HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

24, జనవరి 2012, మంగళవారం

kokkiramma gudlu


కొక్కిరమ్మ గుడ్లు.
                      పిల్లలూ! నాచిన్నప్పుడు అంటే నాకు ఆరేడు ఏళ్ళప్పుడన్నమాట [ఇప్పుడునాకు65 ] మా అమ్మమ్మ  నాకు సత్యాన్ని గురించి చెప్పిన కధ నాకింకాఙ్ఞాపకం . సత్యం మానవులకే కాక పశు పక్ష్యాదులకు సైతం ఒక్కటే ననీ అసత్యం చెప్పినవారికి దండనతప్పదనీ,ఈకధ వలన తెలుస్తుంది. నాకు ఇంకా ఆకధ ఎంతో ఙ్ఞాపకం. ఎందుకంటే చిన్నతనంలో విన్నవి మరువలేము.అందుకే మీకు ఈకధ మన ' కొత్తపల్లి ' ద్వారా చెప్పాలన్పించి చెప్తున్నాను.

  పూర్వం ఒక కొక్కెరమ్మ [ కొంగ] ముంతంత ఇల్లుకట్టుకుని , దాన్లో మూడుపుట్ల వడ్లుపోసుకుని , వడ్లమీద గుడ్లు పెట్టుకుని , గుడ్ల మీద  తాను పడుకుంది.ఇంతలో ఒక ఏనుగు వచ్చి,
 "  ఉంది ,కొక్కెరమ్మ కొక్కెరమ్మ నాక్కాస్త చోటిస్తవా?" అని అడిగింది.దానికి కొక్కెరమ్మ
" ఏనుగన్నా!నేనుముంతంత ఇల్లుకట్టుకునిమూడుపుట్ల వడ్లుపోసుకుని, వడ్లమీద గుడ్లు పెట్టుకుని   , గుడ్లమీద నేను పడుకున్నా, నావెనక చోటుంటె నీవు పడుకో " అందిట.ఏనుగు పడుకుంది.
                 ఇంకాస్త సేపటికి ఒక నక్కవచ్చింది " కొక్కెరమ్మకొక్కెరమ్మ నాక్కాస్తచోటిస్తవా?" అని అడిగిందిట.కొక్కెరమ్మ " నక్క బావా! నేను ముంతంత ఇల్లుకట్టుకుని మూడుపుట్ల వడ్లుపోసుకుని వడ్ల మీద గుడ్లు పెట్టుకుని గుడ్లమీద నేను పడుకున్నా, నావెనక చొటుంటె ఏనుగుపడుకుంది , ఏనుగెనక చోటుంటె నీవుపడుకో" అంది
నక్క ఏనుగువెనుక పడుకుంది.మరికొంత సేపటికి ఒక పిల్లి వచ్చింది " కొక్కెరమ్మ కొక్కెరమ్మ !క్కాస్త చోటిస్తవా?" అంది. కొక్కెరమ్మ " పిల్లిమావా! నేనుముంతంతఇల్లుకట్టుకునిమూడుపుట్లవడ్లుపోసుకుని వడ్లమీద గుడ్లుపెట్టుకునిగుడ్లమీద నేనుపడుకున్నా, నావెనకచోటుంటె ఏనుగుపడుకుంది, ఎనుగెనక చోటుంటె నక్కపడుకుంది నక్కెనక చోటుంటె నీవుపడుకో " అంది.పిల్లికూడా  పడుకుంది.
       మరికొంతసేపటికి ఒక గుఱ్ఱం , ఒక తోడేలు వచ్చాయి. కొక్కెరమ్మ వాటికీ అలాగే చెప్పింది. అంతాపడుకున్నాయ్.మధ్యరాత్రి అయ్యే సరికి కొక్కెరమ్మకు ' పట పట మనే శబ్దం వినిపించింది.    కొక్కెరమ్మ " ఏంటాశబ్దం ! ఎవరైనా నాగుడ్లుకానీ తింటున్నారా?" అని అడిగిందిట. పిల్లి " లేదు కొక్కెరమ్మా!  చలికి  నాపళ్ళు పట పట మని కదుల్తున్నాయ్ " అందిట. తెల్లరినాక చూసుకుంటే కొక్కెరమ్మ గుడ్లు లేనేలేవుట!
                కొక్కెరమ్మ విచారంతో " మీ అందరికీ నేను రాత్రి చోటిచ్చాను మీలో ఎవరో నాగుడ్లు తినేశారు.మీరంతా గుండ్లకమ్మ నదికి వచ్చి ఒక్కోరూ మునిగి ప్రమాణంచేయండి. ఎవరైతే గుడ్లు  తిన్నారో వారిని గుండ్లకమ్మే ముంచుతుంది. అందిట.అన్నీ  సరేని నదిలో నిల్చుని కొక్కెరమ్మ చెప్పినట్లు పలికారు ." కొక్కెరమ్మ గుడ్లంట నేనంట తిన్ననంట ముంచు ముంచు గుండ్లకమ్మ తేలగొట్టు గుండ్లకమ్మ . " అని మూడుమార్లు  ప్రమాణం చేసి నదినీట ములిగాయి. అన్నీ నీటినుండీ బయటికివచ్చాయికానీ పిల్లిమాత్రం రాలేదు. నీట ములిగిపోయింది.అవన్నీ
     "కొక్కెరమ్మా! మాకు నీవు నీ ముంతంత ఇంట్లో చలిరాత్రిలో పడుకోను చోటిచ్చావు , ఆకృతఙ్ఞత లేని పిల్లి నీగుడ్లన్నీ తినేసింది, కానీగుండ్లకమ్మ నది మాత్రంఅసత్యానికిఅన్యాయానికీ శిక్ష విధించింది  బాధపడకు. " అని  ఓదార్చాయి..  చూశారా పిల్లలూ ! అన్యాయాకికి ,కృతఘ్నతకూ శిక్షతప్పదుమరి.. ఎప్పుడూ నీతి నిజాయితీలతో ,ఇతరులకు చేతనైనసాయంచేస్తుంటారుగామరి!
**************************************రచన-ఆదూరి.హైమవతి.

 హామీ:- ఎడిటర్జీ! ఈకధ నాచిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పినదని చెప్పానుగా!. నేను మాపిల్లలకూ, వాళ్లపిల్లలకూ చెప్పినది. మన కొత్తపల్లి పిల్లలకూ చెప్పాల్ని వ్రాసి పంపుతున్నాను.వీలువెంట అర్హత ఉంటే ప్రచురించగలరు.
ఇట్లు,
ఆదూరి.హైమవతి.
బ్లాగర్ :- ఈ కధ కొత్తపల్లి పత్రిక లోనిది నా మెయిల్ id  కి లింక్ ద్వారా వోచ్చినది నాకు నచ్చి ఇక్కడ ప్రచురిస్తున్నాను .

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి