HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

26, ఏప్రిల్ 2010, సోమవారం

ఆటో ప్రయాణం -ప్రమాదాల పరంపర

ప్రతీ రోజు ఉదయాన్నే పేపర్ చూసిన, టీవీ చూసిన మొదటగా మనకు కనిపించే వార్త రక్త సిక్తమైన రహదారులు అంటూ ఫోటోలు తో సహా వార్తలు.ఇందులో ఎక్కువుగా ఆటో ప్రమాదాలే .అసలు ఆటోలో ప్రయాణించడానికి ఇంతమంది అని పర్మిషన్ వుంటుంది .కానీ మనం చూస్తున్న వార్తలో 4 in all అని రాసివున్న ఆటో అక్కడ పడివుంటుంది ,కానీ అక్కడ చనిపొఇన వాళ్ళు కనీసం 8 మంది పైన వుంటారు .అసలు ఆటో కెపాసిటీ కి మించి జనాన్ని ఎక్కిన్చుకొనే ఆటో వారిపైన మన రవాణా శాఖ కానీ పోలీసు వారు కానీ ఎందుకు కేసులు నమోదు చేయటంలేదు .ఆటో డ్రైవర్ కు రెండు ప్రక్కల హేండిల్ కూడా తిప్పలేని పరిస్తితులలో పరయనించడం ఎంత ప్రమాదమో మనం కూడా ఆలోచించాలి. ముందుగా జనం నుండి ఈవిషయమై మార్పు రావాలి. ఏదైనా ఒక స్వచ్చంద సంస్తలు ఈ విషయమై ప్రజలను చైతన్యవంతులను చేయాలి .[పులి రాజా టైపు లో] బ్యాంకులు ,ఫైనాన్సు సంస్తల పుణ్యమాని ప్రతీ గ్రామ గ్రామాన ,ఈ ఆటోలు చీమల బారుల్ల తిరుగు తున్నై ,వాటిని నడిపే వారికి రహదారి నిభందనలపై అవగాహన లేదు .ఆటో ఎక్కడపడితే అక్కడ సదన్ బ్రేక్ వేయడం ,వెనక ఎవరోస్తున్నారో చూడకుండగా కుడి ఎదమలకు త్రిప్పడం .వారి ఇష్టం తాగి ఆటో నడపడం,పెద్ద సౌండ్ తో ఆటోలో స్పీకెర్స్ .వీటికి అడ్డుకట్ట వేసేవారు లేరా ?పూర్వం సిటిబస్ అతి వేగంగా హారను వేసుకుంటూ వోస్తూంటే ఇలానే భయమేసీది ,ఆటోల పుణ్యమాని వాటి సంఖ్య తగ్గింది .మరిప్పుడు ఈ ఆటోలకు ప్రత్యయమానం ఏమిటో దేముడా నీవే చెప్పాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి