HEAD LINES
tml"/>Get this Widget
4, జనవరి 2010, సోమవారం
సంక్రాంతి - 1
ఈ పండగ దగ్గర గా వొస్తోంది అంటే నాకు నా చిన్న నటి జ్ఞాపకాలు కళ్ళముందు కడులడుతూ వుంటై .చిన్న తనములో ముందు రోజు స్నేహితులు నలుగురు ఒక గంప పట్టుకొని ఎప్పుడెప్పుడు పండగ ?ఈదాడి పండగ ,పండగెండుకొచ్చింది? పప్పులు తినడానికి వొచ్చింది ,అల్లుడు ఎందుకు వొచ్చాడు ? అరిసలు తినడానికి వొచ్చాడు .అంటూ పాడే పాటలు ఆ గంపలో పరుగు పరుగున ఇంటిలోనుండి ఒక చెక్కపేడు,రెండు పిడకలు పట్టుకువోచ్చి వేసేవాళ్ళం ,పండగనేల పట్టింది మొదలు బడి నుడి తిరిగొచ్చిభోగి పిదకలకై ఆవుపేడ కోసమై పరుగులు పెట్టేవాళ్ళం .ఆ పేడతో చిన్న చిన్న పిడకలు మద్యలో ఒక రంద్రముతో చేసి గోడకు కొట్టేవాళ్ళం .ఆ భోగి పీడకలలో మళ్లి తల్లిపిడక[ఇదు రంద్రములతో] అరటిపండు [మూడు రంద్రములతో] చేసేవాళ్ళం. ఈలోపుగా అమ్మవారి ఊరేగింపు వొచ్చేది .అమ్మ ఒక చెంబు లో నీలు అందులో కొంచం పసుపు కలిపి నీళ్ళు, పళ్ళెంలో బియ్యం ,పసుపు ముద్దా ,కుంకం ముద్దా పెట్టి చిల్లర పైసా దక్షిణగా పెట్టి పట్టుకువోచ్చేది .మేము వీధిలో ఎవరి ఇంటిలో ఉంది భోగి పిదకలపై చర్చ చేస్తున్న ,తాయారు చేస్తున్న కానీ ఈ అమ్మవారి దప్పుల మోతకు పరుగున వొచ్చి ఆ పళ్ళెం ఇవ్వడం కోసమై సిద్ధమయ్యే వాళ్ళం .ఆసాదు కాళ్ళపై నీళ్ళుపోసి బియ్యపు పళ్ళెం చేతికి ఇచ్చి దణ్ణం పెట్టుకుంటే ,ఆసాదు ఒక వేప ఆకూ కొంచెం పసుపు కుంకుమ పళ్ళెంలో వేసి ఇచ్చేవాడు .ఇక చీకటి పడ్డాక అక్క అమ్మ వీధి లో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టె కార్యక్రమం మొదలై వీధి లోఅందరి ముగ్గులు చూసుకుంటూ పోటాపోటిగా సాగుతూ చాల ప్రోడ్డ్డు పోయేది .మేము ఇది చూస్తూ ఒక్కొక్క సారి అరుగు పైనే అలనిద్రలోకి జారేవాళ్ళం.[మిగిలినది సంక్రాంతి - 2 లో ]
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి