HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

అమ్మో ......భగవద్గీత

భగవద్గీత
తెల తెల వార కుండా శీతాకాల చలిలో చల్లటి పిల్ల తెమ్మరలు మంచులో తడిసి పూల సువాసనలు వేదచాల్లుతూ తమతో పాటుగా తీసుకువోచ్చి మన చెవిని చేరవేసిన మన వూరి గుడి పైన ఘంట సాల గారి గ్రామ్ఫోనే రికార్డు.---ఇది పది సంవస్త్సరముల క్రితం మాట .
భగవద్గీత
మరల అదే ఘంటసాల గారి గానం కాని ఎనీ టైం మన ప్రక్క వీధి లోనో,మెయిన్ రోడ్ నుండో స్పీడ్ గా వెళుతూ వినిపిస్తున్న శవ వాహనపు సింబల్ .*ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆద్యాత్మికత పేరుతొ శవ వాహక ఆధారైస్ద్ గా అమర్చిన ఆధునిక సైరన్ .----ఇదీ నేటి దుస్తితి.
శవ వాహనానికి నిర్వాహకులు చేస్తున్నది మంచి పనే ,అలాంటి పరిస్తితులలో వాహనం ఏర్పాటు చేయటం.కాని అదే సమయములో ఎవరివో మనో భావాలు దెబ్బతీయాల ?
*అర్జునునికి భగవానుడు ఉపదీసించిన ఉపనిశిత్తుల సారంసమే భగవద్గీత *
హిందువుల ప్రామాణిక గ్రంధం ,అత్యున్నత న్యాయ స్తానంలో సయతం ఒట్టు వెఇన్చగల భగవత్స్వరూపం .అన్యమతాలు సైతం అండర్ లైన్ చేసుకుంటూ కొన్ని వాక్యాలు ఏరుకుని పట్టుకెళ్ళి తమ ప్రసంగాలలో ఉటంకిస్తున్న అపురూప అద్వైతం .భగవద్గీత నేడిలా..................,
మన చిన్నతనములో ట్రైన్ లో వెడుతుండగా ఏదో తెలియని గ్రామంలో దూరంగా గ్రామఫోన్ రికార్డ్లో భగవద్గీత వినిపిస్తోంటే అక్కడికి దగ్గరలో ఏదో గుడి వుందని,చిన్నాపిల్లల చేత రెండు చేతులు ఎత్తించి దణ్ణం పెట్టించేవారు ఎందఱో తల్లులు. మరిప్పుడో అదే భగవద్గీత మైక్ లో వినపడుతోంటే తమ పిల్లలను అటు చూడకుండగా ముఖానికి తమ చేతులు అడ్డంపెట్టి తల్లులు తమ పిల్లలు అటుప్రక్క చూడకుండగా బలవంతాన తిప్పేస్తుంన్న అమ్మలు అనీక మంది రాజముండ్రి నగర వీధులలో కనిపిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?
మరొక చోట మరొక సన్నివేసం
హడావిడిగా పనిలోకి వెడుతున్న కార్మికులు,టీ బ్రేక్ లో టీ త్రాగడానికి వెడుతున్న ఉద్యోగులో ,లేదా క్రికెట్ ఆడుతున్న కుర్రకారు ,ఎవ్వరైనా కాని ఎ సమయములోనైనా కాని భగవద్గీత వినిపించిందంటే తల ప్రక్కకు తిప్పకుండగానే
#ఎవడో టపా కట్టేసాడురా , ఎక్కడో వికెట్ పడిందిరా #
#ఎవరో బాల్చి తన్నేసారురా - ఇల్లాంటి జోకులు వేసుకుంటూ హేళనగా మాట్లాడుకునే పరిస్తితి కల్పించింది ప్రస్తుత పరిస్తితే కాదంటారా ?
మానవ జన్మ తృణ ప్రాయమని దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లుగా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే భగవంతుని మీద మనస్సు లగ్నం చెయ్యమని ,ప్రశాంతమైన ఆమనస్సుకు పవిత్రత అద్దమని పూజ్య ఘంటసాల వారు ,తదితరులు ఆ పవిత్ర గ్రంధంలో ముక్యమైన శ్లోకాలను ఏరి గ్రామపోన్ లో బందించి తరతరాలకు అందించారు.కానీ నేడు జరుగుతున్నదేమిటి ?ఇది చూస్తూ ఊరుకోవలసిన్దేనా ?
ఉదయం ౭ గం కూడా నిద్రభంగామైన్దనో ,లేదా తమకు వచ్చిన సెల్ ఫోనులో వాయిస్ సరిగ్గా వినపదలేదనో,పనిగట్టుకుని వొచ్చి గుడిపైన వినపడుతున్న దేముని పాటలు కట్టిన్చీస్తున్న మన హిందూ సోదరులు ఈవిషయం నిర్వాహకుల దృష్టికి తీసుకు వెడతారని నేను అనుకోవటం అత్యాసే నంటార ? ఇస్కాన్ లాంటి బలమైన ఆద్యాత్మిక సంస్టలు పెద్ద వారి దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్లి ప్రత్యామ్నాయం కోసమై ప్రయత్నించాలేర ?అదేమన్న సాద్యం కాని పనా ?---ఆలోచించండి
భగవద్గీతను గానం చేసిన ఆ స్వరం తో ఇకపై ఏరకమైన ప్రేమ గీతాలు పాడనని తన గాత్రసుద్ది తో పవిత్రత అద్దిన ఆ మహానుభావుని ఖంటస్వరంస్మశాన వాటికలో శవ వాహనం పైన రోదిస్తోంది .--మనమేమి చేయ లేమా ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి