HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

12, ఆగస్టు 2011, శుక్రవారం

ఔషధంగా పనిచేసే 16 రకాల పూవులు

ఔషధంగా పనిచేసే 16 రకాల పూవులు

(16 Medicinal Flowers)

దేవతార్చనలో పూవులు ప్రధాన పాత్ర వహిస్తాయి. పూజకు ఉపయోగించే సుమాల్లో 16 రకాల పుష్పాలు, ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఈ 16 రకాల పూలు విశిష్టమైనవని తెలుసు కానీ, వీటిల్లో ఔషధ లక్షణాలు ఉన్నాయని మనలో చాలామందికి తెలీదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.మల్లెపూలు పరిమళభరితమైన మల్లెపూలు శాస్త్రీయంగా కూడా చాలా ఉత్తమమైనవి. కంటి జబ్బులను తగ్గిస్తాయి. రక్తదోషాన్ని నివారిస్తాయి. వాత గుణాన్ని తగ్గిస్తాయి.

2. సన్నజాజి శరీర తాపాన్ని పోగొడతాయి. త్రిదోషాలను నివారిస్తాయి. కంటి జబ్బులను హరిస్తాయి. మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి.

3.విరజాజి వాతాన్ని హరిస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. శరీర భారాన్ని తగ్గించి, తెలికపడేలా చేస్తాయి. ముఖంలో తేజస్సును పెంచుతాయి.

4.చేమంతి చలువ చేస్తాయి. అతి వేడిని, లేదా, అతి చల్లదనాన్ని తగ్గించి, సమశీతోష్ణతను కలిగిస్తాయి. క్రిమి కీటకాల వల్ల వచ్చే సమస్త జ్వరాలు, రోగాలనూ, నరాల బలహీనతను హరిస్తాయి. జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా చేస్తాయి.

5. చెంగల్వ శ్రమ, అలసటలను పోగొడతాయి. రక్త, వాత, పిత్త దోషాలను నివారిస్తాయి. కంటి జబ్బులను తగ్గించి, కళ్ళకు చలవ చేస్తాయి.

6. కమలం కంటి జబ్బులను తగ్గిస్తాయి. శరీరంలో ఉన్న ఉష్ణాన్ని హరిస్తాయి. గర్భస్రావానికి కమలాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

7.తామర దాహంతో నాలుక పిడచవారే లక్షణాన్ని తామరపూలు వెంటనే తగ్గిస్తాయి. రక్త, పిత్త, వాత దోషాలను హరిస్తాయి. శరీరానికి దివ్య తేజస్సును ఇస్తాయి.

8. మరువం మరువపు పరిమళం మనసుకు హాయి కలిగించి సేద తీరుస్తుంది. వాత దోషాలను తగ్గిస్తుంది. మరువం ఆకుల రసం తీసి చెవిలో పోస్తే చెవి పోటు, చీము కారడం లాంటి అనారోగ్యాలు తగ్గుతాయి.

9. నందివర్ధనం కళ్ళు ఎర్రగా అవడం, కళ్ళ మంటలు లాంటివి తగ్గించి, కంటికి చలవ చేస్తాయి. తలనొప్పిని తగ్గిస్తాయి. రక్త దోషాలను నివారిస్తాయి.

10.సంపెంగ శరీరాన్ని సమమైన ఉష్ణోగ్రతలో ఉంచుతాయి. కఫం తగ్గుతుంది. రక్త, పిత్త దోషాలు హరిస్తాయి. మూత్రపిండాల్లో చోటుచేసుకునే అపసవ్యతలను సంపెంగలు దివ్యంగా తగ్గిస్తాయి.

11.మొగలి మొగలిపూలు శ్లేష్మాలను, ఉష్ణ ప్రకోపాలను, అన్ని వాతాలను హరిస్తాయి. ఎండిన మొగలి రేకులతో పొగ పెట్టుకుని పీల్చినట్లయితే ఉబ్బసం తగ్గుతుంది.

12.పారిజాతం మధుమేహ వ్యాధిని నివారిస్తాయి. శరీర వాపును తగ్గిస్తాయి. క్రిమి సంహారిణిగా పనిచేస్తాయి. వేడిని, వాతాన్ని, కఫాన్ని తగ్గిస్తాయి.

13. ధవనం గుండె జబ్బులకు ధవనం ఔషధంలా పనిచేస్తుంది. వాతం, కఫం, తగ్గుతాయి. చర్మ వ్యాధులను నివారిస్తుంది. ఆఖరికి మశూచిని కూడా పోగొడుతుంది.

14.మాధవీలత గాయాలు, వ్రణాలను తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు తగ్గుతాయి. పిత్త, వాత రోగాలు హరిస్తాయి. శ్వాస సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి.

15.మందారం కురులకు దివ్య ఔషధం మందారం. చుండ్రు, పేను కొరుకుడు, జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు, జుట్టు నలుపు రంగు తగ్గడం, వెంట్రుకలు చిట్లడం లాంటివాటిని మందార తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు, మూత్ర సంబంధ జబ్బులు, మంటలు, నొప్పులు, పోట్లు, రుతుక్రమ అనారోగ్యాలు మొదలైనవి మందారతో నయమౌతాయి.

16.పొద్దుతిరుగుడు దగ్గును, చర్మ వ్యాధులను నివారిస్తుంది. క్షయ వ్యాధి కూడా తగ్గుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి