| ఈమధ్య పెద్ద హీరోల సినిమాలని రికార్డుల పేరిట ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీనిని పెద్ద గొప్పగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే, సినిమా ఒకవేళ అటు ఇటు అయినా, ఓపెనింగ్స్ రూపంలో కొంత వరకైనా లాగేయడానికి నిర్మాతలు వేసే ప్లాన్ ఇదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ నెల 14 న రిలీజ్ అవుతున్న 'తీన్ మార్' సినిమాని కూడా అలాగే మొత్తం 1150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారట. హైదరాబాదులో 60 థియేటర్లు కాకుండా, నైజాంలో మరో 200 థియేటర్లలో దీనిని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే, తొలి రోజు టోటల్ గా 4000 షోలు పడతాయట! ఒక్క హైదరాబాదు ప్రసాద్ ఐమాక్స్ లోనే ఆ రోజు 30 షోలు వేస్తున్నారు. గతంలో ఇతరులవి ఈ థియేటర్లో 20 షోల రికార్డ్ వుంటే, పవన్ సినిమా మాత్రం 25 షోల రికార్డ్ వుంది. ఇప్పుడా రికార్డుని తనే క్రాస్ చేస్తున్నాడన్నమాట. ఇదిలా ఉంచితే, ఈ లెక్కన ఒక్క తొలి రోజే అన్ని షోలకు కలిపి 8 కోట్లు షేర్ వస్తుందట! |
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి