HEAD LINES
31, ఆగస్టు 2011, బుధవారం
వినాయక పూజకు అర్హమైన 21 ఏక విసంటి పత్రములు
౨] బృహతీ పత్రము -దీనినే తెలుగులో "నేలమునగ "అందురు. దీని వృక్ష శాత్రీయ నామము "సోలానం ఇందికం " .ఇది వాతములను,కఫము ,మలబద్దకము,ఉబ్బసము,దగ్గులను నివారించును.
౩] బిల్వ పత్రము- తెలుగులో దీనిని "మారేడు" అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "అయగల్మార్మియోలాస్ ".ఇది మధుమేహమునకు ఔషదం గా వాడతారు.
౪]దూర్వాయుగ్మము -దీనినే తెలుగులో "గరిక" అంటారు. దీని వృక్ష శాత్రీయ నామము "పయనదిన్ దక్సిలన్ "అంటారు. ఇది చర్మరోగాములకు,చుండ్రుకు బాగా ఉపయోగపడును.
౫]దుత్తూర పత్రము- దీనినే తెలుగులో "ఉమ్మెత్త "అందురు.దీని వృక్ష శాత్రీయ నామము "దత్తూర్ మెటల్ " అంటారు.ఇది వెంట్రుకలు రాలకుండగా అరికడుతుంది.దీనిని మానసిక రోగముల నివారణలో ఉపయోగిస్తారు.
౬]బదరీ పత్రము-దీనినే తెలుగులో "రేగు" అనిఅంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "జిజిఫన్ మారి షానారక్త దోషములను హరించుట,ఎముకలకు బలము చేకూర్చుట,జీర్ణ శక్తిని కలిగించుట దీని లక్షణము.
౭]అపామార్గ పత్రము- తెలుగులో "ఉత్తరేణి" అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ఎకిరందిస్ అస్సేరా ".మూల సంక ,మలబద్దకాన్ని నివారిస్తుంది.
౮]తులసి పత్రము- ఇది తెలియని వారుండరు,దీని వృక్ష శాత్రీయ నామము "అసిముం sanktam " tuasi dalamula teerdhmu prasatamu .
౯]చూత పత్రము _తెలుగులో దీనిని "మామిడి అంటారు."దీని వృక్ష శాత్రీయ నామము "మంగి ఫరా ఇండికా "అంటారు. పెరుగుతో కలిపి ఆకులూ నూరి కాళ్ళ పగుళ్ళు అరికడతాయి .
౧౦]కరవీర పత్రము- తెలుగులో "గన్నేరు" అంటారు. గన్నేరు పై పూటకు మాత్రమె వాడతారు.మొండి vranamulu tagginchunu .
౧౧] విష్ణు క్రాంత పత్రము- దీనిని తెలుగులో "అవిస" అంటారు. దీని వృక్ష శాత్రీయ నామము "ఇవాల్యులాస్ అన్సినాయిదీస్ ".ఇది పళ్ళను గట్టి పరుస్తుంది,మంచి దృష్టిని, ధారణా శక్తిని ఇస్తుంది.
౧౨]దాడిమీ పత్రము _ తెలుగులో "దానిమ్మ" అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ప్యునికాగానటం" అంటారు. వాతము,పిత్తము,కఫము నివారిస్తుంది.
౧౩]దేవదారు పత్రము= దీనికి తెలుగులో కూడా అలానే పిలుస్తారు.దీని వృక్ష శాత్రీయ నామము "సైద్రాన్ దెఒ దార్ " అంటారు. దీని తైలము కాళ్ళ నొప్పుల బాగా పనిచేస్తుంది.
౧౪]మరువక పత్రము- తెలుగు లో "మరువము" అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ఒరిజినం మరజోరనా" అంటారు.ఇది శరీర దుర్వాసనలను పోగొట్టి,గజ్జి వంటి వాటినుండి రక్షిస్తుంది.
౧౫] సింధువార పత్రము- తెలుగులో దీనిని" వావిలాకు "అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "వై టెక్ ఎక్స్ నిర్గుందే "అంటారు. దీని ఆకులు కీళ్ళ నొప్పిని, తల నొప్పిని తగ్గిస్తుంది.
౧౬]జాజి పత్రము-తెలుగులో "సన్నజాజి " అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "జస్మినం గ్లాంది ఫోరం ".దీని నుండి సుగంధ తైలం తీస్తారు.
౧౭]గండలీ పత్రము- తెలుగులో దీనిని "కామంచి ఆకు అంటారు "దీని వృక్ష శాత్రీయ నామము" సాలోనం నిగ్రకుం ".ఇది అపస్మారక స్తితి, మూర్చ రోగములకు పనిచేయును.౧౮
18] shamee పత్రము= తెలుగులో జమ్మి ఆకు అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ప్రోసో పీస్ స్పెసిగేరా" .ఇది అతి సారము నివారిస్తుంది.
౧౯]అశ్వద్ద పత్రము- తెలుగులో రావి ఆకు అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ఫికేన్ వేనోసా" ఇది రక్త స్రావమును అరికట్టును.
౨౦]అర్క పత్రము- తెలుగులో జిల్లేడు అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "కిలోత్రోపిస్ ప్రోసిరా "ఇది అరవై నాలుగు వ్యాధులను నివారించునని అంటారు.
౨౧]అర్జున పత్రము- తెలుగులో మద్ది ఆకు అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "తెర్మినాలియా అర్జున " ఇది కీళ్ళ నొప్పిని నివారిస్తుంది.
17, ఆగస్టు 2011, బుధవారం
10 Awesome Grass Sculptures
10 Awesome Grass Sculptures
Here are 10 amazing sculptures made only of grass! Quite intricately sculpted, must see sculptures! Includes sculptures from elephants to giraffes to even unicorns!
15, ఆగస్టు 2011, సోమవారం
భైరవకోన పార్వతీదేవి గుడి
భైరవకోన పార్వతీదేవి గుడి
(Bhairavakona Parvati Devi Temple)
అమ్మవారి దేవాలయం ఎక్కడ కొలువైనా అది భక్తులకు పరవశాన్ని ఇస్తుంది. దివ్యశక్తి శోభిస్తూ కళకళలాడుతుంది. ప్రకాశం జిల్లా కొత్తపల్లి దగ్గర్లోని పార్వతీదేవి ఆలయం కూడా అంతే. సరిగ్గా చెప్పాలంటే, పార్వతీదేవి దేవాలయం కొత్తపల్లికి దగ్గర్లో, భైరవకోన అడవుల్లో ఉంది. ఈ గుడి అడవుల్లో ఉండటాన ప్రతిరోజూ కాకుండా, ప్రతి శుక్రవారం అర్చిస్తారు. అలాగే, పండుగలు, పర్వదినాలు లాంటి విశేష దినాల్లో ఉత్సవాలు జరుపుతారు.
ప్రకాశం భైరవకోన పార్వతీదేవి ఆలయం కొత్త పాతల మేలు కలయిక అంటే బాగుంటుంది. ఎందుకంటే, ఈ గుడి ప్రాచీనమైనది కాదు, ఇటీవలి కాలంలో నిర్మించిందే. కానీ, ఆలలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం మాత్రం ప్రాచీనమైంది. భైరవకోన అరణ్యంలో కొండలున్నాయి. ఆ కొండ గుహల్లో లభించిన పార్వతీదేవి శిల్పం ఈ గుడిలో స్థాపించడాన ఇది విశిష్టతను సంతరించుకుంది.
స్థల పురాణాన్ని అనుసరించి, ప్రకాశం భైరవకోన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లికి సమీపంలో ఉన్న అడవిలో కొండలు, కోనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా! అందులో ఓ కొండ గుహలో భైరవ శిల్పం ఉంది. దానివల్లే ఈ కొనకు భైరవకోన అనే పేరు వచ్చిందట. మరో కథనాన్ని అనుసరించి, పూర్వం భైరవుడు అనే రుషి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడట. ఆ రుషి పేరు మీదనే వనానికి భైరవవనం అనే పేరు వచ్చింది అంటారు. భైరవ రుషి, తన తపశ్శక్తితోఒక వ్యక్తికి దివ్యశక్తిని ప్రసాదించి, ఆ కొండల్లో అనేక అద్భుత శిల్పాలను, గుహాలయాలను నిర్మింప చేశాడట. మహర్షి తపస్సు చేసిన ప్రాంతం గనుక ఈ పరిసరాలు పునీతమయ్యాయి.
అమ్మవారి దేవాలయంతో పవిత్ర స్థలంగా భావించే భైరవకోన చూడ చక్కని ప్రదేశం. ఇక్కడి గుహాలయాలు ప్రాచీన వైభవాన్ని చాటే కళా నిలయాలు. ఒక గుహలోని శివుని విగ్రహం వెనుక చెక్కిన పార్వతిని భక్తిశ్రద్ధలతో ఆరాచిన్చేవారట. ఒకసారి భైరవకోన గుహాలయాలను దర్శించడానికి వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతి శివుని ప్రతిమ వెనుక కనిపిస్తున్న విగ్రహం అమ్మవారిది కాదని తేల్చి చెప్పారు. కనుక ఆ శిల్పాన్ని పార్వతీదేవిగా ఆరాధించడం సముచితం కాదని చెప్పారు. దాంతో ఆ ప్రాంతీయులు వెంటనే విరాళాలు సేకరించి, తమ ఆరాధ్యదైవమైన పార్వతీదేవికి ఒక ఆలయం నిర్మించారు.
పర్ణశాల రామాలయం
పర్ణశాల రామాలయం
(Parnasala, shoka Ramalaya)
భద్రాచల కోదండ రామాలయం జగత్ ప్రసిద్ధం. ఆ ఆలయ రీత్యా భద్రాచలాన్ని, మొత్తం ఖమ్మం జిల్లానీ పరమ పవిత్రంగా భావిస్తారు. అలాగే పర్ణశాల రామాలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
పర్ణశాల రామాలయం ఖమ్మం జిల్లా, భద్రాచలానికి కొద్ది దూరంలో పర్ణశాలలో ఉంది. శ్రీరాముడు, వనవాస కాలంలో ఇక్కడ పర్ణశాల వేసుకుని నివాసమున్నట్లు వాల్మీకి రామాయణం, ఇంకా అనేక పురాణ కథలు వివరిస్తున్నాయి.. సీతమ్మ మాయలేడిని చూసి వ్యామోహపడటం, రావణాసురుడు, సీతమ్మను ఎత్తుకుపోయిన ప్రదేశమూ ఇదే. రావణాసురుని రథ చక్రాల గుర్తు ఉన్న గుట్ట కూడా ఇక్కడుంది. దాన్ని రావణ గుట్ట అంటారు. ఇలాంటి ఎన్నో నిదర్శనాలు ఇక్కడ సీతారాముల నివాసాన్ని ధృవీకరిస్తూ ఇప్పటికీ కనిపిస్తాయి. శ్రీరాముడు పర్ణశాల వేసుకుని నివాసమున్న ప్రదేశం కనుక ఈ ఊరికి పర్ణశాల అనే పేరు వచ్చింది.
పర్ణశాలలో వెలసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. నిండుగా ప్రవహించే గోదావరి తీరంలో ఉన్న ఈ గుడిలో అడుగు పెడితే చాలు మహా ప్రశాంతంగా ఉంటుంది.ఒకవైపు నది, ఇంకోవైపు కొండలతో ఈ ఊరు సౌందర్యానికి ప్రతీకలా ఉంటుంది. ప్రకృతి కాంత పరవశిస్తూ ఇక్కడ ఒదిగిపోయినట్లుగా ఉంటుంది.
పర్ణశాల దేవాలయానికి కొద్ది దూరంలో సీతమ్మ వాగు పేరుతో ఒక కొండవాగు ఉంది. ఆ వాగులో సీతమ్మ స్నానం చేసేదని, అందుకే దానికి సీతమ్మ వాగు అనే పేరు వచ్చిందని అంటారు. వాగు పక్కనే ఉన్న కొండ చరియలు అనేక రంగులతో కళాత్మకంగా ఉంటాయి. సీతమ్మవారు అక్కడ పసుపు కుంకుమల కోసం కొన్ని రాళ్ళను వాడేదని, అందుకే ఆ రంగు రంగుల కొండ రాళ్ళు మరింత శోభను సంతరించుకున్నాయని అంటారు. సీతమ్మ, రామయ్యలు తిరిగిన ఈ ప్రదేశాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు విస్తారంగా వస్తుంటారు.
సీతమ్మ దుస్తులు ఆరబెట్టుకున్న చోటు, నగలు ఉంచిన ప్రదేశం, పసుపు కుంకుమలకు ఉపయోగించిన రాళ్ళు అంటూ ఒక్కో రాయినీ, ప్రదేశాన్నీ స్థానికులు చూపిస్తుంటే భక్తుల సంతోషానికి అవధులు ఉండవు.
12, ఆగస్టు 2011, శుక్రవారం
ఔషధంగా పనిచేసే 16 రకాల పూవులు
ఔషధంగా పనిచేసే 16 రకాల పూవులు
(16 Medicinal Flowers)
దేవతార్చనలో పూవులు ప్రధాన పాత్ర వహిస్తాయి. పూజకు ఉపయోగించే సుమాల్లో 16 రకాల పుష్పాలు, ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఈ 16 రకాల పూలు విశిష్టమైనవని తెలుసు కానీ, వీటిల్లో ఔషధ లక్షణాలు ఉన్నాయని మనలో చాలామందికి తెలీదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.మల్లెపూలు పరిమళభరితమైన మల్లెపూలు శాస్త్రీయంగా కూడా చాలా ఉత్తమమైనవి. కంటి జబ్బులను తగ్గిస్తాయి. రక్తదోషాన్ని నివారిస్తాయి. వాత గుణాన్ని తగ్గిస్తాయి.
2. సన్నజాజి శరీర తాపాన్ని పోగొడతాయి. త్రిదోషాలను నివారిస్తాయి. కంటి జబ్బులను హరిస్తాయి. మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి.
3.విరజాజి వాతాన్ని హరిస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. శరీర భారాన్ని తగ్గించి, తెలికపడేలా చేస్తాయి. ముఖంలో తేజస్సును పెంచుతాయి.
4.చేమంతి చలువ చేస్తాయి. అతి వేడిని, లేదా, అతి చల్లదనాన్ని తగ్గించి, సమశీతోష్ణతను కలిగిస్తాయి. క్రిమి కీటకాల వల్ల వచ్చే సమస్త జ్వరాలు, రోగాలనూ, నరాల బలహీనతను హరిస్తాయి. జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా చేస్తాయి.
5. చెంగల్వ శ్రమ, అలసటలను పోగొడతాయి. రక్త, వాత, పిత్త దోషాలను నివారిస్తాయి. కంటి జబ్బులను తగ్గించి, కళ్ళకు చలవ చేస్తాయి.
6. కమలం కంటి జబ్బులను తగ్గిస్తాయి. శరీరంలో ఉన్న ఉష్ణాన్ని హరిస్తాయి. గర్భస్రావానికి కమలాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
7.తామర దాహంతో నాలుక పిడచవారే లక్షణాన్ని తామరపూలు వెంటనే తగ్గిస్తాయి. రక్త, పిత్త, వాత దోషాలను హరిస్తాయి. శరీరానికి దివ్య తేజస్సును ఇస్తాయి.
8. మరువం మరువపు పరిమళం మనసుకు హాయి కలిగించి సేద తీరుస్తుంది. వాత దోషాలను తగ్గిస్తుంది. మరువం ఆకుల రసం తీసి చెవిలో పోస్తే చెవి పోటు, చీము కారడం లాంటి అనారోగ్యాలు తగ్గుతాయి.
9. నందివర్ధనం కళ్ళు ఎర్రగా అవడం, కళ్ళ మంటలు లాంటివి తగ్గించి, కంటికి చలవ చేస్తాయి. తలనొప్పిని తగ్గిస్తాయి. రక్త దోషాలను నివారిస్తాయి.
10.సంపెంగ శరీరాన్ని సమమైన ఉష్ణోగ్రతలో ఉంచుతాయి. కఫం తగ్గుతుంది. రక్త, పిత్త దోషాలు హరిస్తాయి. మూత్రపిండాల్లో చోటుచేసుకునే అపసవ్యతలను సంపెంగలు దివ్యంగా తగ్గిస్తాయి.
11.మొగలి మొగలిపూలు శ్లేష్మాలను, ఉష్ణ ప్రకోపాలను, అన్ని వాతాలను హరిస్తాయి. ఎండిన మొగలి రేకులతో పొగ పెట్టుకుని పీల్చినట్లయితే ఉబ్బసం తగ్గుతుంది.
12.పారిజాతం మధుమేహ వ్యాధిని నివారిస్తాయి. శరీర వాపును తగ్గిస్తాయి. క్రిమి సంహారిణిగా పనిచేస్తాయి. వేడిని, వాతాన్ని, కఫాన్ని తగ్గిస్తాయి.
13. ధవనం గుండె జబ్బులకు ధవనం ఔషధంలా పనిచేస్తుంది. వాతం, కఫం, తగ్గుతాయి. చర్మ వ్యాధులను నివారిస్తుంది. ఆఖరికి మశూచిని కూడా పోగొడుతుంది.
14.మాధవీలత గాయాలు, వ్రణాలను తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు తగ్గుతాయి. పిత్త, వాత రోగాలు హరిస్తాయి. శ్వాస సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి.
15.మందారం కురులకు దివ్య ఔషధం మందారం. చుండ్రు, పేను కొరుకుడు, జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు, జుట్టు నలుపు రంగు తగ్గడం, వెంట్రుకలు చిట్లడం లాంటివాటిని మందార తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు, మూత్ర సంబంధ జబ్బులు, మంటలు, నొప్పులు, పోట్లు, రుతుక్రమ అనారోగ్యాలు మొదలైనవి మందారతో నయమౌతాయి.
16.పొద్దుతిరుగుడు దగ్గును, చర్మ వ్యాధులను నివారిస్తుంది. క్షయ వ్యాధి కూడా తగ్గుతుంది.
శుభ కార్యాల్లో పసుపు వస్త్రాలు ఎందుకు?
శుభ కార్యాల్లో పసుపు వస్త్రాలు ఎందుకు?
(Purpose of Yellow Clothes)
హిందువుల పూజాది కార్యక్రమాల్లో, పెళ్ళిళ్ళు ఇతర శుభ కార్యాల్లో పసుపు బట్టలకు చాలా ప్రాధాన్యత ఉంది. హోమం పూర్తయిన తర్వాత కృష్ణాజినపు ముక్క, మోదుగు చేతి కర్ర, మౌంజిలతో బాటు పీతవస్త్రం ధరించాల్సి ఉంటుంది. కానీ, ఎందుకు, ఏమిటి అనేది మాత్రం చాలామందికి తెలీదు. అసలు పీతవస్త్రం ఎందుకు ధరిస్తారో, పసుపు రంగులో ఉన్న గొప్పతనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపులో క్రిమి నాశక గుణం ఉంది. అందుకే మనం పసుపును ఏదో రూపంలో ఉపయోగిస్తుంటాం. గడపకు పసుపు రాయడంలో కళాత్మకత మాత్రమే పరమార్థం కాదు. చీమలు, ఇతర సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయనే ఆలోచతో ఈ ఆచారం బయల్దేరింది. అలాగే కూరల్లో పసుపు వేయడంవల్ల ఆకర్షణీయమైన రంగు రావడమే కాకుండా ఆరోగ్యానికీ మంచిది. స్నానం చేసేముందు ముఖానికి, వంటికి పసుపు రాసుకుంటారు. ఇలా చేయడంవల్ల శరీర ఛాయ పెరుగుతుందని, అనేక రుగ్మతలు తగ్గుతాయని, చర్మ వ్యాధుల్లాంటివి రావని పెద్దలు చెప్తారు.
శ్రీచూర్ణం, కుంకుమల్లో కూడా పసుపు ఉంది. ముగ్గుల్లో పసుపు జల్లుతాం. ఆయుర్వేద వైద్యంలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. తులసి మొక్కకు పసుపు రాస్తాం. హిందూ సంస్కృతిలో పసుపు వాడకం ఒక అలవాటుగా, ఆచారంగా ఉంది. దీన్ని మంగళప్రదమైన ద్రవ్యంగా వాడుతున్నాం.
పసుపు చర్మ వ్యాధులను నయం చేస్తుంది. అలాగే, చర్మ రోగాల కారణంగా వచ్చే ఇతర రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. పరిణామశూల లాంటి ఇబ్బందికరమైన వ్యాధులను నయం చేస్తుంది. పైకి కనిపించే జబ్బులను, కనపడకుండా బాధ కలిగించే వ్యాధులను కూడా పసుపు నివారిస్తుంది.
పసుపురంగులో ఒక వింత ఆకర్షణ ఉంది. ఈ రంగు దుస్తులు ధరించడంవల్ల శరీర వర్చస్సు పెరుగుతుంది. దాతో పసుపు బట్టలు వేసుకున్నవారిపట్ల ఎదుటివికి ఒకవిధమైన సద్భావం కలుగుతుంది. పసుపు రంగు నరాలను కూడా ఉత్తేజపరుస్తుంది.
మానవ శరీరం పంచభూతాల సమ్మేళనం. అనుక్షణం నవగ్రహాల ప్రభావం మనమీద పడుతుంటుంది. పసుపురంగుకు పంచభూతాలు, నవగ్రహాలను అనుకూలంగా మార్చే శక్తి ఉంది. అందుకే మహర్షులు ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకునేలా ఆచారాలను ప్రబోధించారు. తపస్వుల అనుభవ జ్ఞానంతో అంకురించినవే వివిధ ఆచారాలు. వాటిని మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడిప్పుడు రంగుల చికిత్స లేదా కలర్ థెరపీ అమల్లోకి వస్తోంది. కానీ మన మహర్షులు ఈ జ్ఞానామృతాన్ని ఏనాడో బోధించారు.
పూర్వం విద్యార్థులు గురుకులానికి వెళ్ళి చదువుకునేవారు. అక్కడ అనేకమంది కలిసి ఉంటారు కనుక ఎవరికైనా వ్యాధులు ఉంటే, ఇతరులకు సోకే ఇబ్బంది ఉందని, పీత వస్త్ర ధారణ చేసేవారు. అలా విద్యాభ్యాసం చేసేంతకాలం పీత వస్త్రాలు మాత్రమే ధరించేవారు.
హిందూ సంప్రదాయాన్ని అనుసరించి, పెళ్ళిలో వధూవరులు పసుపుబట్టలు ధరిస్తారు. అలాగే పెళ్ళికూతురి తలపై పసుపు అద్దిన చట్రం ఉంచుతారు. వధువు అత్తగారిల్లు చేరేవరకూ ఆ చట్రం అలాగే ఉంటుంది. ఆంగ్లేయుల పరిపాలన మొదలైన తర్వాత వధూవరులు పసుపు బట్టలే ధరించాలి అనే నియమం సడలినప్పటికీ, తలంబ్రాలు పోసుకునే సమయంలో పసుపు అద్దిన వస్త్రాలనే ధరిస్తున్నారు. అలాగే, తలంబ్రాలు పడటంవల్ల కూడా అవి మరింత పచ్చగా తయారవుతాయి.