HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

మహాలయ పక్ష విశిస్టిత [మహాలయం 20.09.13 నుండి 04.10.13 వరకు ]

బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వర రావు గారి బ్లాగ్ నుండి సేకరణ 

తేది 20/9/2013: మహాలయ పక్ష ప్రా||

భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. దీనినే మహాలయ పక్షం అన్నారు. ఈ పక్షం రోజులు అనగా రేపటి నుంచి నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తి పరచాలి. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.

ప్రతి యేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి.ఆఒక్కరోజు వారు అన్నశ్రాద్ధంపెట్టలేకపోతే, హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఈ మహాలయంలో ఒక విశేషం - వారి వారి జ్ఞాతి, బంధువు లందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు.

కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే | యాచిత్వాపి నరః కుర్యాత్‌ పితౄణాం తన్మహాలయం ||151||
బ్రాహ్మణేభ్యో విశిష్టేభ్యోయాచేతధనధాన్యకం | పతితే భ్యోనగృహ్ణీయాత్‌ ధనధాన్యంకదాచన ||152||
బ్రాహ్మణేభ్యోనలభ్యేత యదిధాన్యధనాదికం | యాచేతక్షత్రియ శ్రేష్ఠాత్‌ మహాలయ చికీర్షయా ||153||
దాతారశ్చేన్నభూపాలావైశ్యేభ్యో೭పిచయాచయేత్‌ | వైశ్యా అపిహిదాతారోయదిలోకే న నంతివై ||154||
దద్యాద్ఛాద్రవదేమాసే గోగ్రాసరిపతృత్నప్తయే | అథవారోదనం కుర్యాత్‌ బహిర్నగ్గత్యకాననే ||155||
పాణిభ్యాముదరం స్వీయం ఆహత్యాశ్రూణివర్తయన్‌ | తేష్వరణ్యప్రదేశేషు ఉచ్చైరేవంవదేన్నరః ||156||
శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ | అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్‌ || 157 ||
ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః | కర్తుం మహాలయ శ్రాద్ధం నచమేశక్తిరస్తివై || 158 ||
భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే | అతోమహాలయ శ్రాద్ధం నయుష్మా కంకరోమ్యహం || 159 ||
క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః | దరిద్రోరోదనం కుర్యాత్‌ ఏవంకాననభూమిషు || 160 ||
తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః | హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధారీపత్వైవనిర్జరాః || 161 ||
మహాలయార్ధేవిప్రౌఘే భుక్తేతృప్తిర్యథా భవేత్‌ | గోగ్రాసారణ్యరుదితైః పితృతృప్తిస్తథా భవేత్‌ || 162 ||

మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి (151) ధనదాన్యమును విశిష్టులైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధనధాన్యమును ఎప్పుడుకూడా పతితుల నుండి తీసుకోరాదు (152) ధనధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేష్ఠులను యాచించాలి (153) రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో (154) పితరుల తృప్తి కొరకు గోవుల గ్రాసమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికిపోయి అడవిలో ఏడవాలి (155) చేతులతో తన కడుపును కొట్టుకొంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశములందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి (156) మాకులంనకు చెందిన పిలరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృపణుణ్ణి. సిగ్గులేని వాణ్ణి, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి (157) పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. (158) భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. (159) మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి (160) అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు (161) బ్రాహ్మణుల సమూహం మహాలయంకొరకు భుజిస్తే తృప్తిచెందినట్లు గోగ్రాన, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది. (162)

--- శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సరిహతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని సంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము నుంచి..
57

మహాలయ పక్ష విశిస్టిత 

[మహాలయం 20.09.13 నుండి 04.10.13 వరకు ]

7, సెప్టెంబర్ 2013, శనివారం

శ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి వుపన్యసముము

గోత్రము


గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.

ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...

సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే !

విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు. 

ప్రవర 

కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను. 

ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు

---------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత

---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ 

.........................శర్మన్ అహం భో అభివాదయే ||

అని పలకాలి

ప్రవర చెప్పునపుడు , లేచి నిలబడి , చెవులు చేతులతో ముట్టుకుని ఉండి , ( కుడి చేత్తో ఎడమ చెవి , ఎడమ చేత్తో కుడి చెవి .....కొందరు ఇంకోరకంగా ముట్టుకుంటారు ) , ప్రవర చెప్పి , వంగి భూమిని చేతులతో ముట్టి సాష్టాంగ నమస్కారము చేయవలెను .

పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి. 

సూత్రము 

ప్రవరలో మన సూత్రమేదో కూడా చెపుతాముకదా ..సూత్రమంటే ఏమిటి ?

యజ్ఞ యాగాదులు అనేక రకమైనవి ఉన్నాయి . ఉదాహరణకు , ’ దర్శ పూర్ణ మాస యాగము , అశ్వమేధ , పురుష మేధ మొ|| నవి . ఆయా యాగాదులలో ఇవ్వవలసిన ఆహుతులు ఏమిటి అన్న విషయాలు తెలిసిఉండవలెను . యజ్ఞ యాగాదులు మాత్రమే కాక , మనము చేయు శుభకార్యములన్నీ కూడా ఒక పద్దతిలో , సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తాము .

ఈ పద్దతులను , సాంప్రదాయాలనూ వివరించేవే సూత్రాలు . ఈ సూత్రాలను వివిధ మహర్షులు రాసియున్నారు . యజుర్వేదము పాటించేవారికి ’ ఆపస్తంబుడు ’ ’ బోధాయనుడు ’ సూత్రాలను రాసియున్నారు . ఋగ్వేదీయులకి ’ ఆశ్వలాయనుడు ’ రాశాడు .

బోధాయన సూత్రాలు చాలా వివరాలతో , ఎంతో నిడివితో కూడుకొని ఉంటాయి . బోధాయనుడి శిష్యుడైన ఆపస్తంబుడు , ఆ కాలానికే అవి నిడివి ఎక్కువ అని గ్రహించి , అనవసరమైన వాటిని కుదించి , ఎంత అవసరమో వాటిని మాత్రమే తిరగ రాశాడు . ఈనాడు యజుర్వేదము అనుసరించేవారిలో అధిక శాతము ఆపస్తంబుడి సూత్రాలనే ఎక్కువగా అనుసరిస్తారు . అయితే బోధాయన సూత్రాలను పాటించేవారుకూడా అనేకులున్నారు .

ఆపస్తంబుడు శ్రౌత , గృహ్య , ధర్మ మరియు శుల్బ సూత్రాలను రాశాడు . వీటన్నిటినీ కలిపి " కల్ప సూత్రాలు " అంటారు . మన వంశీయులు సాంప్రదాయకంగా పాటించే సూత్రాలను రాసినవారి పేరు కూడా ప్రవరలో చెప్పడము ఆనవాయితీ అయింది . ప్రవర అనేది ఒకమంత్రము కాదు . అది కేవలము మన పరిచయాన్ని చెప్పడము మాత్రమే .

( ఆపస్తంబుడి , 2650 B.C గురించి ఒక చిన్న ఆసక్తి కరమైన విశేషము ..ఆపస్తంబుడు అనునది అతని నిజమైన పేరుకాదు . అతడు ’ జల స్తంభన ’ విద్య నేర్చుకొని , నీటి అడుగున పద్మాసనములో రోజుల తరబడి కూర్చొని ధ్యానము చేసేవాడు. నీటిని నియంత్రించేవాడు కనక అతడిని ’ ఆపస్తంబుడు ’ అన్నారు . ( కొందరు ’ ఆపస్తంభుడు ’ అంటారు ) అతడు నీటిలో ఉండగా , చేపలు ఆకర్షించబడి అతని దగ్గర గుంపులు గుంపులుగా తిరుగుతుండేవి . జాలరులు అతడున్నది తెలియకనే , అక్కడికి వచ్చి చేపలు పట్టేవారు . ఒకసారి ఆపస్తంబుడు వలలో చిక్కుకొనగా , అతడిని జాలరులు " నాభాగుడు ’ అను రాజుగారి వద్దకు తీసుకొని పోతారు . రాజు అతడిని గౌరవించి , గోవులు సమర్పించి వదిలివేస్తాడు . )
శ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి వుపన్యసముము