కేవలం క్షేమ సమాచార వ్యాపార లావాదేవిల సమాహారమే కాదు
రాసినా, చదివినా హృదయాన్ని ఆవిస్కరింప చేసే అక్షర అమ్ములపొది ఉత్తరమంటే .
అక్షరాలకు పెదవులను కడపడమే కాకుండగా , భావాలకు హృదయాలను మోపగాలిగితే
ఉత్తరం ఉత్తరమే కాదు- ఓ గ్రంధాలయం కూడా !
దూర తీరాలె కాదు , వీధికి ఎదురు వీధి, సందు ప్రక్క సందు
దగ్గర దగ్గరగా మసలుతున్నా చేతి ఉత్తరాలతో చేరువై ఓ ఇంటి వారైనా
వాళ్ళ ప్రేమ సౌధానికి పునాది రాయిగా నిలిచింది ఉత్తరమే కదా !
తినగా తినగా వేము అన్నట్టు ఉత్తరాలు రాసి రాసి కవులైన వాళ్లెందరో ......
చదివి, రాసి ఉత్తేజితులైన నాటి దేశ నాయకులేన్దరికో ఉత్తరమే మహత్యం ,ఉత్తరమే శరణ్యం!
అనర్ధాలు, అల్లకల్లోలానికి ఆటంబాంబులే అక్కరలేదు
ఆటవికత ఆవహించిన చేతుల్లో అక్షరాలూ అంతటివే ....
అలాంటి ఉత్తరాలు తులసివనంలో గంజాయి మొక్కలు
ఒక్క సెంటీగ్రేడ్ ఉస్త్నోగ్రత పెరిగి లక్ష టన్నుల గోధుమ పంట గల్లంతైనట్లు
చిన్న సెల్ ఫోన్ మోజుకు చేరువై ఆనిముత్యల్లంటి భావ పుష్టి పద సమూహ ఉత్తరాలని
ఒల్దేజి హోమేలలో తల్లితండ్రులను చేస్తుంటే
ఏ భాషా శిశువైనా పరిపుష్టిగా ఎలా పెరుగుతుంది !
తల్లిపాల ఉత్తరాలని పట్టందే !!
Could you please shoot me a mail. I want to talk to you sir.
రిప్లయితొలగించండిvamsikamalmeka@gmail.com