సప్త చిరంజీవులలో 6 వ వాడు కృపుడు
శరద్వంతుని కుమారుడు .శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు ,ఇంద్రుడు ఈతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపినాడు .ఆమెను చూడగానే యితడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి మరియొక చోటుకు వెళ్ళినాడు ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు . కృపునితో పాటుగా సరద్వాన్తునికి మరియొక ఆడపిల్ల కల్గినది .ఆపిల్లలను వదిలి తపస్సుకి మరిఒక చోటికి వెళ్ళినాడు .అటువంటి సమయమున వేటకు వోచిన శంతనుడు .ఈపసికండులను చూచి కృపతో పెంచినాడు .అందులకే వీనికి క్రుపాయని క్రుపుదని పేర్లు వోచ్చినవి.శరద్వంతుడు కృపునకు ఉపనయాదికములను చేసి ధనుర్వేదమును నేర్పినాడు .భీష్ముని కోర్కె మన్నించి ధర్మజాడులకు ధనుర్విద్యను నేర్పినాడు .భారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమును నిలిచి యుద్ధం చేసినాడు . యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు. ద్రుతరస్త్రునితో కూడి తపోవనమునకు వెళ్ళినాడు రాబోవు సుర్యసవర్నిక మన్వంతరములో సప్తరుషులలో కృపునకు ఒక స్తానము పొండువాడుగా వున్నాడు .యితడు చిరంజీవుడు.
7.పరసురాముడు:-
యితడు రేణుకా జమదగ్నుల కుమారుడు .తండ్రి ఆజ్ఞను మన్నించి తల్లిని కూడా సంహరించినాడు.ఇతనిని మెచ్చుకొన్న తండ్రి వరం కోరుకొమ్మనగా తల్లిని బ్రతికించమన్నాడు .తన సోదరులకు తండ్రివలన శాపమును తొలగింప చేసాడు .జమదగ్నికి తాత బృగు మహర్షి ,ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయమునకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసినాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వొచ్చి పరశురాముని పరీక్షించినాడు .శివుని ఉత్తర్వుతో తీర్ధ యాత్రలు చేసినాడు ,శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందినాడు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి