డయాబెటిస్ ఎందువలన ఎలా వొస్తుంది ?
వంస పారంపర్య , లేక జేన్యు లోపముల వలన క్లోమ గ్రంధి లోపము [ఫ్రాన్కిటైటిస్, ఫ్రాన్కియాస్ గ్రంధిలో రాలు ఏర్పడడం ,కేన్సరు మొ..]వలన మానసిక వొత్తిడి ,ఆందోళన వలన ,అధిక బరువు ఉండుట వలన ,అతిగా భుజించుట వలన ,ఆహార నియమములు పాటించక పోవుట వలన కొన్ని రకముల మందులు [ఉబ్బసమునకు,చర్మ వ్యాధులకు,కడుపునోప్పికి,పక్ష వాతమునకు, గుండెపోటుకు ]ఎక్కువుగా వాడుటవలన .షుగర్ వ్యాధి వొస్తుంది.
షుగర్ వ్యాధి లక్షణములు:
అతి దాహం, అతి మూత్ర విసర్జన ,అత్రిగా ఆకలి,అలసట, నీరసం, తల త్రిప్పుట,క్రమ క్రమముగా బరువు తగ్గుత ,ఇన్ ఫెక్షన్ ,ఎన్ని మందులు వాడినా కాళ్ళకు, శరీరానికి అయే గాయములు, కురుపులు మానుటకు చాలాకాలం పట్టుట.చర్మం పైన దురదలు, జననాంగాలు వద్ద వొచ్చే కొన్ని వ్యాధులు, అరిచేతులు, అరికాళ్ళు చురుకులు ,మనతలు వుండడం, త్వరితగతిని కంటి చూపు మందగించడం ,స్త్రీలకు ఋతు క్రమములో మార్పులు అనగా నెలసరి సరిగ్గా రాకపోవడం లేదా నిలిచిపోవడం .జాయింట్లు ,కండరాలు పటుత్వము తగ్గుట ,స్పర్స జ్ఞానం తగ్గిపోవుట ,కాళ్ళు లాగుతున్నట్లుగా వుండి ,తిమ్మిరిలుగా వుండడం మొ.. పై లక్షణముల వలన షుగరు వున్నట్లు గా గుర్తించ వోచ్చును.
షుగర్ వ్యాధి వొచ్చే అవకాశం ఎవరికీ ఎక్కువ ? తర్వాత భాగం లో --