ఆద్యాత్మిక పరంగా ,ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్ప వృక్షం గా దేవతా వృక్షం గా పేరు పొందింది.భగవంతుని పూజకు తులసి అతి ప్రసస్తము .తులసి గా శ్రీ మహాలక్ష్మి ఏ స్వయముగా అవతరించినట్లు పురాణములు చెబుతున్నాయి .
శ్రీ కృష్ణుని ప్రేమకు పాత్రురాలైన గోపిక శ్రిక్రుస్తుని వేడుకోగా ,భూలోకంలో జన్మించి కొంతకాలం జీవించిన అనంతరం తన అంశ లో చేరేలా అనుగ్రహహించాడు స్వామి .ఈ శాప కారణంగా లక్ష్మి అంశ గా జన్మించి ,వృక్షం గా మారినట్లు శ్రీదేవి భాగవతంలోని ఒక కదా ద్వారా తెలుస్తోంది .
తులసి ప్రియురాలు కనుక విష్ణువును తులసి దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను వుంచవలెను .
పవిత్ర దినములలో తులసి కోయరాదు , గోళ్ళతో తుంచ రాదు .సూర్యాస్తమయము తర్వాత తులసి కోయరాదు . మిట్ట మద్యాహ్న్నం ,అర్ధ రాత్రి వేల లో గాని తులసిని త్రుంచ రాదు . ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి .
ఎవరి గృహములో తులసి మొక్క వుంటుందో ,వారి గృహం తీర్ధ స్వరూపముగా వుంటుంది. తులసి దళా ల తో శివ కేశవులను పూజించిన వానికి మరల జన్మ ఉండదు, ముక్తిని పొందుతాడు.నర్మదా నదిని చూడడం ,గంగా స్నానము చేయడం,తులసి వనాన్ని సేవిచడం ఈ మూడు సమాన ఫలములను ఇస్తాయి .ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక సుద్ధ పౌర్ణమి వరకు చాత్రుమాస దీక్ష కావున ఈ సమయములో తులసి మొక్కను చోటు మార్చి పాత రాదు.
తులసి సన్నీ దానము నందు విష్ట్ను మూర్తి ఏకాంతముగా ఉండును కనుక స్త్రీలు దళములు కోయరాదు .పురుషులు మాత్రమె కోయవలెను .
తులసి ఆకును కోసిన లగాయతు ఒకసంవస్త్సరము ,మారేడు మూడు సం. ,తామర పూలు ఏడు రోజుల వరకు పూజకు పనిచేస్తాయి .
తులసి మాల ఎక్కువుగా రాముడికి ,కృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది.బుద్ధిని ,మనస్సును ప్రశాంతముగా ఉంచుటకు ఈ మాల ఎంతో ఉపయోగాదాయకం .తులసి మాలను ధరించడం వలన సర్వ పాపాలు నాసి స్తా
ఇన్ని ఉపయోగాములున్న దేవ వృక్షము తులసిని పెంచక మేడిపండు సామెత వలె డబ్బు వెచ్చించి కొనే క్రోటన్ మొక్క విలువ ఏపాటిదో కాస్త తెలుసుకొంటే తులసిదళం మహా పుణ్య ఫల దాయకమని గ్రహించగలుగుతారు .
తులసిలో లభించే అనేక ఔషద గుణములను సంబంధించి వైద్యులు ఇంకా ప్రయోగాలు నిర్వహిస్తూనే వున్నారు.
HEAD LINES
tml"/>Get this Widget
29, ఆగస్టు 2010, ఆదివారం
18, ఆగస్టు 2010, బుధవారం
విభూది ప్రాశస్త్యము
[నామము] బొట్టు లేని నుదురు వృధా అన్నారు. విభూది, కుంకుమ,చందనము వంటి వాటిని తప్పని సరిగా ప్రతీ రోజూ మరువక, విడువక నుదుట ధరించాలి.
విభూది కి అనేక పేర్లువున్నవి .అది మనలని రక్షించుట చే రక్ష, పాప ఖర్మలను ముక్కలు ముక్కలు గా భస్మము చేయుటవలన నీరు [భస్మము] అనియు , లెక్క లేనన్ని సంపదలను ప్రసాదించుట వలన విభూతి అనియు,ఐదుఅక్షరములను ఉచ్చరిస్తూ ధరిచుట వలన [ఉచ్చరింప జేయుటవలన]విభూతి కి పంచాక్షరము అన్న విశిష్ట నామము వున్నది . అజ్ఞానమును తొలగించి శివజ్ఞానమనెడు శివ తత్వమును బోధించుట వలన విభూతికి పశితం అన్న నామము వున్నది .ఆత్మల లోని మాలిన్యము పోగొట్టి పవిత్రపరచుట వలన దానికి "సారము" అన్న నామమూ ఉన్నది.
వ్యాధులకు భయపడను, జనన మరణములకునూ భయము చెందను ,విభూతి ధరించిన వారిని చూసినంతమాత్రాన భయపడుతున్నానని మానిక్కవాచగర్ తెలుపుతున్నారు.
విభూతిని చూపుడు వేలితో తీసికొని ధరించరాదు . నుదుటి భాగమున నిండుగా విభూతిని పూసికొనవలయును.
వస్తువులను నిప్పుల్లో వేసి కాల్చినపుడు అవి భస్మమగును .[శంఖము తప్ప ]కానీ, నల్లటి రంగుతో నున్న గోమయము [ఆవు పేడ] ఉండ చేసి నిప్పుల్లో కాల్చినచో అది తెల్లటి రంగుతో విభూతి గా మారి మనకు లభించుచున్నది . ఇట్టి విభూతి మన మనస్సును శుబ్రపరచును ,దేహాన్ని శుబ్రపరచును .
విభూతిని నిండు భక్తితో భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ధరించుకొని, దేవుణ్ణి ప్రార్ధించు నప్పుడు తపము ,దానము, ధర్మమూ మొ. చేసినంత ఫలము లభించును . ఏడుకోట్ల మంత్రములను జపించిన ఫలములనూ, గంగా, కావేరి, గోదావరి వంటి పుణ్య నదులలో తీర్ధమాడిన ఫలములనూ, అశ్వమేధ యాగము చేసిన ఫలములనూ విభూతి ధరించినవారు పొందుతారు . ఔషదము [మందు] సేవించువారు పత్యమున్నట్లు ,విభూతి ధరించు వారు తగిన నామ మంత్రములను జపిస్తూ వస్తే లేఖలేనన్ని ఫలములను భగవంతుడు కొల్లలుగా ప్రసాదిస్తాడు.
విభూతి ధారణ అన్నది మనకు కవచము వంటిది. దుష్ట శక్తుల బారినుండి మనలని కాపాడునట్టిది.
తడసిన వస్త్రముతో ,ఏక వస్త్రముతో ,లోపలి వస్త్రము లేకుండగా గాని విభూతిని దరించ రాదు . నెల మీద చింద కుండా జాగ్రత్తగా విభూతిని తీసుకొని దరించ వలెను .పనికిరాని విషయములను మాట్లాడుకుంటూ విభూతిని ధరించరాదు .భయ భక్తులతో విభూతిని ధరించి ,భగవంనమమును జపిస్తూ వచ్చినచో జీవితములో లేఖలేనన్ని సౌభాగ్యములు పొందవొచ్చును.
విభూతిని తిరి పున్దరముగా ధరించునపుడు శరీరమునందున్న16 స్థానములందు పూసికొనవలయును. విభూతి ధరించాలంటే శరీరమంతయు పూసికోనవోచ్చును. దీనిని మొత్తము భస్మము ధరించుట అంటారు. విభూతిని ధరించవలసిన 16 స్థలములను పలు రకాలుగా చెబుతారు.
అవి: పాలభాగము [1] ,శిరము[1] ,వక్షస్థలము[1],బొడ్డు[1], మోకాలి చిప్పయందు [2], భుజములు[2], మోచేయి[2], మణికట్టు[2], మేడప్రక్కలు[2], వీపు[1], మెడ[1] నందు విభూతిని నీటితో కలిపి ధరించవలెను .
విభూతిని ......పట్టించునపుడు మూడు గీతాలుగా విభజించుకొని పూసుకోనవలయును. దీనిని తిరిపుండ్రం అంటారు .అలా పట్టించునపుడు మూడు గీతలను ఒకదానికి ఒకటి తాకకుండా ,అధికముగా వొంగిపోకుండగా ,మరీ వెడల్పు లేనట్లుగా ను చూడవలెను .
విభూతిని ఎల్లరునూ ఎప్పుడునూ ధరించరాదు .తగినటువొంటి గురుదేవుల వద్ద సక్రమముగా దీక్ష పొందిన వారు, పెద్దవారు మాత్రమె విభూతిని నీటితో కలుపుకొని ఉదయము ,సాయంత్రము ధరించావోచ్చును.
దీక్ష పొందని వారు మద్యాహ్నము వరకూ విభూతిని నీటితో కలిపి దరించ వచ్చును .ఆపై అలా దరించ రాదు.

13, ఆగస్టు 2010, శుక్రవారం
ఇండియన్ ఇడల్ శ్రీ రామ్ ప్రత్యేకతలు
మన శ్రీ రామ్ తన పాటలతో విదేశాలలో సైతం ప్రేక్షకులను మైమరపించాడు. గత సం. సింగపూర్, దుబాయి, లండన్లలో అనేక ప్రదర్సనలు ఇచ్చాడు .అతని గాన మాధుర్యానికి విదేశీయులు తన్మయులై ప్రసంసల వర్షం కురిపించారు .అటువంటి మన తెలుగు సోదరుడు ప్రస్తుతం సోనీ టీవీ లో ఉత్తరభారత సోదరులతో పోటీ పడుతున్నాడు. మన తెలుగు వాడిని గెలిపించుకోవడం మన అందరి బాద్యత. అతని గెలుపు మనగేలుపే. అతని విజయం మన విజయమే .అతని కీర్తి మన తెలుగుప్రజలందరి ఘన కీర్తి. అతనికి మద్దత్తుగా SMS చేయండి .అఖండ విజయం చేకూర్చండి. శ్రీ రామ్
* తన 8 వ ఏటనే సంగీత కచేరి చేసాడు .
*ఇంతవరకు 80 ప్రదర్సనలు ఇచ్చాడు .
*శ్రీ మనో, శ్రీమతి మాలతి, శ్రీమతి సునీతలతో కలసి ప్రదర్సనలు ఇచ్చాడు .
*కోటి,ఎం .ఎం. కీరవాణి, మాధవపెద్ది శురెష్ ,వందేమాతరం శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యం,నిర్వాహణలో ప్రదర్సనలు ఇచ్చాడు.
*సింగపూర్[10.10.09], దుబాయి[20.01.09] , లండన్ [10.04.10] లలో ప్రదర్సనలు ఇచ్చాడు.
*25.01.09,19.10.09 న మైసూర్ లో ప్రదర్సన ఇచ్చాడు.
*ఇంతవరకు 24 సినీమా లలో పాటలు పాడాడు .
*ఇప్పటికి 50 సినిమా పాటలు పాడాడు .
*తన 17 వ ఏటనే సినిమాలలో పాటలు పాడడం ప్రారంభించి "ఆనందరాగం కాంటెస్ట్ "విజేతగా నిలిచాడు .
*హిందీ ప్రైవేట్ ఆల్బంను ఒకదానిని విడుదల చేసాడు,ఇంతవరకు DIVOTIONAL ALBUMS 28 పాడాడు.
శ్రీ రామ్ గెలుపును ఆకాన్షిస్తూ రాజమండ్రి లో కొందరు ఔస్తాహికులు శ్రీ రామ్ అభిమాన సంఘం గా ఏర్పడి విస్తృతమైన ప్రచార కార్యక్రమమ చేపట్టారు .అందులో భాగంగా వివిధ కాలేజీలు ,స్వచ్చంద సంస్తలు ,మార్కెట్లు ప్రధానంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు .తెలుగు ఆత్మా గౌరవానికి సంబందిన్చినదిగా శ్రీ రామ్ గెలుపు కోరుకుంటున్నారు .దయచేసి మీరుకూడా SMS ద్వారా శ్రీ రామ్ ను గెలిపించండి .
మీ మొబైల్ నుండి SREERAM అని టైపు చేసి 52525 కు SMS చేయండి .
[ఇది ప్రజా పత్రిక నుండి సేకరణ ]

8, ఆగస్టు 2010, ఆదివారం
శ్రావణ లక్ష్మి
చిరు జల్లులు పడుతూవుంటే పట్టు చీరలు తడిసి పోతాయని బెంగ పడుతూనే ,పసుపు పూసిన పాదాలతో ,గాజుల గలగలల తో ,చేతిలో వాయనం శనగలూ తాంబూలం మూటలు పట్టుకొని గుంపులు గుంపులు గా కబుర్లాడుకుంటూ, కిలకిలా నవ్వుకుంటూ నడిచే ముత్తైదువులతో వీధులన్నీ కళకళలాడి పోతుంటాయి. శ్రావణ మాసం లో శుక్రవారాలూ ,మంగళవారాలూ ప్రముఖంగా కనపడే దృశ్యమిది ఆంధ్రప్రదేశ్ లో .శ్రావణ మాసం లో స్త్రీలు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి ని సౌభాగ్య ,సంపదలు కోరి వ్రతం చేస్తే --
జంద్యాల పౌర్ణమిగా శ్రావణ పౌర్ణమి నాడు పురుషులు -
యజ్ఞోపవీతం పరమం పవిత్రం
అంటూ పాత జంధ్యాన్ని విసర్జించి ,నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఆచారంగా వొస్తోంది. ఆ పై "ఓం భూర్భువస్సువః తత్వితురవేన్యం అంటూ గాయత్రీ మాతను ధీ శక్తిని ,బలాన్ని, తేజస్సును కోరి ప్రా ర్దిస్తారు.ఇలా శ్రావణ మాసం లో భార్యా భర్తలిరువురూ దైవబలాన్ని సముపార్జించుకొని నిత్య నైమిత్తిక కార్యాచరణకు పునరంకితమౌతారు .
రాఖీ పండుగ మరొక కనువిందు చేసే సాంప్రదాయం .ఈ పౌర్ణమినాడు సోదరుని చేతికి రంగుల రాఖీ [ తోరం] కట్టి ,తీపి తినిపించడం ,వారుకూడా తోబుట్టువుల సంతోషాన్ని ఇనుమడింప చేసేలా కానుకలివ్వడం, అందరూ కల్సి ఆనందంగా ఈ పండగ జరుపుకోవడం ,అన్నా చెల్లెళ్ళ బంధం వృద్ధి చెందించే చక్కని సంబరాల రాఖీ పండగ .ఇది ఎక్కువుగా ఉత్తర భారత దేశం లో జరుపుకొనే పండుగ ,ఇప్పుడిప్పుడే దక్షిణాదిన ,ఇతరదేశాల్లో కూడా జరుపుకుంటున్నారు.
పొలాల్లో ఊడ్పులు పూర్తయి వర్షపు జల్లులకు చేను పచ్చదనం సంతరించుకొని రైతుకు ఆనందం కలిగిస్తుందీ మాసం . కొత్తగా పెళ్లి వొచ్చిన కోడళ్ళూ ,అత్తవారింటికి వెళ్ళే కూతుళ్ళూ ,ఇల్లలికి హడావిడితో కూడిన ఆనందం అన్న చెల్లెళ్ళ పరస్పర పరస్పర ప్రేమ సత్కారం .ఇదీ మన సాంప్రదాయం .

5, ఆగస్టు 2010, గురువారం
గ్యాస్ ట్రబుల్ కోసం సొంత ఔషదం
మనలో చాలా మంది గ్యాస్ వల్ల ఇబ్బంది పడుతుంటాము ,అటువొంటివార్కిఇంట్లో మనం తయారుచేసుకొని సులువుగా ఆ ఇబ్బందినుండి బయట పడవచ్చు .ఇది నా స్వానుభవం మీద నేను వాడిన తర్వాత మీకు చెబుతున్నాను .
కొద్దిగా ధనియాలు, జీలకర్ర ,శొంటి ఈ మూడింటిని సమపాళ్ళలో తీసుకొని విడివిడిగా గ్రైండ్ చేసి ,అన్నిటిని కలిపి తగినంత ఉప్పు వేసి ఒక సీసా లో వేసుకొని భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగలో ఒక చెంచా పొడి వేసుకొని రోజు తాగండి .భోజనం తర్వాత అలసట, అజీర్తి, గ్యాస్ వుండవు. ఇది నేనొక పుస్తకంలో చదివి స్వయంగా వాడను .మీరు వాడి మీకు నచ్చితే మరికొంత మందికి తెలియచేయండి. గ్యాస్ ట్ర బుల్ తో ఇబ్బంది పడుతూ ఎక్కువ మందులు వాడనవసరం లేదు .

1, ఆగస్టు 2010, ఆదివారం
సప్త చిరంజీవులు [౨]
సప్త చిరంజీవులలో 6 వ వాడు కృపుడు
శరద్వంతుని కుమారుడు .శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు ,ఇంద్రుడు ఈతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపినాడు .ఆమెను చూడగానే యితడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి మరియొక చోటుకు వెళ్ళినాడు ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు . కృపునితో పాటుగా సరద్వాన్తునికి మరియొక ఆడపిల్ల కల్గినది .ఆపిల్లలను వదిలి తపస్సుకి మరిఒక చోటికి వెళ్ళినాడు .అటువంటి సమయమున వేటకు వోచిన శంతనుడు .ఈపసికండులను చూచి కృపతో పెంచినాడు .అందులకే వీనికి క్రుపాయని క్రుపుదని పేర్లు వోచ్చినవి.శరద్వంతుడు కృపునకు ఉపనయాదికములను చేసి ధనుర్వేదమును నేర్పినాడు .భీష్ముని కోర్కె మన్నించి ధర్మజాడులకు ధనుర్విద్యను నేర్పినాడు .భారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమును నిలిచి యుద్ధం చేసినాడు . యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు. ద్రుతరస్త్రునితో కూడి తపోవనమునకు వెళ్ళినాడు రాబోవు సుర్యసవర్నిక మన్వంతరములో సప్తరుషులలో కృపునకు ఒక స్తానము పొండువాడుగా వున్నాడు .యితడు చిరంజీవుడు.
7.పరసురాముడు:-
యితడు రేణుకా జమదగ్నుల కుమారుడు .తండ్రి ఆజ్ఞను మన్నించి తల్లిని కూడా సంహరించినాడు.ఇతనిని మెచ్చుకొన్న తండ్రి వరం కోరుకొమ్మనగా తల్లిని బ్రతికించమన్నాడు .తన సోదరులకు తండ్రివలన శాపమును తొలగింప చేసాడు .జమదగ్నికి తాత బృగు మహర్షి ,ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయమునకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసినాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వొచ్చి పరశురాముని పరీక్షించినాడు .శివుని ఉత్తర్వుతో తీర్ధ యాత్రలు చేసినాడు ,శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందినాడు .

లేబుళ్లు:
భక్తీ మాస పత్రిక నుండి సేకరణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)