HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

26, జులై 2011, మంగళవారం

ఆదివారంప్రత్యేకత ఏమిటి?

ఆదివారంప్రత్యేకత ఏమిటి?

(Speciality of Sunday)

సూర్యుణ్ణి గ్రహరాజు లేదా గ్రహాలకి అధిపతి అంటాం. ఆ సంగతి అలా ఉంచితే సూర్యుడు లేకపోతే మనకు వెలుగే లేదు. అంధకారంలో పడి కొట్టుకుపోయేవాళ్ళం. అంతకంటే ముందు అసలు జీవించడమే దుర్భరం అవుతుంది. ఇంతకీ సూర్యుడికి ఇష్టమైన రోజు ఏమిటో తెలుసా? ఆదివారం. ఆదివారాన్ని 'రవివారం' అని కూడా అంటారు. అసలు ఆదిత్యుడి పేరు మీదే ఆదిత్యవారం అని వచ్చింది. క్రమంగా వ్యావహారికంలో (వాడుక భాష) ఆదివారంగా మారింది. సంస్కృతంలో భానువారం అని కూడా అంటారు.

అవునూ, మనకంటే ఆఫీసులకి సెలవు కావట్టి ఆదివారం అంటే ఇష్టం. సూర్యుడికి కూడా ఆదివారమే ఇష్టం కావడమేంటి?సూర్యుడిక్కూడా ఆదివారం రోజు సెలవా ఏమిటి – అని నవ్వుకుంటున్నారా? ప్చ్.. సూర్యుడు కనుక సెలవు తీసుకుంటే మనకు మనుగడే లేదులెండి. మొత్తానికి ఆదిత్యునికి రవివారం మహా ప్రియమైన రోజు.

మనలో కొందరికి గ్రహ దోషాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. రాహువు, కేతువు, కుజుడు మొదలైన గ్రహాల్లాగే ఆదిత్యునికి కూడా దోష నివారణ కోసం గ్రహ సంతులు చేస్తారు. కోణార్క్ సూర్య దేవాలయం ఒరిస్సా రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. మొత్తం దేశంలోనే ఈ సూర్యదేవాలయం ప్రసిద్ధి కాంచింది.

మామూలు ఆదివారాల సంగతి కాసేపు పక్కన పెడితే తాటాకు ఆదివారం అని ఒకటుంది. తాటాకు ఆదివారం నాడు ప్రత్యేక క్రైస్తవ మతస్తులు విందు భోజనం ఏర్పాటు చేసుకుంటారు. ఈ తాటాకు ఆదివారం ఎప్పుడూ ఈస్టర్ ఆదివారం కంటే ముందు ఆదివారం వస్తుందన్నమాట. ఆవేళ నాలుగు సువార్తలను చెప్పిన రోజును గుర్తు చేసుకుంటారు. జీసస్ తన వాంఛ కన్నా ముందు జెరూసలేం లోనికి దగ్విజయంగా ప్రవేశించాడు కనుక దీన్ని వాంఛ ఆదివారం లేదా దేవుని వాంఛతో కూడిన తాటాకు ఆదివారం అంటారు.

ఆదివారం నాడు

"భాస్వన్ కాస్యపగోత్రజో రుణరుచిస్సింహపోర్కస్సమి

త్వట్త్రిస్థో దశశోభానో గురుశశీ భౌమ స్సుమిత్రాస్సదా

శుక్రో మస్తరిపు: కళింగజన పశ్చాగ్నీశ్వరో దేవతా

మధ్యేవర్తుల పూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళమ్!”

- అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకుంటే చాలా మంచిది.

Share

23, జులై 2011, శనివారం

మధు మేహం లేక షుగర్ [డయాబిటిస్ వ్యాధి]-3

షుగర్ వ్యాధి అంటువ్యాధి కాదు. ఇది సూక్ష్మ జీవుల వలన కూడా రాదు. ఇది వంస పారంపర్యం వలన కూడా ఎక్కువమందిలో వస్తున్నది. 40 సం. పైబదినవారిలో వంసపారంపర్యముగా వస్తున్నది.తల్లితండ్రులిద్దరికి ఈ వ్యాధి ఉంటె వారి సంతానం లో 99% . తల్లితండ్రులలో ఒకరికి షుగర్ వ్యాధి వుండి, మరొకరు కూడా సుగార్వ్యాది కలిగిన కుటుంబములోని వారైతే 70%. తల్లి తండ్రులలో ఒకరికి సుగార్వ్యాది వుండి మరొకరికి లేకపోతె వారి సంతానంలో 40%, అదేవిధముగా కుటుంబములో ఎవరికైనా షుగర్ వ్యాధి వుంటే సంతానానికి 20% రావడానికి అవకాసం వున్నది .
అధిక బరువు ఉండుట, మానసిక వొత్తిడి ,ఆందోళన ,శరీరానికి సరైన వ్యాయామములు లేకపోవుట ,సరైన పోషకాహారము తీసికోననందున మితి మీరి భుజించుటవలన,మితి మీరి ఆల్కహాలు సేవించుటవలన ఈ వ్యాధి వొస్తుంది.
ekkuva బరువున్న శిశువులకు,జనంనిచ్చే తల్లులకు కూడా ఈ వ్యాధి వోచే అవకాసం ఉందికొంతమంది స్త్రీలకూ గర్భిని సమయమందు డైయాబితాస్ కనిపించినా అది ప్రసవానంతరం అదృశ్యమైపోతుంది .కానీ కొంతమంది స్త్రీలలో ప్రసవానతరం కూడా ఈ వ్యాధి కొనసాగా వోచ్చును.

21, జులై 2011, గురువారం

సాయినాథుని దినచర్య

సాయినాథుని దినచర్య

ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే...

బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.

ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.

ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.

సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.

ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.

హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.

సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.

సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.


17, జులై 2011, ఆదివారం

గంధం సంతోషాన్ని ఇస్తుంది తెలుసా?(Sandalwood)

గంధం సంతోషాన్ని ఇస్తుంది తెలుసా?

(Sandalwood)

హిందూ సంస్కృతిలో గంధానికి చాలా ప్రాధాన్యత ఉంది. మన పూజలు, పునస్కారాల్లో గంధాన్ని తప్పక వినియోగిస్తాం. అందరూ ఉపయోగిస్తున్నారు కనుక గంధాన్ని మనమూ వాడుతున్నామే కానీ, దానివల్ల ప్రయోజం ఏమిటో మనకు అంతగా అవగాహన ఉండదు. సర్వసాధారణంగా మన ప్రతి ఆచారం వెనుకా శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది. అందుకే పెద్దలు వాటిని ఆచారాలుగా ప్రతిపాదించారు.

ఇప్పుడు పూజల్లో గంధం ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

అభిషేకం చేసిన తర్వాత దేవునికి వస్త్రం, యజ్ఞోపవీతం, అక్షతలతో బాటు గంధాన్ని సమర్పిస్తాం. వస్త్ర, యజ్ఞోపవీతాలను స్వయంగా సమర్పించక పోయినప్పటికీ, మంత్రపూర్వకంగా సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది.

గంధాన్ని మాత్రం నియమం తప్పకుండా ప్రతిరోజూ సమర్పించుకోవాలి. పూజ ముగిసిన తర్వాత గంధాన్ని మెడకు భక్తిగా రాసుకుని, అక్షతలను తలపై జల్లుకోవడం సంప్రదాయం.

గంధం ఎంత సువాసనాభారితంగా ఉంటుందో మనందరికీ తెలుసు. గంధపు చెట్ల పరిమళాలకు తాచుపాములు సైతం ఆకర్షితమై వస్తాయి. అందుకే గంధపు చెట్లు, పున్నాగ చెట్లు, మొగలి పొదల దగ్గర జాగ్రత్తగా ఉండమని పెద్దలు హెచ్చరిస్తారు. ఆ సంగతి అలా ఉంచితే, మంచి గంధపు సువాసన మాటలకు అందని సంతోషాన్ని ఇస్తుంది. అంతే కాకుండా దయాగుణాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.

మనకు తెలిసి, తెలీకుండా మన మనసు ఎక్కడెక్కడో సంచరిస్తుంటుంది. ఆ చంచలత్వం నుండి తప్పించి, మనసును స్థిరంగా ఉంచుకోడానికే మనం పూజలు, ధ్యానాలు చేస్తాం. మనసులో చెలరేగే ఆలోచనలను నియంత్రించడానికి, కలతలు, కష్టాలూ ఏమైనా ఉంటే అరికట్టడానికి పూజలు దోహదపడతాయి. అందుకు గంధం తనదైన పాత్ర పోషిస్తూ సహకరిస్తుంది.

గంధంలో ఉండే దయ, సంస్కారం అనే మంచి వాసనలు, రాగద్వేషాలు అనే మలినాలను పోగొడతాయి. ఇతరత్రా మనలో పేరుకున్న కుసంస్కారాలను సైతం నశింపచేసి సంతోషం పాదుకునేలా చేస్తాయి. అలాగే, తోటివారి మీద ప్రేమ, దయ అంకురించేలా చేస్తాయి.

ఇంకొంచెం లోతుగా వెళ్తే పూర్వ కర్మల వాసనలను అంతమొందించి మళ్ళీ జన్మ ఉండకూడదు అని పూజించడానికి గంధం, అక్షతలు తోడ్పడతాయి.

గంధం మనసుకే కాదు, శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది. అందుకే గంధాన్ని కేవలం పూజల్లోనే కాకుండా అనేక సందర్భాల్లో శరీరానికి రాసుకుంటాం.

గంధంతో శరీర ఛాయ పెరుగుతుంది.

గంధం సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది.

గంధం వల్ల చర్మం పేలడం, పొక్కడం లాంటి ప్రతిచర్యలు చూపదు.

గంధంతో చర్మవ్యాధులెన్నో నివారణ అవుతాయి. స్కిన్ రాషెస్, స్కిన్ ఎలర్జీలే కాకుండా చర్మపై వచ్చిన మచ్చలు కూడా తగ్గుతాయి. దురదలు నివారింపబడతాయి.

పొరపాటున చర్మం ఏమైనా కాలితే, కొంచెం గంధం రాస్తే వెంటనే ప్రయోజనం ఉంటుంది.

గంధపుచెక్క లేదా గంధపు పొడిని పట్టు వస్త్రాల మధ్య ఉంచితే సువాసన రావడమే కాకుండా పాడవకుండా భద్రంగా ఉంటాయి.

16, జులై 2011, శనివారం

హరిసేవ: మన సోదరి అమ్మఒడి బ్లాగర్ ఆదిలక్ష్మి గారి దుఃఖం మనకు విషాదం

హరిసేవ: మన సోదరి అమ్మఒడి బ్లాగర్ ఆదిలక్ష్మి గారి దుఃఖం మనకు విషాదం
ఆ బాధ ఎటువొంటిదో స్వయముగా అనుభవించిన నాకు తెలుసు. ఈ సమయములో మనో ధైర్యముతో ఆమె ముందుకు సాగాలని కోరుకొంటూ --సోదరుడు మూర్తి

సంకల్పబలం అంటే ఏమిటి? ముహూర్తం ఎందుకు?

సంకల్పబలం అంటే ఏమిటి? ముహూర్తం ఎందుకు?

(Meaning of Sankalpam & Muhurtham)

మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, అది నిర్విఘ్నంగా నేరవేలారని బలంగా సంకల్పించుకోవాలి. చేపట్టిన పని మనసా వాచా కర్మణా కోరుకుంటే తప్పకుండా జరిగితీరుతుంది. కృషి, పట్టుదలతో బాటు సంకల్పబలం కూడా చాలా అవసరం. అంతే కాకుండా మంచి ముహూర్తం చూసి పని మొదలుపెట్టాలి. దృఢ సంకల్పము, శుభ ముహూర్తము ఉంటే మోయలేని బండరాయిని కొండమీదికి ఎక్కించగలం. సంకల్పబలం లేకున్నా, మంచి ముహూర్తం లేకున్నా అదే రాతిని కిందికి కూడా తోయలేం.

మనవాళ్ళు భూమిలో విత్తనాలు నాటినా తిథి, వార, నక్షత్రాలు చూస్తారు. ఇదంతా చాదస్తం అని కొట్టిపడేసేవారు ఉన్నారు. కానీ, ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అలా అనరు. ఇందులో శాస్త్రం ఇమిడి ఉంది. ఏ టెక్నాలజీ, పరికరాలు లేని కాలంలోనే మహర్షులు ఎంతో పరిశ్రమించి, పరిశోధన చేసి, గ్రహాలూ, నక్షత్రాల చలన స్థితి, పరిణామాలు, వాటివల్ల కలిగే ప్రభావాలను ప్రబోధించారు. ఆ అద్భుతమైన, అమూల్యమైన విషయ సమాచారాన్ని తర్వాతి తరాలకోసం నిక్షిప్తం చేసి ఉంచారు.

అందుకే పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకే కాకుండా ఏ పని ప్రారంభించాలన్నా తిథి, వార, నక్షత్రాలు, నెలలు, సంవత్సరాలు చూడటం అలవాటుగా మారింది. వీటిని సరిగ్గా లెక్కలు వేసి చూస్తే గనుక సత్ఫలితాలు ఉంటాయి. లేకుంటే అనుకున్న పని సవ్యంగా నెరవేరదు. ముహూర్తబలం అలాంటిది. కొన్ని కొన్ని నెలల్లో పెళ్ళిళ్ళు చేయరు. గృహప్రవేశం తలపెట్టరు. వారి వారి నక్షత్రాలను బట్టి ఆయా రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గమనం ఎలా ఉంటుందో లెక్క చూసి, ఆ ప్రకారం పరిగణిస్తారు. అలాగే శుక్లపక్ష, కృష్ణపక్షాలకు కూడా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ప్రతిరోజూ ఒకేలా ఉండదు.

కేవలం పనుల గురించే కాదు, ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా సంకల్పబలం కావాలి. గ్రహబలం ఉండాలి. చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఏ రకమైన అనారోగ్య సమస్యలూ లేకుండా హాయిగా, ఆనందంగా ఉండాలని బలంగా సంకల్పించుకోవాలి. ఆయా దినాలు, గ్రహ స్థితులను అనుసరించి అలవాట్లు, ఆచారాలను నిర్ధారించుకోవాలి.

ఉపవాసాలు కూడా గ్రహస్థితులను అనుసరించి వచ్చినవే. ఉదాహరణకు మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో, ఏకాదశి మొదలైన ప్రత్యేక రోజుల్లో, గ్రహణ సమయాల్లో సూర్యచంద్రుల స్థానాన్ని బట్టి పొట్ట బరువుగా ఉండకపోవడం మంచిది. అందుకే ఆయా రోజుల్లో ఉపవాసం ఉంటారు. మన పెద్దలు ఆచారం, నమ్మకం పేరుతో ప్రతిపాదించినవన్నీ కూడా శాస్త్రీయమైనవే అని గుర్తించి, గుర్తుంచుకోవాలి.

15, జులై 2011, శుక్రవారం

నూతన యుగ నిర్మాణ యోజనా సత్సంకల్పములు [గురు పౌర్ణమి సందర్భముగా ]



నూతన యుగ నిర్మాణ యోజనా సత్సంకల్పములు

౧.మేము ఆస్తికతను, కర్తవ్య పరాయానతను మానవ జీవితమూ యొక్క ధర్మముగా గుర్తిస్తాము .[జీవహింస ద్వారా లభించిన ఆహారాన్ని తినము]
౨.శరీరమును భగవంతుని ఆలయముగా భావించి సంయమనముతో [సెల్ఫ్ కంట్రోల్ ] నియమ పాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకొంటాము.
౩.మనస్సును కేంద్రబిందువుగా గుర్తించి దానిని ఎల్లప్పుడూ స్వచ్చంగా ,పవిత్రం గా ఉంచుకొంటాము.
౪.చెడు ఆలోచనలనించి రక్షించుకొనుటకు నిత్యమూ రాత్రి పడుకోనే ముందు మంచి పుస్తకములను చదువుకొనుటకు ఒక గంట సమయాన్ని తప్పక వినియోగిస్తాము.
౫.మమ్ము మేము సమాజంలోని ఒక భాగముగా గుర్తించి అందరి హితములోను మా హితాన్ని, క్షేమమును గుర్తించి ఎంచుకుంటాము.
౬.వ్యక్తిగత సుఖం, స్వార్ధం కంటే సామూహిక స్వార్ధానికి ప్రాముక్యత నిస్తాము.
౭.నాగరికత, నైతికత,మానవత్వము, సచ్చారిత్రల్ ఉదారత, ఆత్మీయత, సమత, సహిష్టత,శ్రమ శీలత లాంటి సద్గుణాలను నిజమైన సంపదగా గుర్తించి, వ్యక్తిగత జీవితంలో వానిని పెంపొందిన్చుతాము.
౮.నిజాయితీ,ఇంగితజ్ఞానము,భాద్యత,పరాక్రమము వంటి నాలుగు వర్చస్సులను సాధన చేస్తాము.
౯.నలువైపులా మాధుర్యము,స్వచ్ఛత, సౌజన్యము, నిరాడంబరమైన వాతావరణాన్ని పెంపొందిస్తాము.
౧౦.సంప్రదాయాలకంటే వివేకపురితమైన భావనలను, ఆలోచనలను ఆచరణలో పెట్టుటకు ఎటువంటి సోమరితనము,సమయ జాప్యము చేయకుండా అటువతి విషయములకు ప్రాముఖ్యత నిస్తాము.
౧౧.అవినీతిలో పొందిన సాఫల్యము కంటే నీతిమార్గమున పొందిన పరాజయాన్ని శిరసా వహిస్తాము.
౧౨.వ్యక్తి యొక్క విలువను అతని విద్యార్హత,సంపద [ధనము] ద్వారా కాక అతని సత్కర్మలు,సదాలోచనల ద్వారా గుర్తిస్తాము .
౧౩.ప్రకృతి యొక్క నియమములను ప్రకారము జీవిస్తాము.
౧౪.ఇతరులు మాయడల ఏవిధముగా ప్రవర్తించాలి అని కోరుకొంటామో మేము ఇతరుల యెడల ఆ విధముగానే ప్రవర్తిస్తాము .
౧౫.కష్టపడి నీతిగా సంపాదించిన ధనమునే స్వీకరిస్తాము. అలా సంపాదించిన ధనములో 10 శాతము దైవ ప్రణాలికలు నిర్వర్తించుకోనుటకు ఆపదలో ఉన్నవారిని రక్షించుటకు వినియోగిస్తాము.
౧౬.జీవితంలో ప్రతివ్రతా ధర్మాన్ని, పత్నీవ్రతా ధర్మాన్ని తప్పక పాటిస్తాము.
పై ఆదర్శములను విపులముగా తెలిసికొనుటకు ఈ క్రింది పుస్తకములను ప్రతిఒక్కరూ తప్పక ఒక్క సారైనా జీవితంలో చదవ వలెను .
౧.కాంత్రీధర్మీ సాహిత్యము, ౨.ప్రజ్ఞా పురాణ కధలు, ౩.గురుదేవుల చరిత్ర,

14, జులై 2011, గురువారం

ముద్దుకే ముద్దొచ్చే రూపాలు (Nature's Gifts)

నమ్మలేని నిజాలు (Mysteries and Miracles)

ముద్దుకే ముద్దొచ్చే రూపాలు (Nature's Gifts)

ఇతర ఏ జంతువుల్లో లేని కళా హృదయం మనలో ఉంది. లోకంలో బ్రహ్మాండమైన ఆర్టిస్టులున్నారు. వాళ్ళు వేసిన బొమ్మలు, చిత్రాలు అద్భుతంగా, అపురూపంగా ఉంటాయి. ఈ సృజన సంగతి అలా ఉంచితే దేవుని మించిన కళాకారుడు లేడు. చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు మేఘాలు, సముద్రాలు - ఆ అందాలు చూసి తరించాలే కానీ,వర్ణించడానికి మాటలు చాలవు.

ప్రకృతి అందాల సంగతి అలా ఉంచితే, కొన్నిసార్లు ఆ సౌందర్య తునకల్లో ఇంకా అద్భుతమైన దృశ్యాలు ఇమిడిపోయి, ముద్దుకే ముద్దొచ్చేట్టుగా, సమ్మోహనమైన సుమాలతో ఆకృతులు కూర్చినట్లుగా ఉంటాయి. చేతులకు వేసుకున్న గాజులు చూసుకోడానికి అద్దం అక్కర్లేదు అన్నట్టు వీటిని వర్ణించాల్సిన పనేముంది, మీరే చూడండి..

మనం ఎప్పుడూ ఏవో పనుల్లో కూరుకుపోయి తల పైకెత్తి చూడం గానీ, మబ్బులు తెగ సోయగాలు పోతాయి.మహా అందంగా ఉంటాయి. మురిపించే మేఘ మాలికల్లో వివిధ ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి. మబ్బుల్లో టెడ్డీ బేర్ చూడండి.. ఇది ఎంతమాత్రం ట్రిక్ ఫొటోగ్రఫీ కాదు.

కొండల్ని బండరాళ్ళు అనుకుంటే పొరపాటే. వాటిని అపురూపమైన శిల్పాలుగా చెక్కిన శిల్ప చక్రవర్తులు ఉన్నారు. అదలా ఉంచితే, ఎక్కడో దూరంగా ఉన్న కొండలు ఎవరూ చెక్కకుండానే సహజంగా ఆకృతులు ఏర్పరచుకుంటే...

11, జులై 2011, సోమవారం

గురు పౌర్ణిమ శుభ సంకల్పములు [15-07-2011]

గురు పౌర్ణిమ శుభ సంకల్పములు [15-07-2011]
గురువు అనగా సర్వజ్ఞుడు ,సర్వ వ్యాపకుడు ,సర్వ సమర్ధుడు వారినే మనం గురు బ్రహ్మ , గురువిష్ణు,గురుదేవో మ్మహేశ్వరా అని ప్రార్ధన చేస్తాము .గురువు మనకు దూరముగా ఎక్కడో వున్నాడు అన్న భ్రమను పోగొట్టుకొని మనలోనే వున్నాడు అన్న సత్యమును గ్రహిచుటయే గురు పౌర్ణిమ పర్వదినమున మనము చేసే ధ్యానము, ప్రార్ధన ,పూజ . వ్యాసభగవానుని పుట్టిన రోజు గురు పౌర్ణిమ రోజు .వ్యాసుల వారు మానవ జన్మ ఉద్దేశ్యము తెలిసికొనుట కొఱకు 18 పురాణములను వ్రాసినారు . అది ద్వాపర యుగమునాటి మాట. ఇప్పుడు ఈ కలియుగములో శ్రీకృష్ణ భగవానుని ఉవాచ ప్రకారము భగవద్గీత లోని 18 అద్యాయముల యొక్క సారంశమును " ప్రజ్ఞా పురాణ కధలు " [నాలుగు భాగములు ]మనం మహా మానవులుగా మారుటకు రచించినవారు బ్రహ్మర్షి , యుగద్రష్ట , వేదమూర్తి ,తపోనిష్ట ,పండిత ,నిష్కలంక అవతార్ శ్రీ రామ శర్మ ఆచార్య గురుదేవులు . వారు 1911 సెప్టెంబర్ లో జన్మించి 24 సంవత్సరాలు తపస్సు ద్వారా మానసిక తలమును పరిష్కృతము చేసుకొని గాయత్రీ దేవతానుగ్రహము పొంది ,21 వ శతాబ్ది -ఉజ్వల భవిష్యత్ అందరకూ ఈ క్రింది సంకల్పములను తనవిగా చేసుకొని ఆదర్శ వంతమైన జీవితమును గడపగల ప్రతిఒక్కరికి సంభవిస్తుందని ఒక భవిష్య వేత్తగా తెలియ చేసారు .అదే ఆయన కారణ జన్మ రహస్యము . ఈయుగా నిర్మాణ సత్ సంకల్పములను మనమదరమూ ఆచరించి మన జీవితములను పరిపూర్ణము చేసుకోవాలన్నదే ఆ పరమాత్మ యొక్క సంకల్పము మరియు విశ్వ ప్రణాళిక లోని ఒక భాగముగా మనమందరమూ గుర్తించి మనం వ్యక్తిగా ,కుటుంబ సభ్యునిగా ,సమాజములోని ఒక వ్యక్తిగా మన కారణ జన్మ రహస్యమును తెలిసికొన వలయును .

10, జులై 2011, ఆదివారం

సంధ్యావందనం ఎందుకు చేయాలి?

సంధ్యావందనం ఎందుకు చేయాలి?

(Purpose of Sandhyavandanam)

సంధ్యావందనం అనే ఆచారాన్ని ఒక సంప్రదాయంగా, మొక్కుబడిగా చేయడం కంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మరింత శ్రద్ధాసక్తులతో చేసే అవకాశం ఉంది. సూర్యభగవానుడు ఒక్కడే. కానీ, ఆయనలో అద్వితీయమైన మూడు శక్తులు, ఏడు రంగుల కిరణాలు ఉన్నాయి.

"ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్నివిష్టః" అనేది మంత్రం. అంటే సూర్యుడు స్పష్టంగా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇందుకు వేదాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి.

సూర్యునిలో కనిపించే సప్త వర్ణాలే సప్త అశ్వాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వెలిగించే పరబ్రహ్మ తత్వం సూర్యుడు. త్రిమూర్తుల శక్తులను విడివిడిగా చూపించే దివ్య నారాయణ మూర్తి సూర్యుడు. సూర్యభగవానుడిలో సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే మూడు మహా శక్తులు కేంద్రీకృతం అయ్యుంటాయి. అందుకే సూర్యునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో మూడుసార్లు సంధ్యావందనం చేయాలి.

త్రి సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల సూర్యునిలో దాగివున్న సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులు మన సొంతం అవుతాయి.

ఆయా శక్తులను

"గాయత్రీం ఆవాహయామి

సావిత్రీం ఆవాహయామి

సరస్వతీం ఆవాహయామి"

అనే మంత్ర సాయంతో ఆకర్షించి గ్రహించే సాధన సంధ్యావందనం. ఈ మంత్రాన్ని మూడుసార్లు భక్తిగా స్మరించి, నమస్కరించుకోవాలి. త్రి సంధ్యల్లోనూ క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించాలి. ఈ మూడు శక్తులూ ఘనీభవించిన మూర్తియే గాయత్రి. కనుకనే గాయత్రిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, అఘమర్షణం,అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం, ఉపస్థానం అనేవి అంగాలు.

మూడు సంధ్యలూ ఒకే మాదిరిగా ఉండవు. సూర్య తాపము, ప్రభావము వేరువేరుగా ఉంటాయి. ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయంత్ర సూర్యుని వృద్దార్క అని అంటారు. ఉదయానే ఏమంత ప్రభావం చూపడు. సాయంత్ర వేళలో సూర్యుడు గొప్ప ప్రభావాన్ని చూపుతాడు. ఇక మధ్యాహ్న సమయంలో సూర్యుని వేడిమి సహించలేనిదిగా ఉంటుంది. అయితే మూడు దశల్లోనూ సూర్యుని కిరణాలను చూడటం చాలా అవసరం. కనుకనే సంధ్యావందనం పేరుతో ఒక ఆచారాన్ని ప్రతిపాదించారు. దాన్ని కొనసాగించడంవల్ల మనసుకు శాంతి అనుభూతమౌతుంది. శరీర ఆరోగ్యమూ బాగుంటుంది.

9, జులై 2011, శనివారం

సాంకేతిక సహాయం కోసం

హలో సర్ నా బ్లాగ్ నందు క్రొత్త పోస్ట్ పోస్ట్ చేసే సమయములో టైపు చేసినపుడు ఇంగ్లీష్ లో టైపు చేస్తే ఆటోమాటిక్ గా తెలుగులో పోస్ట్ అయ్యేది ,కాని సడెన్ గా ఇప్పుడు ఇంగ్లీష్ లో టైపు చేస్తే తెలుగు translate అవ్వటం లేదు.ఇప్పటికే నా pc నందు తెలుగు ఫాంట్స్ వున్నాయి, సెట్టింగ్స్ ఏమైనా మారినవేమో చెక్ చేసినాను. భాష అనుచోట తెలుగు అనే వుంది .కంప్యూటర్ సెట్టింగ్స్ ఏమైనా మారినవేమో అని వేరే కంప్యూటర్ పై ట్రై చేసాను అయినా ఇంగ్లీష్ తెలుగుకు త్రన్స్లాటే అవటం లేదు.దయచేసి బ్లాగ్ మిత్రులు దీనికి పరిష్కారం సూచిస్తారని తలుస్తాను . ఈ మాటర్ తెలుగులో రావడానికి google translitration ద్వారా టైపు చేసాను. ---మూర్తి