HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

28, ఏప్రిల్ 2010, బుధవారం

కాదేది కలుషితానికి అనర్హం [రక్తనిధిలో రక్తం కలుషితం ]

రాజమండ్రి జాగృతి బ్లడ్ బ్యాంకు నందు తీసుకొన్న రక్తం వలన ఒక నిండు జీవితం తను చేయని పాపానికి బలియ్యింది .
వివరాలలోకి వెడితే ఒక వ్యక్తి ఆక్సిడెంట్ జరిగి హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా అతని కి రక్తం అవసరమై బంధువులు జాగృతి బ్లడ్ బ్యాంకు నందు రక్తం తీసుకొని అతనికి అవసరమైన రక్తం ఎక్కించిన తర్వాత మిగిలిన వైద్యానికి అతనికి రక్తపరీక్ష చేసినప్పుడు అతనికి *H I V Positive* గా రిపోర్ట్ వొచ్చింది.అంతవరకూ అతనికి ఎప్పుడు లేనిది ఆవిధముగా వొచ్చేసరికి బంధువులందరూ ఆ బ్లడ్ బ్యాంకు వారిని అడుగగా రక్తం తమవద్ద కొన్నది కాదని వాదించారు .ఇంతలో ఈవిషయం షరా మాములుగా రాజకీయనాయకులకు,పోలీసు వార్కి తెలిసి వారుకూడా అక్కడకు చేరుకొని కల్లెక్టర్కు, DM &HO వార్కి తెలిపి బ్లడ్ బ్యాంకు యజమాని డా .నాగేశ్వర రావు ను అరెస్ట్ చేసి బ్లడ్ బ్యాంకు ను సీజ్ చేసారు. తదుపరి బ్లడ్ ను గవర్నమెంట్ హాస్పిటల్ నందు టెస్ట్ చేయించగా H I V +VE గా నిర్ధారణ జరిగింది .ఆ బ్లడ్ ప్యాకెట్ పై దాత పేరునుబట్టి ఆ దాతను తీసుకువచి బ్లడ్ టెస్ట్ చేయగా అతను H I V +VE గా రుజువు అయ్యింది .దీనిని బట్టి మన బ్లడ్ బ్యాంకు లలో సేకరిస్తున్న రక్తం సరైన పరీక్షలు జరుపకుండగా ,అనుభవములేని ల్యాబ్ టెక్నీషియన్స్ తో సరైన ప్రమాణములు పాటించకుండా నడుపుతున్నట్లు అర్ధముతోంది .వేరే వేరే విషయాలలో ఏదైనా తప్పిదం జరిగితే సరిచేసుకోవచ్చు ,కాని ఇలాంటి విషయంలో బాధితునికి జరిగిన పొరపాటును ఏవిధముగా సవరించగలరు .బ్లడ్ బ్యాంకు యజమాని ఏదో ఒక విధముగా కొన్నల్లకైనా ఈకేసునుంది బయటపడగలదు, లేదా చిన్నపాటి శిక్ష తో విడుదల అవుతాడు .మీరే ఆలోచించండి ఇలాంటి తప్పిదాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏమిచేయాలో ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి