HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

30, జూన్ 2011, గురువారం

మధుమేహం లేక షుగర్ [డయాబెటిస్ ]వ్యాధి-2


డయాబెటిస్ ఎందువలన ఎలా వొస్తుంది ?
వంస పారంపర్య , లేక జేన్యు లోపముల వలన క్లోమ గ్రంధి లోపము [ఫ్రాన్కిటైటిస్, ఫ్రాన్కియాస్ గ్రంధిలో రాలు ఏర్పడడం ,కేన్సరు మొ..]వలన మానసిక వొత్తిడి ,ఆందోళన వలన ,అధిక బరువు ఉండుట వలన ,అతిగా భుజించుట వలన ,ఆహార నియమములు పాటించక పోవుట వలన కొన్ని రకముల మందులు [ఉబ్బసమునకు,చర్మ వ్యాధులకు,కడుపునోప్పికి,పక్ష వాతమునకు, గుండెపోటుకు ]ఎక్కువుగా వాడుటవలన .షుగర్ వ్యాధి వొస్తుంది.

షుగర్ వ్యాధి లక్షణములు:
అతి దాహం, అతి మూత్ర విసర్జన ,అత్రిగా ఆకలి,అలసట, నీరసం, తల త్రిప్పుట,క్రమ క్రమముగా బరువు తగ్గుత ,ఇన్ ఫెక్షన్ ,ఎన్ని మందులు వాడినా కాళ్ళకు, శరీరానికి అయే గాయములు, కురుపులు మానుటకు చాలాకాలం పట్టుట.చర్మం పైన దురదలు, జననాంగాలు వద్ద వొచ్చే కొన్ని వ్యాధులు, అరిచేతులు, అరికాళ్ళు చురుకులు ,మనతలు వుండడం, త్వరితగతిని కంటి చూపు మందగించడం ,స్త్రీలకు ఋతు క్రమములో మార్పులు అనగా నెలసరి సరిగ్గా రాకపోవడం లేదా నిలిచిపోవడం .జాయింట్లు ,కండరాలు పటుత్వము తగ్గుట ,స్పర్స జ్ఞానం తగ్గిపోవుట ,కాళ్ళు లాగుతున్నట్లుగా వుండి ,తిమ్మిరిలుగా వుండడం మొ.. పై లక్షణముల వలన షుగరు వున్నట్లు గా గుర్తించ వోచ్చును.

షుగర్ వ్యాధి వొచ్చే అవకాశం ఎవరికీ ఎక్కువ ? తర్వాత భాగం లో --

3 కామెంట్‌లు:

  1. ఏం ఒక పోస్ట్లో రాసేయలేరా? ఇలా ఎన్ని సీరియళ్ళు సాగదీస్తామనుకుంటున్నారు? మీరు TV ధారావాహికల్లో పనిచేస్తారా?

    రిప్లయితొలగించండి
  2. హలో సర్ [అజ్ఞాత]
    మీరుఅనుకున్నట్లుగా నేను ఏవిధమైన టీవీ చానెల్ నందు పని చెయ్యట్లేదు .నేను భాగములు గా రాయడానికి మెయిన్ కారణం ఈ రోజులలో ఎవ్వరు ఎక్కువ సేపు పుస్తకం ,లేదా వేరోకితి చదువుతూ కూర్చోవట్లేదు ,జస్ట్ కాసేపు అంతే అలాంటిది నేను ఒక పెద్ద భారతం ఒకే సారి రాసినట్లైతే మీరుమాత్రం చదువుతార? మన బ్లాగర్ ఒకామె [4psmlakshmi.blogspot.com] నా కాశి యాత్రలు అని 16 భాగములు రాసారు .అవి చదివి నేను కాశి యాత్ర చేసినప్పుడు ఏంటో ఉపయోగ పడ్డాయి .అదే ఆవిడ ఒకే సారి రాసినట్లైతే నేను కొంతవరకు చదివి అపెద్దును .ఆఅనుభవముతొ నేను భాగములుగా రాయడం మొదలుపెట్టాను .ఎంకంటే అది ఒక ఇరవై పేజీల వరకు వుంటుంది .మీకు కష్టమైతే ఆఖరున ఒకేసారి అన్ని భాగములు చదవండి ,దయచేసి ఎవ్వరిని క్రిటిసైజ్ చేయడం కాని ,డిస్క్రైజ్ చెయ్యడం కాని చేయవొద్దు.----మూర్తి

    రిప్లయితొలగించండి
  3. Criticise చేయవద్దు అన్నారు, చేయలేదు. విసిగించేలా సీరియల్స్ రాయొద్దని వేడుకుంటున్నా, అర్థిస్తున్నా. ఆపై మీ దయ, మా అదృష్టం. మీరు లక్ష్మి గారిని అనుసరించడం ఇలా కాదనుకుంటా. ఒక పోస్ట్లో ఆమె కొంత అర్థవంతమైన విషయాలు రాస్తారు అన్నది విస్మరిస్తున్నారు. మీరు మరీ టివి సీరియల్ లాగా ఏమీ చెప్పకుండానే తరువాత భాగం కోసం ఎదురుచూడండి అనడం చికాకు కలిగించే విషయం. మీకు బోలెడంత మంది కామెంట్లు పెట్టాలని, కోరుకుంటున్నాను. అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. లేదంటే, చూసి చూడనట్టు నేనూ వెళ్ళి పోతా, ఆనక మీ ఇష్టం.

    రిప్లయితొలగించండి