన ఇంటికి వొస్తారు .ఆ టైములో మనం మెలకువ తో వుంది వారిని మనసారా తలచుకొంటే వారందరూ సంతోషపడి మనకు మంచిని చేస్తారు .
౨. ఏ దిశలో కూర్చొని భోజనం చేయవలెను.
తూర్పు-- ఆయుషు పెరుగును
పడమర-- ఐశ్వర్యం పెరుగును
ఉత్తరం-- దరిద్రం
దక్షిణం-- కీర్తి పెరుగును
ఒక మూల కూర్చొని భోజనం చేయ రాదు .