HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

18, ఆగస్టు 2010, బుధవారం

విభూది ప్రాశస్త్యము

[నామము] బొట్టు లేని నుదురు వృధా అన్నారు. విభూది, కుంకుమ,చందనము వంటి వాటిని తప్పని సరిగా ప్రతీ రోజూ మరువక, విడువక నుదుట ధరించాలి.
విభూది కి అనేక పేర్లువున్నవి .అది మనలని రక్షించుట చే రక్ష, పాప ఖర్మలను ముక్కలు ముక్కలు గా భస్మము చేయుటవలన నీరు [భస్మము] అనియు , లెక్క లేనన్ని సంపదలను ప్రసాదించుట వలన విభూతి అనియు,ఐదుఅక్షరములను ఉచ్చరిస్తూ ధరిచుట వలన [ఉచ్చరింప జేయుటవలన]విభూతి కి పంచాక్షరము అన్న విశిష్ట నామము వున్నది . అజ్ఞానమును తొలగించి శివజ్ఞానమనెడు శివ తత్వమును బోధించుట వలన విభూతికి పశితం అన్న నామము వున్నది .ఆత్మల లోని మాలిన్యము పోగొట్టి పవిత్రపరచుట వలన దానికి "సారము" అన్న నామమూ ఉన్నది.
వ్యాధులకు భయపడను, జనన మరణములకునూ భయము చెందను ,విభూతి ధరించిన వారిని చూసినంతమాత్రాన భయపడుతున్నానని మానిక్కవాచగర్ తెలుపుతున్నారు.
విభూతిని చూపుడు వేలితో తీసికొని ధరించరాదు . నుదుటి భాగమున నిండుగా విభూతిని పూసికొనవలయును.
వస్తువులను నిప్పుల్లో వేసి కాల్చినపుడు అవి భస్మమగును .[శంఖము తప్ప ]కానీ, నల్లటి రంగుతో నున్న గోమయము [ఆవు పేడ] ఉండ చేసి నిప్పుల్లో కాల్చినచో అది తెల్లటి రంగుతో విభూతి గా మారి మనకు లభించుచున్నది . ఇట్టి విభూతి మన మనస్సును శుబ్రపరచును ,దేహాన్ని శుబ్రపరచును .
విభూతిని నిండు భక్తితో భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ధరించుకొని, దేవుణ్ణి ప్రార్ధించు నప్పుడు తపము ,దానము, ధర్మమూ మొ. చేసినంత ఫలము లభించును . ఏడుకోట్ల మంత్రములను జపించిన ఫలములనూ, గంగా, కావేరి, గోదావరి వంటి పుణ్య నదులలో తీర్ధమాడిన ఫలములనూ, అశ్వమేధ యాగము చేసిన ఫలములనూ విభూతి ధరించినవారు పొందుతారు . ఔషదము [మందు] సేవించువారు పత్యమున్నట్లు ,విభూతి ధరించు వారు తగిన నామ మంత్రములను జపిస్తూ వస్తే లేఖలేనన్ని ఫలములను భగవంతుడు కొల్లలుగా ప్రసాదిస్తాడు.
విభూతి ధారణ అన్నది మనకు కవచము వంటిది. దుష్ట శక్తుల బారినుండి మనలని కాపాడునట్టిది.
తడసిన వస్త్రముతో ,ఏక వస్త్రముతో ,లోపలి వస్త్రము లేకుండగా గాని విభూతిని దరించ రాదు . నెల మీద చింద కుండా జాగ్రత్తగా విభూతిని తీసుకొని దరించ వలెను .పనికిరాని విషయములను మాట్లాడుకుంటూ విభూతిని ధరించరాదు .భయ భక్తులతో విభూతిని ధరించి ,భగవంనమమును జపిస్తూ వచ్చినచో జీవితములో లేఖలేనన్ని సౌభాగ్యములు పొందవొచ్చును.
విభూతిని తిరి పున్దరముగా ధరించునపుడు శరీరమునందున్న16 స్థానములందు పూసికొనవలయును. విభూతి ధరించాలంటే శరీరమంతయు పూసికోనవోచ్చును. దీనిని మొత్తము భస్మము ధరించుట అంటారు. విభూతిని ధరించవలసిన 16 స్థలములను పలు రకాలుగా చెబుతారు.
అవి: పాలభాగము [1] ,శిరము[1] ,వక్షస్థలము[1],బొడ్డు[1], మోకాలి చిప్పయందు [2], భుజములు[2], మోచేయి[2], మణికట్టు[2], మేడప్రక్కలు[2], వీపు[1], మెడ[1] నందు విభూతిని నీటితో కలిపి ధరించవలెను .
విభూతిని ......పట్టించునపుడు మూడు గీతాలుగా విభజించుకొని పూసుకోనవలయును. దీనిని తిరిపుండ్రం అంటారు .అలా పట్టించునపుడు మూడు గీతలను ఒకదానికి ఒకటి తాకకుండా ,అధికముగా వొంగిపోకుండగా ,మరీ వెడల్పు లేనట్లుగా ను చూడవలెను .
విభూతిని ఎల్లరునూ ఎప్పుడునూ ధరించరాదు .తగినటువొంటి గురుదేవుల వద్ద సక్రమముగా దీక్ష పొందిన వారు, పెద్దవారు మాత్రమె విభూతిని నీటితో కలుపుకొని ఉదయము ,సాయంత్రము ధరించావోచ్చును.
దీక్ష పొందని వారు మద్యాహ్నము వరకూ విభూతిని నీటితో కలిపి దరించ వచ్చును .ఆపై అలా దరించ రాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి