చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేట్టు ఉండేది. తెలుగు సినిమా వజ్రోత్సవాలప్పుడు, చిరంజీవికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంలో జరిగిన ఫంక్షన్లోనూ వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎవరూ మరచిపోలేరు. చిరు, మోహన్ బాబుల వార్ కేవలం వారి మధ్యే కాకుండా..వాళ్ల అభిమానుల మధ్య కూడా నడిచింది. అయితే ఉన్నట్టుండి ఈమధ్య వీళ్లిద్దరూ మంచి దోస్తులైపోయారు. మేమిద్దరం 'టాం అండ్ జెర్రీ' అంటూ ఇద్దరూ ఒకర్నొకరు తెగ పొగిడేసుకుంటున్నారు. ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజుకి చిరంజీవి తిరుపతి వెళ్లడం...నిన్న టి.ఎస్సార్ అవార్డ్స్ ఫంక్షన్లో ఒకరి మీద మరొకరు జోకులేసుకోవడం...చూసిన జనం 'వీరిద్దరి మధ్య ఇంత ఘాటు ప్రేమ ఎలా ఏర్పడిందా?' అనే ఆలోచనలో పడ్డారు. అయితే చిరు కాంగ్రెస్ పార్టీలో చేరడం, సోనియా దగ్గర పరపతి సంపాదించడం చూసి మోహన్ బాబు, ఎందుకైనా మంచిదని చిరుతో రాజీ పడ్డాడనీ, చిరు కూడా మోహన్ బాబు లాంటి 'ఫైర్ బ్రాండ్' తన పక్షాన వుండడం ఉపయోగకరమేనన్న ఆలోచనతో హ్యాపీగా ఫీలయ్యాడనీ టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఏమైనా, రాజకీయాల్లోనూ సినీ రంగంలోనూ శాశ్వత మిత్రులు...శాశ్వత శత్రువులు ఉండరనే విషయాన్ని చిరు, మోహన్ బాబులు మరోసారి నిరూపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి