ప్రముఖ సాహితి వేత్త , తెలుగు నేలకు గర్వ కారణం శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి .ఈయన ఆవిర్భావం 23.04.1891 ,
తిరోధానం 25.02.1961 . తెలుగు కధానిక శతజయంతి సందర్భముగా శ్రీ వేదగిరి కమ్యూనికేషన్ హైదరాబాద్ వారి ఆద్యర్యములో 24.01.2010 న రాజమండ్రి పాల్ చౌక్[కోటిపల్లి బస్సు స్టాండ్ సెంటర్ ] లో ఆయన విగ్రహవిస్కరణ జరిగింది . సభలో వక్తలు మాట్లాడుతూ తన కధలతో రాజమండ్రి సంస్కృతిని సుసంపన్నం చేసిన సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్యం గోదావరి ఉన్నంత కాలం జీవిస్తుంది అన్నారు ,ఆయన రాసిన ఆత్మ బలిదానం మనో విజ్ఞానిక నవల చదివినప్పుడు ఆయన లోని గొప్పదనం బయట పడుతుంది అన్నారు .ఉమ్మడి కుటుంబం లోని ముద్దు ,ముచ్చట్లు ,ఆత్మీయతలు శాస్త్రి కధలలో
కనిపిస్తయన్నారు.
పనికి రాని రాజకీయనాయకుల విగ్రహాలు అడుక్కు ఒక్కటి ఉన్న ఈ రోజుల్లో, ఓ మహనీయుడి విగ్రహ స్థాపన హృదయంగమమైన విషయం. ఆయన రచనలు కొన్ని, ఏ కాలానికైనా వర్తించేవి.
రిప్లయితొలగించండి