HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

21, జనవరి 2011, శుక్రవారం

నాడు మంత్రి -నేడు బికారి

నాడు N T R స్టాపించిన తెలుగు దేశం పార్టీ నుండి మొట్టమొదటగా ధర్మవరం నియోజక వర్గం నుండి M L A గా గెలుపొంది నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేసిన నాగిరెడ్డి నేడు ఉండడానికి శిధిలమైన సొంత ఇల్లు తప్ప తన కుమారునికి వైద్యం చేఇంచలేని స్తితిలో [ఆయనకుమారునికి రొండు తుంటే ఎముకలు మార్చవలసి వుండడం ] వున్నారంటే
ఆయన మంత్రిగా వుండగా ఎంత నిజాయితీగా పనిచేసారో మనకి తెలుస్తుంది .ఈ రోజు TV9 లో మధ్యాన్నం 1.30 గం
ఆయనగురించి ప్రసారం చేసారు . నిజంగా ఈ రోజు ఆయన యొక్క పరిస్తితి చూస్తూంటే ఈ రోజులలలో కూడా అలాంటి నాయకులు వున్నారా ? అని అనిపిస్తుంది . ఏ పదవీ లేకున్డగానే ఒక్క రాజకీయ నాయకునికి వారసుని గానో ,లేక ఒక రాజకీయ నాయకునికి చెంచా గానో వున్నవాల్లె కోట్లు కోట్లు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి వారు వుండడం చాలా అరుదు .సినిమాలలో చూస్తున్నపుడు ఇలాంటి వారు వున్నారా? అనిపిస్తుంది ,కాని అది నిజమని TV9 కార్యక్రమం ద్వారా ఈరోజు తెలిసింది . ఈ కార్యక్రమం జరుగుతున్నట సేపు రాష్ట్రము లో వివిధ చోట్ల నుండి ఫోన్ ద్వారా ఆయన తో మాట్లాడి తమవొంతుగా ధన సహాయం చేస్తూ వున్నారు .ధనసహాయం చేయడానికి ఆయన యొక్క బ్యాంకు ఎకౌంటు నం .52088486751 SBH SECRATERIAT BRANCH గా ప్రకటించి ఉన్నారు .

1 కామెంట్‌:

  1. చంద్ర బాబు ను నమ్ముకుంటే పరిస్థితి అంతే. ఆయన వాడుకొని వదిలేసే రకం.

    రిప్లయితొలగించండి