HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

13, ఏప్రిల్ 2011, బుధవారం

'తీన్ మార్' తొలి రోజు షోలు 4000

'తీన్ మార్' తొలి రోజు షోలు 4000




ఈమధ్య పెద్ద హీరోల సినిమాలని రికార్డుల పేరిట ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీనిని పెద్ద గొప్పగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే, సినిమా ఒకవేళ అటు ఇటు అయినా, ఓపెనింగ్స్ రూపంలో కొంత వరకైనా లాగేయడానికి నిర్మాతలు వేసే ప్లాన్ ఇదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ నెల 14 న రిలీజ్ అవుతున్న 'తీన్ మార్' సినిమాని కూడా అలాగే మొత్తం 1150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారట.
హైదరాబాదులో 60 థియేటర్లు కాకుండా, నైజాంలో మరో 200 థియేటర్లలో దీనిని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే, తొలి రోజు టోటల్ గా 4000 షోలు పడతాయట! ఒక్క హైదరాబాదు ప్రసాద్ ఐమాక్స్ లోనే ఆ రోజు 30 షోలు వేస్తున్నారు. గతంలో ఇతరులవి ఈ థియేటర్లో 20 షోల రికార్డ్ వుంటే, పవన్ సినిమా మాత్రం 25 షోల రికార్డ్ వుంది. ఇప్పుడా రికార్డుని తనే క్రాస్ చేస్తున్నాడన్నమాట. ఇదిలా ఉంచితే, ఈ లెక్కన ఒక్క తొలి రోజే అన్ని షోలకు కలిపి 8 కోట్లు షేర్ వస్తుందట!
















11, ఏప్రిల్ 2011, సోమవారం

'టాం అండ్ జెర్రీ'ల ప్రేమ కథ!



'టాం అండ్ జెర్రీ'ల ప్రేమ కథ!

చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేట్టు ఉండేది. తెలుగు సినిమా వజ్రోత్సవాలప్పుడు, చిరంజీవికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంలో జరిగిన ఫంక్షన్లోనూ వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎవరూ మరచిపోలేరు. చిరు, మోహన్ బాబుల వార్ కేవలం వారి మధ్యే కాకుండా..వాళ్ల అభిమానుల మధ్య కూడా నడిచింది. అయితే ఉన్నట్టుండి ఈమధ్య వీళ్లిద్దరూ మంచి దోస్తులైపోయారు. మేమిద్దరం 'టాం అండ్ జెర్రీ' అంటూ ఇద్దరూ ఒకర్నొకరు తెగ పొగిడేసుకుంటున్నారు.
ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజుకి చిరంజీవి తిరుపతి వెళ్లడం...నిన్న టి.ఎస్సార్ అవార్డ్స్ ఫంక్షన్లో ఒకరి మీద మరొకరు జోకులేసుకోవడం...చూసిన జనం 'వీరిద్దరి మధ్య ఇంత ఘాటు ప్రేమ ఎలా ఏర్పడిందా?' అనే ఆలోచనలో పడ్డారు. అయితే చిరు కాంగ్రెస్ పార్టీలో చేరడం, సోనియా దగ్గర పరపతి సంపాదించడం చూసి మోహన్ బాబు, ఎందుకైనా మంచిదని చిరుతో రాజీ పడ్డాడనీ, చిరు కూడా మోహన్ బాబు లాంటి 'ఫైర్ బ్రాండ్' తన పక్షాన వుండడం ఉపయోగకరమేనన్న ఆలోచనతో హ్యాపీగా ఫీలయ్యాడనీ టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది.
ఏమైనా, రాజకీయాల్లోనూ సినీ రంగంలోనూ శాశ్వత మిత్రులు...శాశ్వత శత్రువులు ఉండరనే విషయాన్ని చిరు, మోహన్ బాబులు మరోసారి నిరూపించారు.


4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉగాది గీతి

పచ్చదనమై పల్లవించు ,

మావికోమ్మై చిగురించు

వేపపువ్వై పుష్పించు

నువ్వే వసంతమై హాసించు

ఉగాది కోయల వత్సరమంతా
నీ హృదిలోనే వసించు
-----------రఫాయిల్
ఆఫీసు అసిస్టెంట్,
పోస్టల్ స్టోర్ డిపో
రాజముండ్రి

3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఉగాది subhaakankshalu

ఉగాది శుభాకాంక్షలు

8, మార్చి 2011, మంగళవారం

Happy International Women's Day 2011

7, ఫిబ్రవరి 2011, సోమవారం

చేపటానికి (చెరప టానికి ) చేటపెయ్యి . [మన చిరంజీవి ]

ఈ మాట చాలా మంది వినే వుంటారు ,చాలామందికి తెలుసు కూడా .ఇది సామెతే ఐనా నిజం కూడా .దూడ చనిపోయిన తర్వాత ఆవు, లేదా గేదల నుండి పాలు పిండుకోవడానికి దూడ అని బ్రమ కలిగించే నాలుగు కాళ్ళు ,మోహము కర్రముక్కలలతో ఆకారము కల్పించి దానికి గడ్డి చుట్టి ఆపైన చనిపొఇన దూడ చర్మము వేసి కుట్టిన దూడలాంటి బొమ్మను (అదే చేటపేయి ) పాలు పిండే టైం లో ఆవు లేదా గేదెకు దగ్గరగా పోదుగువద్దపెట్టి అది దూడే అనుకొని బ్రమ లో నాకుతోంటే ఇదే అదునుగా పాలు పిండుకు త్రాగటం చాలా చోట్ల చూస్తూవుంటాము .పాలు పిండిన తర్వాత ఆ చేటపెయ్యిని గోడకు కొట్టిన కొయ్యకు తగిలిస్తారు .ఎందుకంటే దాని అవసరం మళ్ళీ పాలు తీసే టైం వరకు అవసరము లేదు కాబట్టి. దానికి గడ్డి నీరు ,దానా వేయనక్కరలేదు కాబట్టి.
అలాగనే కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి చనిపొఇన తర్వాత ,జగన్ బయటకు వొచ్చిన తర్వాత పార్టికి 1)పోఇన ఆకర్షణ ,2) జనబలం ,3) నాయకత్వ లోపం 4) వోట్లు అనే నాలుగు పొదుగుల నుండీ తమకు కావలిసింది పిండుకోవడానికి పనికి వొచ్చే చేటపెయ్యి మాత్రమె చిరంజీవి. [అవసరం తీరాక షరా మామూలే ]
ఎంతో ఆర్భాటముగా N T R ను దృష్టిలో పెట్టుకొని పాపం మన తూ. గో. జిల్లా శివుడు జనం పొగుడు తొంటే పార్టీని పెట్టి ఎన్నికల తర్వాత చతికిల బడి పోఇన పార్టీ ని ఏమి చేయాలిరా ఈపార్టి ని అనుకుంటున్నా సమయములో ,జగన్ కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ అనుకుంటున్నా సమయాన్ని [రోగి కోరుకోన్నదీ, డాక్టర్ కోరుకోన్నదీ ఒక్కటే అనే చందాన ] ఇద్దరూ అందిపుచ్చుకొని పదవి మాట దేముడెరుగు ఈ బరువు పరువు పోకుండగా దిగేతే చాలనుకున్నారు .[వాళ్ళ దృష్టిలో పరువు పోక పాయినా ఎలాగూ పాయిందనుకోండి ]. 30 years industry మకుటం లేని మహారాజులా వెలిగిన అన్నయ్యను ఎవ్వరేనా ఏమైనా వేలెత్తి చూపితే కబడ్ దార్ అనే తమ్ముళ్ళు ఈ రోజు బుర్ర ఎత్తుకొలేని పరిస్తితి .
# మా పెద్దాయన ఒకరు అనేవారు ఈ పార్టీలు అన్ని మఖలో పుట్టి పుబ్బలో పోతాయిరా అని .# ఏమిటా అనుకొనే వాడిని .దాని అర్ధం ఇప్పుడు తెలిసింది .

5, ఫిబ్రవరి 2011, శనివారం

రధ సప్తమి

రవి పుట్టిన రోజు రథ సప్తమి


లోకబాంధవుడు, గ్రహాలకు అధిపతి, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి సూర్యునికి భూమి చేరువ కావడం ప్రారంభమవుతుంది. అంటే భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది. సర్వదేవమయుడైన ఆదిత్యుని ఆరాధించడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. అందుకు అనుకూలమైన రథసప్తమి ఈ నెల 10, గురువారం. ఈ సందర్భంగా ఈ వ్యాసం.

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మించినవాడే సూర్యుడు. ఈయన రవి, భాను, అర్క, భాస్కర, సవిత, వివస్వత, సర్వాత్మక, సహస్రకిరణ, పూష, గభస్తిమాన్, ఆదిత్యుడు అనే ఇతర నామాలతో కూడా ప్రసిద్ధుడు. ఛాయాదేవి, సంజ్ఞాదేవి ఈయన పత్నులు. శనీశ్వరుడు, యముడు, యమున మున్నగువారు వీరి సంతానం.
సూర్యభగవానుడు అన్ని జీవులపట్ల సమదృష్టి కలిగిన వాడు.

ఆరోగ్యప్రదాత. మహాశక్తిమంతుడు. సకల శాస్తప్రారంగతుడు. ఆంజనేయునికి గురువు. సువర్చలాదేవి ఈయన మానస పుత్రిక. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ధనం వ్యయం చేసినా, విద్యాబుద్ధులు ఒంటబట్టక నిరాశలో ఉన్నవారు తమ జాతకం ప్రకారం సూర్యుని పూజించి, ఆయనను ప్రసన్నం చేసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుందని నవగ్రహపురాణం చెబుతోంది. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు.
నేత్రవ్యాధులు, శత్రుబాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శుచిగా ఉండి, నియమాలు పాఠిస్తూ, మండలం రోజులపాటు నిష్ఠగా ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి.

రామరావణ సంగ్రామంలో రాముని బలం క్షీణించి, నిరాశానిస్పృహలలో కూరుకుపోయి ఉన్న సమయంలో... అగస్త్య మహర్షి శ్రీరామునికి వారి వంశ మూలపురుషుడైన సూర్యుని శక్తిని వివరించి, ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు. ఆ దివ్యశ్లోకాలను పఠించిన శ్రీరాముడు నూతన శక్తిని పుంజుకుని యుద్ధంలో విజయం సాధించినట్లు రామాయణ మహాకావ్యం పేర్కొంటోంది. దీనిని బట్టి సూర్యారాధన ఎంతటి శ్రేష్ఠమైనదో తెలుస్తోంది.

రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది.

రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరికి ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ.

- డి.వి.ఆర్. భాస్కర్