HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

8, ఆగస్టు 2010, ఆదివారం

శ్రావణ లక్ష్మి

చిరు జల్లులు పడుతూవుంటే పట్టు చీరలు తడిసి పోతాయని బెంగ పడుతూనే ,పసుపు పూసిన పాదాలతో ,గాజుల గలగలల తో ,చేతిలో వాయనం శనగలూ తాంబూలం మూటలు పట్టుకొని గుంపులు గుంపులు గా కబుర్లాడుకుంటూ, కిలకిలా నవ్వుకుంటూ నడిచే ముత్తైదువులతో వీధులన్నీ కళకళలాడి పోతుంటాయి. శ్రావణ మాసం లో శుక్రవారాలూ ,మంగళవారాలూ ప్రముఖంగా కనపడే దృశ్యమిది ఆంధ్రప్రదేశ్ లో .శ్రావణ మాసం లో స్త్రీలు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి ని సౌభాగ్య ,సంపదలు కోరి వ్రతం చేస్తే --
జంద్యాల పౌర్ణమిగా శ్రావణ పౌర్ణమి నాడు పురుషులు -
యజ్ఞోపవీతం పరమం పవిత్రం
అంటూ పాత జంధ్యాన్ని విసర్జించి ,నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఆచారంగా వొస్తోంది. పై "ఓం భూర్భువస్సువః తత్వితురవేన్యం అంటూ గాయత్రీ మాతను ధీ శక్తిని ,బలాన్ని, తేజస్సును కోరి ప్రా ర్దిస్తారు.ఇలా శ్రావణ మాసం లో భార్యా భర్తలిరువురూ దైవబలాన్ని సముపార్జించుకొని నిత్య నైమిత్తిక కార్యాచరణకు పునరంకితమౌతారు .
రాఖీ పండుగ మరొక కనువిందు చేసే సాంప్రదాయం . పౌర్ణమినాడు సోదరుని చేతికి రంగుల రాఖీ [ తోరం] కట్టి ,తీపి తినిపించడం ,వారుకూడా తోబుట్టువుల సంతోషాన్ని ఇనుమడింప చేసేలా కానుకలివ్వడం, అందరూ కల్సి ఆనందంగా పండగ జరుపుకోవడం ,అన్నా చెల్లెళ్ళ బంధం వృద్ధి చెందించే చక్కని సంబరాల రాఖీ పండగ .ఇది ఎక్కువుగా ఉత్తర భారత దేశం లో జరుపుకొనే పండుగ ,ఇప్పుడిప్పుడే దక్షిణాదిన ,ఇతరదేశాల్లో కూడా జరుపుకుంటున్నారు.
పొలాల్లో ఊడ్పులు పూర్తయి వర్షపు జల్లులకు చేను పచ్చదనం సంతరించుకొని రైతుకు ఆనందం కలిగిస్తుందీ మాసం . కొత్తగా పెళ్లి వొచ్చిన కోడళ్ళూ ,అత్తవారింటికి వెళ్ళే కూతుళ్ళూ ,ఇల్లలికి హడావిడితో కూడిన ఆనందం అన్న చెల్లెళ్ళ పరస్పర పరస్పర ప్రేమ సత్కారం .ఇదీ మన సాంప్రదాయం .

2 కామెంట్‌లు: