HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

28, జనవరి 2010, గురువారం

నిండైన సాహితీమూర్తి కి నిలువెత్తు నీరాజనం .

ప్రముఖ సాహితి వేత్త , తెలుగు నేలకు గర్వ కారణం శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి .ఈయన ఆవిర్భావం 23.04.1891 ,
తిరోధానం 25.02.1961 . తెలుగు కధానిక శతజయంతి సందర్భముగా శ్రీ వేదగిరి కమ్యూనికేషన్ హైదరాబాద్ వారి ఆద్యర్యములో 24.01.2010 న రాజమండ్రి పాల్ చౌక్[కోటిపల్లి బస్సు స్టాండ్ సెంటర్ ] లో ఆయన విగ్రహవిస్కరణ జరిగింది . సభలో వక్తలు మాట్లాడుతూ తన కధలతో రాజమండ్రి సంస్కృతిని సుసంపన్నం చేసిన సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్యం గోదావరి ఉన్నంత కాలం జీవిస్తుంది అన్నారు ,ఆయన రాసిన ఆత్మ బలిదానం మనో విజ్ఞానిక నవల చదివినప్పుడు ఆయన లోని గొప్పదనం బయట పడుతుంది అన్నారు .ఉమ్మడి కుటుంబం లోని ముద్దు ,ముచ్చట్లు ,ఆత్మీయతలు శాస్త్రి కధలలో
కనిపిస్తయన్నారు.

26, జనవరి 2010, మంగళవారం

ఫిలాటిక్ ఎగ్జిబిషన్

భారత తపాలా శాఖ వారి ఆదేశాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో పోస్టల్ డిపార్టుమెంటు వారిచే పిబ్రవరి 12,13,మరియు 14 వ తేదీలలో గేదెల నూకరాజు కల్యానమదపంలో జిల్లా స్థాయి పిలాటాలి ఎగ్జిబిషాన్ జరుపబడుతోంది .ఇందులో పాల్గొనే ఫిలాటలిస్తులకు సీనియర్లకు ,యూత్ గ్రూప్ [16-21] లకు ఆవాహనం పలుకుతోంది .వివరాలను జనవరి 30 వ తేదీ లోపున రాజమండ్రి పోస్టల్ డివిజన్ అధికారి వార్కి తెలియపరచావలసిన్డిగా కోరుతున్నారు .21 సంవస్త్సరముల లోపువార్కి ఎంట్రీ రుసుము లేదు.

13, జనవరి 2010, బుధవారం

సూర్య గ్రహణం 15-01-2010

ఈ సంవస్త్స్తరం పుష్య బహుళ అమావాస్య శుక్రవారం 15-01-2010 వ తేదీన ఉత్తరాషాడ నక్షత్రమందు మద్యాహ్నం సంపూర్ణ సూర్య గ్రహణం పట్టును .రాహుగ్రస్తము, అపస్సవ్య గ్రహణము.స్పర్స కాలము ఉదయం గం .11.38, మద్యాకాలం గం . 01.39, మోక్షకాలం గం.03.20. ఆద్యంత పుణ్య కాలము గం .03-42.
ఈ గ్రహణము ఉత్తరాషాడ నక్షత్రమందు పట్టుతచే ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు [ధనుస్సు ,మకర రాసుల వారు]గ్రహణము చూడ రాదు .నిత్య భోజన ప్రత్యబ్దీకాదులు సుద్ధ మోక్ష కాలము అయ్యిన తరువాత ,బింబ దర్శనము చేసుకుని,స్నానము చేసిన తరువాత ఆచరించవలెను .
గ్రహణములు పట్టు నక్షత్రములవారు ,రాసులవారు గ్రహనానంతరము స్నానము చేసి ,నక్షత్ర జపము ,ఈస్వరాభిషేకము చేఇంచుకొని దోష నివారణకు వారి యొక్క ఆర్ధిక స్తోమతను బట్టి బంగారము, వెండి, బియ్యము, వస్త్రములు, స్వయంపాకము తగిన దక్షినలతో బ్రాహ్మణులకు దానము చేయవలెను .

శుభాకాంక్షలు

తోటి బ్లాగెర్స్ అందరికి నా సంక్రాంతి శుభాకాంక్షలు .
ఈ పండగ మన అందరికి సకల సౌభాగ్యాలు కలుగ చేయాలనీ ,పిల్లాపాపలతో ,సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటూ,క్రొత్తగా ఈ తెలుగు బ్లాగెర్స్ కుటుంబంలో చేరిన నన్ను ఆదరిస్తూ ఆశీర్వదిస్తారని కోరుతూ --మీ మూర్తి

4, జనవరి 2010, సోమవారం

సంక్రాంతి - 1

పండగ దగ్గర గా వొస్తోంది అంటే నాకు నా చిన్న నటి జ్ఞాపకాలు కళ్ళముందు కడులడుతూ వుంటై .చిన్న తనములో ముందు రోజు స్నేహితులు నలుగురు ఒక గంప పట్టుకొని ఎప్పుడెప్పుడు పండగ ?ఈదాడి పండగ ,పండగెండుకొచ్చింది? పప్పులు తినడానికి వొచ్చింది ,అల్లుడు ఎందుకు వొచ్చాడు ? అరిసలు తినడానికి వొచ్చాడు .అంటూ పాడే పాటలు గంపలో పరుగు పరుగున ఇంటిలోనుండి ఒక చెక్కపేడు,రెండు పిడకలు పట్టుకువోచ్చి వేసేవాళ్ళం ,పండగనేల పట్టింది మొదలు బడి నుడి తిరిగొచ్చిభోగి పిదకలకై ఆవుపేడ కోసమై పరుగులు పెట్టేవాళ్ళం . పేడతో చిన్న చిన్న పిడకలు మద్యలో ఒక రంద్రముతో చేసి గోడకు కొట్టేవాళ్ళం . భోగి పీడకలలో మళ్లి తల్లిపిడక[ఇదు రంద్రములతో] అరటిపండు [మూడు రంద్రములతో] చేసేవాళ్ళం. ఈలోపుగా అమ్మవారి ఊరేగింపు వొచ్చేది .అమ్మ ఒక చెంబు లో నీలు అందులో కొంచం పసుపు కలిపి నీళ్ళు, పళ్ళెంలో బియ్యం ,పసుపు ముద్దా ,కుంకం ముద్దా పెట్టి చిల్లర పైసా దక్షిణగా పెట్టి పట్టుకువోచ్చేది .మేము వీధిలో ఎవరి ఇంటిలో ఉంది భోగి పిదకలపై చర్చ చేస్తున్న ,తాయారు చేస్తున్న కానీ అమ్మవారి దప్పుల మోతకు పరుగున వొచ్చి పళ్ళెం ఇవ్వడం కోసమై సిద్ధమయ్యే వాళ్ళం .ఆసాదు కాళ్ళపై నీళ్ళుపోసి బియ్యపు పళ్ళెం చేతికి ఇచ్చి దణ్ణం పెట్టుకుంటే ,ఆసాదు ఒక వేప ఆకూ కొంచెం పసుపు కుంకుమ పళ్ళెంలో వేసి ఇచ్చేవాడు .ఇక చీకటి పడ్డాక అక్క అమ్మ వీధి లో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టె కార్యక్రమం మొదలై వీధి లోఅందరి ముగ్గులు చూసుకుంటూ పోటాపోటిగా సాగుతూ చాల ప్రోడ్డ్డు పోయేది .మేము ఇది చూస్తూ ఒక్కొక్క సారి అరుగు పైనే అలనిద్రలోకి జారేవాళ్ళం.[మిగిలినది సంక్రాంతి - 2 లో ]

సంక్రాంతి -1

ఈ పండగ దగ్గర గా వొస్తోంది అంటే నాకు నా చిన్న నటి జ్ఞాపకాలు కళ్ళముందు కడులడుతూ వుంటై .చిన్న తనములో ముందు రోజు స్నేహితులు నలుగురు ఒక గంప పట్టుకొని ఎప్పుడెప్పుడు పండగ ?ఈదాడి పండగ ,పండగెండుకొచ్చింది? పప్పులు తినడానికి వొచ్చింది ,అల్లుడు ఎందుకు వొచ్చాడు ? అరిసలు తినడానికి వొచ్చాడు .అంటూ పాడే పాటలు ఆ గంపలో పరుగు పరుగున ఇంటిలోనుండి ఒక చెక్కపేడు,రెండు పిడకలు పట్టుకువోచ్చి వేసేవాళ్ళం ,పండగనేల పట్టింది మొదలు బడి నుడి తిరిగొచ్చిభోగి పిదకలకై ఆవుపేడ కోసమై పరుగులు పెట్టేవాళ్ళం .ఆ పేడతో చిన్న చిన్న పిడకలు మద్యలో ఒక రంద్రముతో చేసి గోడకు కొట్టేవాళ్ళం .ఆ భోగి పీడకలలో మళ్లి తల్లిపిడక[ఇదు రంద్రములతో] అరటిపండు [మూడు రంద్రములతో] చేసేవాళ్ళం. ఈలోపుగా అమ్మవారి ఊరేగింపు వొచ్చేది .అమ్మ ఒక చెంబు లో నీలు అందులో కొంచం పసుపు కలిపి నీళ్ళు, పళ్ళెంలో బియ్యం ,పసుపు ముద్దా ,కుంకం ముద్దా పెట్టి చిల్లర పైసా దక్షిణగా పెట్టి పట్టుకువోచ్చేది .మేము వీధిలో ఎవరి ఇంటిలో ఉంది భోగి పిదకలపై చర్చ చేస్తున్న ,తాయారు చేస్తున్న కానీ ఈ అమ్మవారి దప్పుల మోతకు పరుగున వొచ్చి ఆ పళ్ళెం ఇవ్వడం కోసమై సిద్ధమయ్యే వాళ్ళం .ఆసాదు కాళ్ళపై నీళ్ళుపోసి బియ్యపు పళ్ళెం చేతికి ఇచ్చి దణ్ణం పెట్టుకుంటే ,ఆసాదు ఒక వేప ఆకూ కొంచెం పసుపు కుంకుమ పళ్ళెంలో వేసి ఇచ్చేవాడు .ఇక చీకటి పడ్డాక అక్క అమ్మ వీధి లో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టె కార్యక్రమం మొదలై వీధి లోఅందరి ముగ్గులు చూసుకుంటూ పోటాపోటిగా సాగుతూ చాల ప్రోడ్డ్డు పోయేది .మేము ఇది చూస్తూ ఒక్కొక్క సారి అరుగు పైనే అలనిద్రలోకి జారేవాళ్ళం.[మిగిలినది సంక్రాంతి - 2 లో ]

దీవెన!

2010 కి స్వాగతం చెబుతూ మన రాష్ట్రానికి చిదంబరం దీవెన [ ప్రకటన ]

మూడు బందులు
ఆరు ధర్నాలుగా
వర్ధిల్లు

2, జనవరి 2010, శనివారం

పరిష్కారం?

రేపు 5 వ తేదీన జరిగే తెలగాణ మీటింగ్ [న్యూ ఢిల్లీ లో ] కేవలం పార్టీ కి ఇద్దరు చొప్పున రమ్మన్నారు .ఇంతమంది ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తూ,సమర్దిస్తూ వస్తున్న ఈ సమస్య కేవలం ఆ ఇద్దరు ప్రతినిధులు అక్కడ వొప్పుకొని వస్తున్న అంశంను ఏకీభవిస్తారా లేక అల్ పార్టీ మీటింగ్ లో జరిగినట్లుగా ముందు ఒకటి తర్వాత వొకటిగా వుంటుందా ?ఈ సమస్యకు పరిష్కారం ? దేముడా నిన్ను వేడుకోవడం తప్ప ----
కదిలిన ఈ తేనే తుట్టేనుంచి మాకు కమ్మటి తేనెను ఇష్తవో లేక మమ్మలిని తేనే పిండిన తర్వాత తుట్టెల చేస్తావో ?

1, జనవరి 2010, శుక్రవారం

శుభాకాంక్షలు

సహా బ్లాగర్ లు అందరికి
ఈ 2010 మన అందరికి ప్రతి ఇంట వెలుగులు నింపాలని ,మన కుటుంబం[తెలుగు బ్లాగర్] మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని మ్రోక్కుతూ ---మీ మూర్తి .