HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

30, డిసెంబర్ 2013, సోమవారం

మరణం తరువాత (శరీరం విడిచిన తరువాత) ఏమి జరుగుతుంది ?

  • మరణం తరువాత (శరీరం విడిచిన తరువాత) ఏమి జరుగుతుంది ?

    మరణం తరువాత ఏమిటి? ఇది చాల మందికి ఉన్న సందేహం. మనం మనకు ఈ స్తూల శరీరం ఉన్నంతవరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంక బతికే ఉంటాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని ఇలా ఎన్నో ఊహాగానాలు. కాని నిజంగా ఏమో మాత్రం ఎవరికీ తెలియదు.

    ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి జవాబు కఠోరఉపనిషత్తు లో తెలుపబడింది. నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది. అప్పుడు యమధర్మరాజు నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకోమని అంటాడు. కాని నచికేతుడు పట్టుబడుతాడు.నాకు మృత్యువు తరువాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ నచికేత నీకు సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి మరియు చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

    యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాల సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుంది ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే తను ఏమి సాధించాలి నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించడు. ఎదో మంచి జీవితం మంచి భార్యా తరువాత పిల్లలు వీటితోనే సతమతమవుతూ తాను ఎందుకు పుట్టానో కూడ తెలుసుకునేంత సమయం లేదు. కాని ఎదో ఒక రోజు నువ్వు కాదన్న ఎవరు కాదన్న మరణం మాత్రం నీ వెనకే వుంటుంది, అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడ మనం గమనించే పరిస్తితులలో ఉండము.

    మరణం తరువాత ఏమి జరుగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్ములించుకొని వుంటే నీవు (అంటే ఆత్మ) పరమాత్మునిలో అంటే పరమాత్ముని సాగరంలో విలీనం అవుతావు లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు (మంచి పనులు) చేసి వుంటే స్వర్గానికి లేక దుష్కర్మలు (చెడ్డపనులు) చేసి వుంటే నరకానికి వెళతావు. దీనిని ఎవరు ఆపలేరు.

    ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే కొద్దిగలో కొద్దిగా తెలుసుకొని వుంటే నీకు మరల మనిషి జన్మ వస్తుంది అది ఒక మంచి యోగుల కుటుంబంలో.ఇందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జునకు వివరించాడు. అట్లా కాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనస్సును బుద్దిని అదుపులో వుంచుకొని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకొని నువ్వు విముక్తడవు అయి వుంటే మాత్రం నువ్వు (ఆత్మ) ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు.ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

    కాని మనకు తెలియదు మన కర్మలు అన్నియు అయిపోయినయో లేదో. కావున మనం మన ఈ స్తూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన(ధ్యానం) చేసి ఆ భగవంతునిని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు వుండవు. అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అంటే అప్పుడు నీవు ఎవరు, దేవుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సు ఏమిటి అన్న ప్రతి సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు అనేదే లేదు, మనస్సు అనేదే ఒక భ్రమ అని . అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ వాసుదేవున్ని (పరమాత్మను) మన హృదయంలో దర్శించుకోవడమే.

    ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికీ మరల యేయే జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి వుంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేసిస్తాయి.

    అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతునిని పొందడం అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికి తెలియపరచి ఆయనను నిరంతరం భక్తి శ్రద్దలతో స్మరిస్తూ ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం. అసలు మనం పుట్టింది కూడ ఇందుకే.

  • BRAMSRI CHAGANTI KOTESWARA RAO GURUVUGARI FB POSTING NUNDI SEKARANA.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి