HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

మహాలయ పక్ష విశిస్టిత [మహాలయం 20.09.13 నుండి 04.10.13 వరకు ]

బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వర రావు గారి బ్లాగ్ నుండి సేకరణ 

తేది 20/9/2013: మహాలయ పక్ష ప్రా||

భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. దీనినే మహాలయ పక్షం అన్నారు. ఈ పక్షం రోజులు అనగా రేపటి నుంచి నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తి పరచాలి. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.

ప్రతి యేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి.ఆఒక్కరోజు వారు అన్నశ్రాద్ధంపెట్టలేకపోతే, హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఈ మహాలయంలో ఒక విశేషం - వారి వారి జ్ఞాతి, బంధువు లందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు.

కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే | యాచిత్వాపి నరః కుర్యాత్‌ పితౄణాం తన్మహాలయం ||151||
బ్రాహ్మణేభ్యో విశిష్టేభ్యోయాచేతధనధాన్యకం | పతితే భ్యోనగృహ్ణీయాత్‌ ధనధాన్యంకదాచన ||152||
బ్రాహ్మణేభ్యోనలభ్యేత యదిధాన్యధనాదికం | యాచేతక్షత్రియ శ్రేష్ఠాత్‌ మహాలయ చికీర్షయా ||153||
దాతారశ్చేన్నభూపాలావైశ్యేభ్యో೭పిచయాచయేత్‌ | వైశ్యా అపిహిదాతారోయదిలోకే న నంతివై ||154||
దద్యాద్ఛాద్రవదేమాసే గోగ్రాసరిపతృత్నప్తయే | అథవారోదనం కుర్యాత్‌ బహిర్నగ్గత్యకాననే ||155||
పాణిభ్యాముదరం స్వీయం ఆహత్యాశ్రూణివర్తయన్‌ | తేష్వరణ్యప్రదేశేషు ఉచ్చైరేవంవదేన్నరః ||156||
శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ | అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్‌ || 157 ||
ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః | కర్తుం మహాలయ శ్రాద్ధం నచమేశక్తిరస్తివై || 158 ||
భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే | అతోమహాలయ శ్రాద్ధం నయుష్మా కంకరోమ్యహం || 159 ||
క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః | దరిద్రోరోదనం కుర్యాత్‌ ఏవంకాననభూమిషు || 160 ||
తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః | హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధారీపత్వైవనిర్జరాః || 161 ||
మహాలయార్ధేవిప్రౌఘే భుక్తేతృప్తిర్యథా భవేత్‌ | గోగ్రాసారణ్యరుదితైః పితృతృప్తిస్తథా భవేత్‌ || 162 ||

మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి (151) ధనదాన్యమును విశిష్టులైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధనధాన్యమును ఎప్పుడుకూడా పతితుల నుండి తీసుకోరాదు (152) ధనధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేష్ఠులను యాచించాలి (153) రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో (154) పితరుల తృప్తి కొరకు గోవుల గ్రాసమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికిపోయి అడవిలో ఏడవాలి (155) చేతులతో తన కడుపును కొట్టుకొంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశములందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి (156) మాకులంనకు చెందిన పిలరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృపణుణ్ణి. సిగ్గులేని వాణ్ణి, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి (157) పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. (158) భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. (159) మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి (160) అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు (161) బ్రాహ్మణుల సమూహం మహాలయంకొరకు భుజిస్తే తృప్తిచెందినట్లు గోగ్రాన, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది. (162)

--- శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సరిహతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని సంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము నుంచి..
57

మహాలయ పక్ష విశిస్టిత 

[మహాలయం 20.09.13 నుండి 04.10.13 వరకు ]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి