HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

29, జూన్ 2013, శనివారం

కనుమరుగావబోతున్న 113 సం।। హేవలాక్ బ్రిడ్జి


కనుమరుగావబోతున్న 113 సం।। హేవలాక్ బ్రిడ్జి




 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చ రేకేస్తిస్తున్న గోదావరిమాత  పైన వేణువుగా  నిలచిన పాత రైలు వంతెన హేవలాక్ ను ప్రారంభించిన ఆ నాటి మదరాసు గవర్నర్ సర్ ఆర్ధర్ ఎలంబిక్ హేవలాక్ బ్రిటిష్ పాలకులచే సెహబాష్ అనిపించుకొని అనేక ప్రాంతాలలో గవర్నర్ గా చేసిన ఆయన మదరాసు గవర్నర్ గా వున్నా కాలం లో గోదావరి పాత రైలు వంతెనను ప్రారంభించి ధన్యుడయ్యాడు ్‌ఎవలొక్ వర్ధంతి జూన్ 25 న జరిగింది.బానిస వ్యవస్తకు వ్యతిరేకంగా ఉద్యమించిన హేవలోక్ సిలోన్ గవర్నర్ గా వున్నపుడు బియ్యం పైన ,ధాన్యం పైన పన్నును రద్దు చేసి ఘననీయుడు అయ్యాడు .
 గోదావరి నది పై  నూట పదమూడు క్రితం కట్టబడి  వంద  సంవత్సరములు అయుష్హే  రికార్డులలో రాసినందున ఈ రోజు మన రైల్వే బోర్డు ఈ బ్రిడ్జి ని ఇనపతుక్కుగా కేవలం 5 కోట్ల రూపాయల అంచనాగా అమ్మాలని  నిర్ణ ఇంచింది .
ఈ బ్రిడ్జి ని పర్యాటకముగా మరియు పాదచారులకు రాజముండ్రి కొవ్వూరుల ను కలుపుతూ ఉంచాలని ఎన్నో రోజుల నుండి ఉభయగోదావరి ప్రజలు కొరుతున్నరు. కాని రైల్వే బోర్డు నిర్ణయం ఆకోరికను తుంగలో తొక్కిన్ది.
హేవలోక్ బ్రిడ్జి డేటా
శంకు స్తాపన --------11-11-1897
తోలి ప్రయాణం -------6-8-1900
ప్రారంభించింది --------మదరాసు గవర్నర్ హేవలోక్
తోలి రైలు పరుగు ----- హౌరా మెయిల్
తోలి ప్రయానికులలో ఒకరు ---చిలకమర్తి లక్ష్మి నరసింహం
వర్క్ ఇంజనీర్ ఇన్ చీఫ్ -------ఎఫ్. టీ . జి .వాల్షణ్
విస్తీర్ణం ------------------------ 23 వేల చదరపు అడుగులు
వెయ్యి చదరపు అడుగులకు
రెండు సార్లు పెయింట్ ఖర్చు ------11 రూపాయల 5అణాల  9 పైసలు
బ్రిడ్జి నిర్మాణానికి అంచనా --------రూ  50 ,40,457\-
ఖర్చైనది -------------------------రూ 46,89,849\-
మిగిలినది -----------------------రూ .,56,698\-
బ్రిడ్జి పొడవు -------------------- 9,096 అడుగులు
స్తంబాలు -----------------------54

ఈరోజులలో అంచనాల తర్వాత ఇంత మిగిలింది అని చెప్పగల ప్రాజెక్ట్ ఏమైనా వుంటే చెప్పండి .[కాంట్రాక్టర్కి కాదండి బాబు]
ఇటువంతిబ్రిద్గేని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది .కావున దయచేసి అందరూ ఎవరికీ తొచినవిధముగా వారు రైల్వే బోర్డు కి [ఈ మెయిల్స్ ,ఎస్ ఎం ఎస్ లు, పోస్ట్ కార్డ్స్, ద్వారా ] బ్రిడ్జి ని కాపాడవలసిన ఆవశ్యకత ను తెలియచేయవలసింది.

ఇది గుడిగంట ఆద్యాత్మిక వారపత్రిక నుండి సేకరణ




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి