HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

30, డిసెంబర్ 2013, సోమవారం

మరణం తరువాత (శరీరం విడిచిన తరువాత) ఏమి జరుగుతుంది ?

  • మరణం తరువాత (శరీరం విడిచిన తరువాత) ఏమి జరుగుతుంది ?

    మరణం తరువాత ఏమిటి? ఇది చాల మందికి ఉన్న సందేహం. మనం మనకు ఈ స్తూల శరీరం ఉన్నంతవరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంక బతికే ఉంటాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని ఇలా ఎన్నో ఊహాగానాలు. కాని నిజంగా ఏమో మాత్రం ఎవరికీ తెలియదు.

    ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి జవాబు కఠోరఉపనిషత్తు లో తెలుపబడింది. నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది. అప్పుడు యమధర్మరాజు నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకోమని అంటాడు. కాని నచికేతుడు పట్టుబడుతాడు.నాకు మృత్యువు తరువాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ నచికేత నీకు సనాతనము అయిన బ్రహ్మాన్ని గురించి మరియు చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

    యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాల సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుంది ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే తను ఏమి సాధించాలి నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించడు. ఎదో మంచి జీవితం మంచి భార్యా తరువాత పిల్లలు వీటితోనే సతమతమవుతూ తాను ఎందుకు పుట్టానో కూడ తెలుసుకునేంత సమయం లేదు. కాని ఎదో ఒక రోజు నువ్వు కాదన్న ఎవరు కాదన్న మరణం మాత్రం నీ వెనకే వుంటుంది, అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడ మనం గమనించే పరిస్తితులలో ఉండము.

    మరణం తరువాత ఏమి జరుగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్ములించుకొని వుంటే నీవు (అంటే ఆత్మ) పరమాత్మునిలో అంటే పరమాత్ముని సాగరంలో విలీనం అవుతావు లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు (మంచి పనులు) చేసి వుంటే స్వర్గానికి లేక దుష్కర్మలు (చెడ్డపనులు) చేసి వుంటే నరకానికి వెళతావు. దీనిని ఎవరు ఆపలేరు.

    ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే కొద్దిగలో కొద్దిగా తెలుసుకొని వుంటే నీకు మరల మనిషి జన్మ వస్తుంది అది ఒక మంచి యోగుల కుటుంబంలో.ఇందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జునకు వివరించాడు. అట్లా కాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనస్సును బుద్దిని అదుపులో వుంచుకొని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకొని నువ్వు విముక్తడవు అయి వుంటే మాత్రం నువ్వు (ఆత్మ) ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు.ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

    కాని మనకు తెలియదు మన కర్మలు అన్నియు అయిపోయినయో లేదో. కావున మనం మన ఈ స్తూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన(ధ్యానం) చేసి ఆ భగవంతునిని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు వుండవు. అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అంటే అప్పుడు నీవు ఎవరు, దేవుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సు ఏమిటి అన్న ప్రతి సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు అనేదే లేదు, మనస్సు అనేదే ఒక భ్రమ అని . అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ వాసుదేవున్ని (పరమాత్మను) మన హృదయంలో దర్శించుకోవడమే.

    ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికీ మరల యేయే జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి వుంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేసిస్తాయి.

    అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతునిని పొందడం అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికి తెలియపరచి ఆయనను నిరంతరం భక్తి శ్రద్దలతో స్మరిస్తూ ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం. అసలు మనం పుట్టింది కూడ ఇందుకే.

  • BRAMSRI CHAGANTI KOTESWARA RAO GURUVUGARI FB POSTING NUNDI SEKARANA.

26, డిసెంబర్ 2013, గురువారం

హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది

హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి. హనుమాన్ చాలీసాలో ... "యుగ సహస్ర యోజన పర భాను, లీల్యో తాహి మధుర ఫల జాను" హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు. పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం. భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది. లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు. ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం. యుగ -12000 సంవత్సరాలు సహస్ర -1000 యోజనం- 8 మైళ్ళు యుగ X సహస్ర X యోజనం 12000X1000=12000000 12000000X8=96000000 మైళ్ళు ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే.... ఒక మైలు =1.6 కి .మీ. 96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు. ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి. కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు.




sri j d laxminarayana gari fb posting nundi sekarana

24, నవంబర్ 2013, ఆదివారం

Commemorative Stamp on Satya Sai Baba released

Nov 23, 2013

Commemorative Stamp on Satya Sai Baba released today

Union Minister of State for Communication & Information Technology (IT) Smt Killi Krupa Rani released a commemorative stamp on Satya Sai Baba on the occasion of his 88th birth anniversary celebrations held at Puttaparthi  of Anantapur District, A.P on 23rd November 2013. Sri B.V.Sudhakar,CPMG AP, Ms K.Sandhya Rani,PMG and Sri D.S.V.R.Murthy,DPS Kurnool have also attended the function.

 Sri Satya Sai Baba (born as Sathyanarayana Raju; 23 November 1926 – death 24 April 2011) was a highly revered spiritual leader and world teacher, whose life and message are inspiring millions of people throughout the world. He claimed to be the reincarnation of Sai Baba of Shirdi. The Sathya Sai Organisation, founded by Sathya Sai Baba "to enable its members to undertake service activities as a means to spiritual advancement" has over 1,200 Sathya Sai Centers in more than 100 countries. Through this organisation, Sathya Sai Baba established a network of free hospitals, clinics, drinking water projects and schools. Sathya Sai's devotees are spread across the world







courtesy;ipaspandhrablogspot.

13, నవంబర్ 2013, బుధవారం

eeswara pradakshinamu

శ్లో:-ధ్వజాత్ పృష్టం - పృష్టాత్ పృష్టమ్,
పృష్టాత్ పృష్టం - పృష్టాత్ ధ్వజమ్.

భావము:-
శివాలయములో ధ్వజ స్తంభము నుండి ఆలయము వెనుక శివుని పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి నడచు కొనుచు మరల ఆ పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి మరల నడచుకొనుచు పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి ధ్వజ స్తంభము వరకు వెళ్ళ వలెను అని శ్లోక భావము....ఇంకా చూడండి

Important Portals & their Founders:

Important Portals & their Founders:

1. Google — Larry Page & Sergey Brin
2. Facebook— Mark Zuckerberg
3. Yahoo— David Filo & Jerry Yang
4. Twitter— Jack Dorsey & Dick Costolo
5. Internet— Tim Berners Lee


6. Linkdin— Reid Hoffman, Allen Blue& Koonstantin Guericke
6. Like Kin India Page to Get information everyday.
7. Email— Shiva Ayyadurai
8. Gtalk— Richard Wah kan
9. Whats up — Laurel Kirtz
10. Hotmail— Sabeer Bhatia
11. Orkut— Buyukkokten
12. Wikipedia— Jimmy Wales
13. You tube— Steve Chen, Chad Hurley & JawedKarim
14. Rediffmail— Ajit Balakrishnan
15. Nimbuzz— Martin Smink & Evert Jaap Lugt
16. Myspace— Chris Dewolfe & Tom Anderson
17. Ibibo — Ashish Kashyap
18. OLX— Alec Oxenford & Fabrice Grinda
19. Skype— Niklas Zennstrom,Janus Friis & Reid Hoffman
20. Opera— Jon Stephenson von Tetzchner & Geir lvarsoy
21. Mozilla Firefox— Dave Hyatt & Blake Ross

10, నవంబర్ 2013, ఆదివారం

idi 3 adugula Bullet

http://www.youtube.com/v/AmW2IXYbpgk?version=3&autohide=1&showinfo=1&attribution_tag=3NEmZWg5UxYWhKDIwr4r1A&autohide=1&autoplay=1&feature=share

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

మహాలయ పక్ష విశిస్టిత [మహాలయం 20.09.13 నుండి 04.10.13 వరకు ]

బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వర రావు గారి బ్లాగ్ నుండి సేకరణ 

తేది 20/9/2013: మహాలయ పక్ష ప్రా||

భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. దీనినే మహాలయ పక్షం అన్నారు. ఈ పక్షం రోజులు అనగా రేపటి నుంచి నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తి పరచాలి. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.

ప్రతి యేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి.ఆఒక్కరోజు వారు అన్నశ్రాద్ధంపెట్టలేకపోతే, హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఈ మహాలయంలో ఒక విశేషం - వారి వారి జ్ఞాతి, బంధువు లందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు.

కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే | యాచిత్వాపి నరః కుర్యాత్‌ పితౄణాం తన్మహాలయం ||151||
బ్రాహ్మణేభ్యో విశిష్టేభ్యోయాచేతధనధాన్యకం | పతితే భ్యోనగృహ్ణీయాత్‌ ధనధాన్యంకదాచన ||152||
బ్రాహ్మణేభ్యోనలభ్యేత యదిధాన్యధనాదికం | యాచేతక్షత్రియ శ్రేష్ఠాత్‌ మహాలయ చికీర్షయా ||153||
దాతారశ్చేన్నభూపాలావైశ్యేభ్యో೭పిచయాచయేత్‌ | వైశ్యా అపిహిదాతారోయదిలోకే న నంతివై ||154||
దద్యాద్ఛాద్రవదేమాసే గోగ్రాసరిపతృత్నప్తయే | అథవారోదనం కుర్యాత్‌ బహిర్నగ్గత్యకాననే ||155||
పాణిభ్యాముదరం స్వీయం ఆహత్యాశ్రూణివర్తయన్‌ | తేష్వరణ్యప్రదేశేషు ఉచ్చైరేవంవదేన్నరః ||156||
శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ | అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్‌ || 157 ||
ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః | కర్తుం మహాలయ శ్రాద్ధం నచమేశక్తిరస్తివై || 158 ||
భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే | అతోమహాలయ శ్రాద్ధం నయుష్మా కంకరోమ్యహం || 159 ||
క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః | దరిద్రోరోదనం కుర్యాత్‌ ఏవంకాననభూమిషు || 160 ||
తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః | హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధారీపత్వైవనిర్జరాః || 161 ||
మహాలయార్ధేవిప్రౌఘే భుక్తేతృప్తిర్యథా భవేత్‌ | గోగ్రాసారణ్యరుదితైః పితృతృప్తిస్తథా భవేత్‌ || 162 ||

మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి (151) ధనదాన్యమును విశిష్టులైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధనధాన్యమును ఎప్పుడుకూడా పతితుల నుండి తీసుకోరాదు (152) ధనధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేష్ఠులను యాచించాలి (153) రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో (154) పితరుల తృప్తి కొరకు గోవుల గ్రాసమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికిపోయి అడవిలో ఏడవాలి (155) చేతులతో తన కడుపును కొట్టుకొంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశములందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి (156) మాకులంనకు చెందిన పిలరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృపణుణ్ణి. సిగ్గులేని వాణ్ణి, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి (157) పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. (158) భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. (159) మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి (160) అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు (161) బ్రాహ్మణుల సమూహం మహాలయంకొరకు భుజిస్తే తృప్తిచెందినట్లు గోగ్రాన, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది. (162)

--- శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సరిహతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని సంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము నుంచి..
57

మహాలయ పక్ష విశిస్టిత 

[మహాలయం 20.09.13 నుండి 04.10.13 వరకు ]

7, సెప్టెంబర్ 2013, శనివారం

శ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి వుపన్యసముము

గోత్రము


గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.

ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...

సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే !

విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు. 

ప్రవర 

కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను. 

ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు

---------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత

---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ 

.........................శర్మన్ అహం భో అభివాదయే ||

అని పలకాలి

ప్రవర చెప్పునపుడు , లేచి నిలబడి , చెవులు చేతులతో ముట్టుకుని ఉండి , ( కుడి చేత్తో ఎడమ చెవి , ఎడమ చేత్తో కుడి చెవి .....కొందరు ఇంకోరకంగా ముట్టుకుంటారు ) , ప్రవర చెప్పి , వంగి భూమిని చేతులతో ముట్టి సాష్టాంగ నమస్కారము చేయవలెను .

పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి. 

సూత్రము 

ప్రవరలో మన సూత్రమేదో కూడా చెపుతాముకదా ..సూత్రమంటే ఏమిటి ?

యజ్ఞ యాగాదులు అనేక రకమైనవి ఉన్నాయి . ఉదాహరణకు , ’ దర్శ పూర్ణ మాస యాగము , అశ్వమేధ , పురుష మేధ మొ|| నవి . ఆయా యాగాదులలో ఇవ్వవలసిన ఆహుతులు ఏమిటి అన్న విషయాలు తెలిసిఉండవలెను . యజ్ఞ యాగాదులు మాత్రమే కాక , మనము చేయు శుభకార్యములన్నీ కూడా ఒక పద్దతిలో , సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తాము .

ఈ పద్దతులను , సాంప్రదాయాలనూ వివరించేవే సూత్రాలు . ఈ సూత్రాలను వివిధ మహర్షులు రాసియున్నారు . యజుర్వేదము పాటించేవారికి ’ ఆపస్తంబుడు ’ ’ బోధాయనుడు ’ సూత్రాలను రాసియున్నారు . ఋగ్వేదీయులకి ’ ఆశ్వలాయనుడు ’ రాశాడు .

బోధాయన సూత్రాలు చాలా వివరాలతో , ఎంతో నిడివితో కూడుకొని ఉంటాయి . బోధాయనుడి శిష్యుడైన ఆపస్తంబుడు , ఆ కాలానికే అవి నిడివి ఎక్కువ అని గ్రహించి , అనవసరమైన వాటిని కుదించి , ఎంత అవసరమో వాటిని మాత్రమే తిరగ రాశాడు . ఈనాడు యజుర్వేదము అనుసరించేవారిలో అధిక శాతము ఆపస్తంబుడి సూత్రాలనే ఎక్కువగా అనుసరిస్తారు . అయితే బోధాయన సూత్రాలను పాటించేవారుకూడా అనేకులున్నారు .

ఆపస్తంబుడు శ్రౌత , గృహ్య , ధర్మ మరియు శుల్బ సూత్రాలను రాశాడు . వీటన్నిటినీ కలిపి " కల్ప సూత్రాలు " అంటారు . మన వంశీయులు సాంప్రదాయకంగా పాటించే సూత్రాలను రాసినవారి పేరు కూడా ప్రవరలో చెప్పడము ఆనవాయితీ అయింది . ప్రవర అనేది ఒకమంత్రము కాదు . అది కేవలము మన పరిచయాన్ని చెప్పడము మాత్రమే .

( ఆపస్తంబుడి , 2650 B.C గురించి ఒక చిన్న ఆసక్తి కరమైన విశేషము ..ఆపస్తంబుడు అనునది అతని నిజమైన పేరుకాదు . అతడు ’ జల స్తంభన ’ విద్య నేర్చుకొని , నీటి అడుగున పద్మాసనములో రోజుల తరబడి కూర్చొని ధ్యానము చేసేవాడు. నీటిని నియంత్రించేవాడు కనక అతడిని ’ ఆపస్తంబుడు ’ అన్నారు . ( కొందరు ’ ఆపస్తంభుడు ’ అంటారు ) అతడు నీటిలో ఉండగా , చేపలు ఆకర్షించబడి అతని దగ్గర గుంపులు గుంపులుగా తిరుగుతుండేవి . జాలరులు అతడున్నది తెలియకనే , అక్కడికి వచ్చి చేపలు పట్టేవారు . ఒకసారి ఆపస్తంబుడు వలలో చిక్కుకొనగా , అతడిని జాలరులు " నాభాగుడు ’ అను రాజుగారి వద్దకు తీసుకొని పోతారు . రాజు అతడిని గౌరవించి , గోవులు సమర్పించి వదిలివేస్తాడు . )
శ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి వుపన్యసముము

29, ఆగస్టు 2013, గురువారం

పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు

పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు - 7 wonders of Puri Jagannath Temple !

1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి "Opposite direction" లో ఉంటుంది.

2) ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణం లో ఎక్కడ ఉన్నా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.

3) మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.

4) పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయం మీద వెళ్ళవు.

5) గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా, ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు.

6) ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలనే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు !

7) జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో చక్కల నిప్పు మీద 7 మట్టిపాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. అయినా ముందు పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేది వేడి అవుతుంది. ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.





sarvaprani sukhinobhavantu blog nundi sekarana

28, ఆగస్టు 2013, బుధవారం

krishna astami subhakankshalu

August 28, 2013 - Wednesday
శ్రీ విజయనామ సంవత్సరం, దక్షిణాయనం,వర్ష ఋతువు
Week వారము : Wednesday, Month : శ్రావణ, Paksha : బహుళపక్షం
Tithi తిథి : అష్టమీ 04:13 AM (next day)
Sunrise సూర్యోదయం : 06:02 AM, Sunset సూర్యాస్తమయం : 06:24 PM
Moonrise చంద్రోదయం : 05:30 AM
Star నక్షత్రం : కృత్తికా 12:42 PM
Yogam యోగం : వ్యాఘాత 04:49 PM
Solar Zodiac సూర్యరాశి : సింహ, Lunar Zodiac చంద్రరాశి : వృషభ
Rahukalam రాహుకాలం : 12:12 PM to 01:46 PM
Yamagandam యమగండం : 07:36 AM to 09:07 AM
Durmuhurtham దుర్ముహూర్తం : 11:48 AM to 12:38 PM
Amritakalamu అమృతకాలం : 10:04 AM to 11:50 AM

సుముహూర్తం

సుముహూర్తం

సనాతన ధర్మ సంస్కారాల్లో 'వివాహం' అతి ప్రధానమైనది. సూర్య కిరణాలు తాకగానే పద్మం వికసించినట్లు, మానవజీవితంలో వివాహం తొలి వెలుగులను విరజిమ్ముతుంది ధర్మార్ధ కామ మోక్షములను సాధించే రాచబాటే మన వివాహ వ్యవస్థ. అందుకే విదేశీయులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంక పెళ్ళి ప్రక్రియలు అనేకం. వాటిలో "శుభముహూర్తం " లేదా "సమీక్షణం" అతి ముఖ్యమైనది. వధూవరులిద్దరూ పెళ్ళి మంటపం మీద తూర్పు, పశ్చిమ ముఖాలుగా కూర్చుంటారు. వారి కుడి చేతికి జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దలు ఇస్తారు. వారి వివాహానికి సరిగ్గా, నిర్ణయించిన సుముహూర్తం సమయంలో, వేద ఘోష, మంగళ వాయిద్యాలు మధ్య ఆ మిశ్రమాన్ని వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచి, అణచి పట్టుకొని, శిరస్సులను తాకుతారు. ఒక ప్రక్క "గట్టి మేళం" మ్రోగుతూనే ఉంటుంది. అంతవరకు వారిద్దరి మధ్యా అడ్డుగా ఉన్న తెర/తెరశెల్లాను తొలగిస్తారు. అప్పటి వరకు వేచియున్న వధూవరులు ఒకరినొకరు పవిత్రంగా చూసుకొంటారు. దీనినే "సుమూహుర్తం" అంటారు. ఇదే సమయంలో వేదపండితులు ఋగ్వేదంలోని ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు.

"ధృవంతే రాజావరుణో ధృవం దేవో బృహస్
ధృవంతే ఇంద్రశ్చాగంచ్ఛ రాష్ట్రం థార్యతాం ధృవం."

అంటే " ఓ రాజా! రాజైన వరుణుడు, దేవతలైన బృహస్పతి, ఇంద్రాగ్నులు నీ రాజ్యాన్ని స్థిరమొనర్చుగాక." అలాగే, ఈ గృహస్తు జీవితం నిలకడగా ఆనందంగా జీవించాలని, చివరిదాక ఇద్దరూ ఎడబాటు లేకుండా ఉండాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగిఉండాలనే ఆకాంక్షే దీని పరమార్ధం. వరుడి శ్రేయం కోరడమే ఇందులోని ముఖ్యాంశం.

ఇహ జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని వినియోగించడంలో కల ప్రయోజనం: జీలకర్ర వృద్ధ్యాప్యం రాకుండా దోహదపడుతుంది. అందువలన శుభకార్యాల్లో దీని వినియోగం మంగళప్రదం. అందుకే జీలకర్రని వంటలలో కూడా విరివిగా వాడతారు. బెల్లం భోగ్య పదార్ధం. ఇది మధురంగాను, తన మధురాన్ని ఇతర వస్తువుల్లోకి సంక్రమింప చేసేదిగాను, పవిత్రమయినదని, కృష్ణ యజుర్వేద సంహిత చెబుతోంది. ఈ రెంటిని కలిపి నూరినా, నమిలినా "ధనసంజ్ఞకమైన విద్యుత్తు"(POSSITIVE ELECTRONIC CHARGE) కలుగుతుందని పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలనే ఈ మిశ్రమ సంయోగం వలన ఒక క్రొత్త శక్తి పుడుతుందనీ, దీనిని తలపై పెట్టినపుడు వధూవరుల శరీరాల్లో ఒక విశిష్ట ప్రేరణ కలిగి , పరస్పర జీవ శక్తుల ఆకర్షణకు సహాయపడుతుందని చెబుతారు. అందుకే ఈ మిశ్రమం పావనం, మంగళకరం అని మహర్షుల మాట. అలాగే మన వివాహ వ్యవస్థ లో మాంగల్య ధారణ, సప్తపది, తలంబ్రాలు మొదలయిన ప్రక్రియల్లో కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్నది పెద్దల మాట.[బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి బ్లాగ్ నుండి సేకరణ]

26, ఆగస్టు 2013, సోమవారం

ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?

ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?


మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ అనంతరము గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షిణ.
ప్రదక్షిణము ఎందుకు చేస్తాము?
ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము.

ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే. పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది.

ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రగానే ఎందుకు చేయబడుతుంది?
ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు. అందుకని కుడి వైపు నుంచి ప్రదక్షిణము చేస్తాము. భారత దేశములో కుడి వైపు అనేది శుభ ప్రదత ను తెలుపుతుంది. ఆంగ్ల భాషలో కూడా సరైన, సరికాని అని చెప్పడానికి రైట్ సైడ్ / రాంగ్ సైడ్ అనే పదాలు వాడతారు. అందువలన గర్భాలయంను కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణము చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము, శక్తిని ఇచ్చి, మార్గ దర్శకత్వము అయి మన జీవితాన్ని ధర్మము వైపు నడిపించే వాడయిన భగవంతునితో బాటు ఋజు వర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసికోవాలి. మనము అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కుడి వైపున అంత కన్నా తక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే వాటిని వెడమ వైపున ఉంచడము మన సాంప్రదాయం. ఈ విధముగా చేయడము వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయట పడి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గములో నిలబడతాము.

భారతీయ వేద గ్రంధాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవో భవ అని శాసిస్తాయి. నువ్వు నీ తల్లిదండ్రులను మరియు గురువులని భగవత్స్వరూపులుగా భావించుదువు గాక! ఈ భావముతో మనము మన తల్లి దండ్రులకు మరియు మహాత్ములకి కూడా ప్రదక్షిణ చేస్తాము. తన తల్లి దండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కధ అందరికీ తెలిసినదే.

సంప్రదాయ పద్దతి ప్రకారము పూజ పూర్తి చేసిన తరువాత మనము విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాము. ఈ విధముగా చేయడము వలన బాహ్యముగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వముగా గుర్తిస్తాము. మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా స్తుతిస్తాము.

యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడు గాక!
 · sarvaprani sukhinobhavantu nundi  sekarana

29, జూన్ 2013, శనివారం

కనుమరుగావబోతున్న 113 సం।। హేవలాక్ బ్రిడ్జి


కనుమరుగావబోతున్న 113 సం।। హేవలాక్ బ్రిడ్జి




 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చ రేకేస్తిస్తున్న గోదావరిమాత  పైన వేణువుగా  నిలచిన పాత రైలు వంతెన హేవలాక్ ను ప్రారంభించిన ఆ నాటి మదరాసు గవర్నర్ సర్ ఆర్ధర్ ఎలంబిక్ హేవలాక్ బ్రిటిష్ పాలకులచే సెహబాష్ అనిపించుకొని అనేక ప్రాంతాలలో గవర్నర్ గా చేసిన ఆయన మదరాసు గవర్నర్ గా వున్నా కాలం లో గోదావరి పాత రైలు వంతెనను ప్రారంభించి ధన్యుడయ్యాడు ్‌ఎవలొక్ వర్ధంతి జూన్ 25 న జరిగింది.బానిస వ్యవస్తకు వ్యతిరేకంగా ఉద్యమించిన హేవలోక్ సిలోన్ గవర్నర్ గా వున్నపుడు బియ్యం పైన ,ధాన్యం పైన పన్నును రద్దు చేసి ఘననీయుడు అయ్యాడు .
 గోదావరి నది పై  నూట పదమూడు క్రితం కట్టబడి  వంద  సంవత్సరములు అయుష్హే  రికార్డులలో రాసినందున ఈ రోజు మన రైల్వే బోర్డు ఈ బ్రిడ్జి ని ఇనపతుక్కుగా కేవలం 5 కోట్ల రూపాయల అంచనాగా అమ్మాలని  నిర్ణ ఇంచింది .
ఈ బ్రిడ్జి ని పర్యాటకముగా మరియు పాదచారులకు రాజముండ్రి కొవ్వూరుల ను కలుపుతూ ఉంచాలని ఎన్నో రోజుల నుండి ఉభయగోదావరి ప్రజలు కొరుతున్నరు. కాని రైల్వే బోర్డు నిర్ణయం ఆకోరికను తుంగలో తొక్కిన్ది.
హేవలోక్ బ్రిడ్జి డేటా
శంకు స్తాపన --------11-11-1897
తోలి ప్రయాణం -------6-8-1900
ప్రారంభించింది --------మదరాసు గవర్నర్ హేవలోక్
తోలి రైలు పరుగు ----- హౌరా మెయిల్
తోలి ప్రయానికులలో ఒకరు ---చిలకమర్తి లక్ష్మి నరసింహం
వర్క్ ఇంజనీర్ ఇన్ చీఫ్ -------ఎఫ్. టీ . జి .వాల్షణ్
విస్తీర్ణం ------------------------ 23 వేల చదరపు అడుగులు
వెయ్యి చదరపు అడుగులకు
రెండు సార్లు పెయింట్ ఖర్చు ------11 రూపాయల 5అణాల  9 పైసలు
బ్రిడ్జి నిర్మాణానికి అంచనా --------రూ  50 ,40,457\-
ఖర్చైనది -------------------------రూ 46,89,849\-
మిగిలినది -----------------------రూ .,56,698\-
బ్రిడ్జి పొడవు -------------------- 9,096 అడుగులు
స్తంబాలు -----------------------54

ఈరోజులలో అంచనాల తర్వాత ఇంత మిగిలింది అని చెప్పగల ప్రాజెక్ట్ ఏమైనా వుంటే చెప్పండి .[కాంట్రాక్టర్కి కాదండి బాబు]
ఇటువంతిబ్రిద్గేని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది .కావున దయచేసి అందరూ ఎవరికీ తొచినవిధముగా వారు రైల్వే బోర్డు కి [ఈ మెయిల్స్ ,ఎస్ ఎం ఎస్ లు, పోస్ట్ కార్డ్స్, ద్వారా ] బ్రిడ్జి ని కాపాడవలసిన ఆవశ్యకత ను తెలియచేయవలసింది.

ఇది గుడిగంట ఆద్యాత్మిక వారపత్రిక నుండి సేకరణ




19, జూన్ 2013, బుధవారం

విశ్వదాభిరామ వినురవేమ

చిక్కి ఉన్న  వేళ  సింహంబు నైనను
బక్క కుక్క కరచి బాధ పెట్టు
బలిమి లేని వేళ  పంతంబు చెల్లదు
విశ్వదాభిరామ  వినురవేమ

పాపం కే కే గారి పరిస్తితి 

18, జూన్ 2013, మంగళవారం

హాయ్

హాయ్
చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకొంటున్నందుకు చాలా ఆనందంగా వుంది . ఈ రోజు నుండి మళ్ళీ నాకు తెలిసిన విషయాలు అందరితో పంచుకుందామని వస్తున్నాను.
----మీ మూర్తి 

4, జనవరి 2013, శుక్రవారం

30 YEARS INTERNET

ఇంటర్నెట్ కు 30 ఏళ్ళు 

1983 జనవరి 1 న ప్రారంభం ,ప్రపంచ సమాచార వ్యవస్తనే మార్చేసిన సాంకేతిక విప్లవం

మానవజాతి ప్రస్తానాన్ని మలుపుతిప్పిన శాస్త్రీయ  ఆవిష్కరణ లో ఇటీవలికాలంలో చెప్పుకోదగినది ఇంటర్నెట్ మాత్రమె .ప్రపంచ ప్రజలమద్య గతంలో ఎన్నడు లేనట్టి వేగవంతమైన ,చవకైన సమాచార వారధిగా ఆవిర్భవించిన ఇంటర్నెట్ జనవరి 1 న 0 వ జన్మదినోస్తావము జరుపుకొంది ఇంటర్నెట్ అనే మహా సాంకేతిక విప్లవము 1 జనవరి 1983 న ప్రారంభమైనది. ఆరోజు అమెరికా రక్షణ శాఖ నేతృత్వములోని  ఆర్భా నెట్ ప్రాజెక్ట్ పూర్తీ స్థాయి లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూట్ [ఐ పి ఎస్ ]సమాచారవ్యవస్తకు మారింది కంపుతెర్లను అనుసంధానించే ఈ వ్యవస్తే తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ కు దారి తీసింది. ఇంటర్నెట్ రాక ముందు ఉన్న ఆర్బ నెట్ 1960 ల చివర్లో సైనిక పరిశోధక ప్రాజెక్ట్ గా మొదలైంది ,అయతే మారుతున్న అవసరాల దృష్ట్యా ఆర్భా నెట్ ను మెరుగుపరుస్తూ వచారు .సమాచార వ్యవస్థ ఓకీ దగ్గర కేంద్రీకృతమై వుంటే శత్రువుల నుంచి ప్రమాదము పొంచి ఉంటుందని ,అలా కాకుండా ఈ వ్యవస్తను వికేంద్రీకరించాలని భావించారు ఈ క్రమములోనే ఇంటర్ నెట్ ప్రోటోకాల్ అనే వ్యవస్థ 1983 నాటికి ఆవిర్భావించిది .బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త టీం బెర్నేన్స్ లీ .. 1983 లో వరల్డ్ వైడ్ వెబ్ పేరుతొ  ఇంటర్ లింక్డ్  హైపర్టెక్స్ట్  డాక్యుమెంట్ ను ఇంటర్నెట్ లోకి ప్రవేసపెట్టటంతో ఈ నూతన సాంకేతిక వ్యవస్థ మరో గొప్ప ముందంజ వేసింది .ఈ రోజు మనం  ఉపయోగిస్తున్న ఇంటర్నెట్  ఈ విదముగా పలు దశల్లో అభివృద్ధి చెందింది .
 
ఈ సమాచారం 2.1.13 తేదీ  ఈనాడు న్యూస్ పేపర్ నుండి సేకరించబడినది