HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

13, జనవరి 2010, బుధవారం

సూర్య గ్రహణం 15-01-2010

ఈ సంవస్త్స్తరం పుష్య బహుళ అమావాస్య శుక్రవారం 15-01-2010 వ తేదీన ఉత్తరాషాడ నక్షత్రమందు మద్యాహ్నం సంపూర్ణ సూర్య గ్రహణం పట్టును .రాహుగ్రస్తము, అపస్సవ్య గ్రహణము.స్పర్స కాలము ఉదయం గం .11.38, మద్యాకాలం గం . 01.39, మోక్షకాలం గం.03.20. ఆద్యంత పుణ్య కాలము గం .03-42.
ఈ గ్రహణము ఉత్తరాషాడ నక్షత్రమందు పట్టుతచే ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు [ధనుస్సు ,మకర రాసుల వారు]గ్రహణము చూడ రాదు .నిత్య భోజన ప్రత్యబ్దీకాదులు సుద్ధ మోక్ష కాలము అయ్యిన తరువాత ,బింబ దర్శనము చేసుకుని,స్నానము చేసిన తరువాత ఆచరించవలెను .
గ్రహణములు పట్టు నక్షత్రములవారు ,రాసులవారు గ్రహనానంతరము స్నానము చేసి ,నక్షత్ర జపము ,ఈస్వరాభిషేకము చేఇంచుకొని దోష నివారణకు వారి యొక్క ఆర్ధిక స్తోమతను బట్టి బంగారము, వెండి, బియ్యము, వస్త్రములు, స్వయంపాకము తగిన దక్షినలతో బ్రాహ్మణులకు దానము చేయవలెను .

1 కామెంట్‌:

  1. నమస్కారం మారుతి గారు. మీ బ్లాగు బాగుంది. మీరు అడిగిన లింక్ ఇదిగో చూడండి.

    http://groups.google.com/group/telugublog?hl=en

    ఇక్కడ మీరు చేరండి. మీకు బ్లాగుకు సంబంధించిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి.

    రిప్లయితొలగించండి