HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

30, జూన్ 2011, గురువారం

మధుమేహం లేక షుగర్ [డయాబెటిస్ ]వ్యాధి-2


డయాబెటిస్ ఎందువలన ఎలా వొస్తుంది ?
వంస పారంపర్య , లేక జేన్యు లోపముల వలన క్లోమ గ్రంధి లోపము [ఫ్రాన్కిటైటిస్, ఫ్రాన్కియాస్ గ్రంధిలో రాలు ఏర్పడడం ,కేన్సరు మొ..]వలన మానసిక వొత్తిడి ,ఆందోళన వలన ,అధిక బరువు ఉండుట వలన ,అతిగా భుజించుట వలన ,ఆహార నియమములు పాటించక పోవుట వలన కొన్ని రకముల మందులు [ఉబ్బసమునకు,చర్మ వ్యాధులకు,కడుపునోప్పికి,పక్ష వాతమునకు, గుండెపోటుకు ]ఎక్కువుగా వాడుటవలన .షుగర్ వ్యాధి వొస్తుంది.

షుగర్ వ్యాధి లక్షణములు:
అతి దాహం, అతి మూత్ర విసర్జన ,అత్రిగా ఆకలి,అలసట, నీరసం, తల త్రిప్పుట,క్రమ క్రమముగా బరువు తగ్గుత ,ఇన్ ఫెక్షన్ ,ఎన్ని మందులు వాడినా కాళ్ళకు, శరీరానికి అయే గాయములు, కురుపులు మానుటకు చాలాకాలం పట్టుట.చర్మం పైన దురదలు, జననాంగాలు వద్ద వొచ్చే కొన్ని వ్యాధులు, అరిచేతులు, అరికాళ్ళు చురుకులు ,మనతలు వుండడం, త్వరితగతిని కంటి చూపు మందగించడం ,స్త్రీలకు ఋతు క్రమములో మార్పులు అనగా నెలసరి సరిగ్గా రాకపోవడం లేదా నిలిచిపోవడం .జాయింట్లు ,కండరాలు పటుత్వము తగ్గుట ,స్పర్స జ్ఞానం తగ్గిపోవుట ,కాళ్ళు లాగుతున్నట్లుగా వుండి ,తిమ్మిరిలుగా వుండడం మొ.. పై లక్షణముల వలన షుగరు వున్నట్లు గా గుర్తించ వోచ్చును.

షుగర్ వ్యాధి వొచ్చే అవకాశం ఎవరికీ ఎక్కువ ? తర్వాత భాగం లో --

29, జూన్ 2011, బుధవారం

మధు మేహం లేక షుగర్ [డయాబిటిస్ వ్యాధి]

అతి ప్రాచీనము నుండి మానవ జాతిని పట్టి పీడిస్తున్న దీర్ఘ కాల వ్యాదులలో దయాబితిస్ ఒకటి
క్రీ పూ సుమారు 2000 సం క్రిందటే ప్రముఖ ఆయుర్ వేద వైద్యులు చరకుడు, సుశ్రుతుడు తమ సంహితులలో [చర సంహిత /సుశ్రుత సంహిత ] ఈ వ్యాధిని గురించి చెపుతూ దీనిని "మధుమేహం " అని నామకరణం చేసారు .ఈవ్యాధితోబాధ పడే రోగిలో అతి మూత్ర విసర్జన ఉంటుందని , అది తీపిగా ఉంటుందని వివరించారు. అందుకు ఈ వ్యాధికి మధుమేహం అని నామ కరణంచేసారు .రోగి మూత్రం పోసిన స్తలములో చీమలు చేరటం చూసి రోగాన్ని నిర్ణయించేవారు పూర్వం.
షుగర్ వ్యాధి అంటే ఏమిటి ?
మనం తీసుకోనేఆహారం జీర్ణమైన తర్వాత "గ్లూకోజ్ " గా మారీ rఅక్తం లో కలిసి శరీరానికి ఇంధనముగా మారుతుంది .
ఉదా: మోటారు వాహనములకు పెట్రోలు ఎంత అవుసరమో మానవ శరీరానికి గ్లూకోజ్ అంతఅవసరము .జీవ కానము లోని శక్తిని ఉద్భావింప చేసే క్లిష్టమైన కార్య క్రమాన్ని నియంత్రించేది మన శరీర ఉదార భాగములోనున్న క్లోమా గ్రంధి ద్వారా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ ఉత్పత్తి పరిమాణము తగ్గినా ,సరైన సామర్ద్యము లేకపోయినా రక్తము లోని గ్లూకోజ్ శాతము పెరిగి శరీరానికి ఉపయోగ పడకుండా మూత్ర పిండాల ద్వారా నీరుడు రూపములో బయటకు పోతుంది దీని నే వైద్య పరముగా దయాబితిస్ ,లేక షుగర్ వ్యాధి ,లేక మధు మెహ వ్యాధి అంటారు.
దయాబితిస్ ఎందువలనా ,ఎలావోస్తుంది తర్వాత భాగములో

27, జూన్ 2011, సోమవారం

జేష్ట బహుళ ఏకాదశి --అపర ఏకాదశి

జాష్ట బహుళ ఏకాదశి అపర ఏకాదశి అనియు, పెద్ద ఏకాదశి అనియు పిలుస్తారు .
ఈ ఏకాదశి వ్రతము అనుకున్న పనులు సిద్ధింప చేస్తుందని విశ్వాసము .
ఈ రోజున వ్రత అనంతరము గొడుగును ,చల్లని వస్తువులను దానము చేయవలెనని ధర్మ శాస్త్రము.
కాబట్టి సంవస్త్సరములో మనకు వొచ్చే అన్ని ఏకాదశి ల వెనక విశిష్టమైన పురాణ ఆరోగ్య రహస్యములు కలవు .
తిదులన్నితి లోను ప్రత్యేకత సంతరించుకున్న తిధి ఏకాదశి , మానవుల ఆరోగ్య పరిరక్షనే ధ్యేయంగా ఆచార్య వ్యవహారాలలో చోటుచేసుకున్న ఈ ఏకా దాసి వ్రతము ఆచరించుట ద్వారా అద్యాత్మికముగా అనేక పుణ్య ఫలములే గాక మారుచున్న సామాజిక స్తితి గతులు ,ఆహారపు అలవాట్లు వలన క్రొత్త సమస్యలను, ఆరోగ్య విషయముల నుండి ఉపసమనం పొంద వోచ్చును .