1] గ్రామ ప్రజలు ,నియోజకవర్గాప్రజలు ,జిల్లా వాసులు ముద్దుగాపిలుచుకొనే చంటి దొర [కళా సంస్కృతులకు పెద్ద దొర ] శ్రీ S B P B K సత్యనారాయణ రావు ఇకలేరనే వార్త తూ.గో. జిల్లవాసులను దిగ్బ్రమకు గురి చేసింది .పంచాయతీ సర్పంచి నుండి సెంట్రల్ మినిస్టర్ వరకూ ఆయన ఎన్నో పదవులు నిర్వహిచారు .ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన విద్యా రంగానికి చేసిన మంచిపనులను ప్రజలు ఇప్పటికీ చెప్పుకొంటారు .ఆయన సొంతవూరు
కపిలేశ్వరపురం లో వేద పాటశాలలో ఇప్పటి చాలా మంది వేదపండితులు చదువుకొన్నారు .ఒక పారిశ్రామిక వేత్తగా ,రాజకీయనాయకునిగా,కళా ,సంస్కృతీ రంగాలలో ఆయన సేవలు మరువ లేనివి.
2] ప.గో.జిల్లా కొవ్వూరు దగ్గర దొమ్మేరులో జన్మించిన శ్రీ E V V సత్యనారాయణ హాస్య బ్రహ్మ జంద్యాల తర్వాత గురువును మించిన శిష్యుడిగా తెలుగు ప్రేక్షక లోకాన్నితన చిత్రాలద్వారా నవ్వులలో ముంచి ,చిత్రం చూస్తున్నంతసేపు ప్రేఖకుడు తనను తను మరచి , తన బాధలను మరచి హాయ్ గా నవ్వుకోనేలా చేసిన E V V ఇకలేరని తెలిసి ప. గో. జిల్లా వాసులను దిగ్రబ్రమకు గురి చేసింది .
ఒకే రోజు ఇద్దరి ప్రముఖులను కోల్పోఇన రాష్ట్రం వారి వారి రంగాలలో వారి సేవలను మరవదు.
[ఫోటోలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి