HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

7, ఫిబ్రవరి 2011, సోమవారం

చేపటానికి (చెరప టానికి ) చేటపెయ్యి . [మన చిరంజీవి ]

ఈ మాట చాలా మంది వినే వుంటారు ,చాలామందికి తెలుసు కూడా .ఇది సామెతే ఐనా నిజం కూడా .దూడ చనిపోయిన తర్వాత ఆవు, లేదా గేదల నుండి పాలు పిండుకోవడానికి దూడ అని బ్రమ కలిగించే నాలుగు కాళ్ళు ,మోహము కర్రముక్కలలతో ఆకారము కల్పించి దానికి గడ్డి చుట్టి ఆపైన చనిపొఇన దూడ చర్మము వేసి కుట్టిన దూడలాంటి బొమ్మను (అదే చేటపేయి ) పాలు పిండే టైం లో ఆవు లేదా గేదెకు దగ్గరగా పోదుగువద్దపెట్టి అది దూడే అనుకొని బ్రమ లో నాకుతోంటే ఇదే అదునుగా పాలు పిండుకు త్రాగటం చాలా చోట్ల చూస్తూవుంటాము .పాలు పిండిన తర్వాత చేటపెయ్యిని గోడకు కొట్టిన కొయ్యకు తగిలిస్తారు .ఎందుకంటే దాని అవసరం మళ్ళీ పాలు తీసే టైం వరకు అవసరము లేదు కాబట్టి. దానికి గడ్డి నీరు ,దానా వేయనక్కరలేదు కాబట్టి.
అలాగనే కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి చనిపొఇన తర్వాత ,జగన్ బయటకు వొచ్చిన తర్వాత పార్టికి 1)పోఇన ఆకర్షణ ,2) జనబలం ,3) నాయకత్వ లోపం 4) వోట్లు అనే నాలుగు పొదుగుల నుండీ తమకు కావలిసింది పిండుకోవడానికి పనికి వొచ్చే చేటపెయ్యి మాత్రమె చిరంజీవి. [అవసరం తీరాక షరా మామూలే ]
ఎంతో ఆర్భాటముగా N T R ను దృష్టిలో పెట్టుకొని పాపం మన తూ. గో. జిల్లా శివుడు జనం పొగుడు తొంటే పార్టీని పెట్టి ఎన్నికల తర్వాత చతికిల బడి పోఇన పార్టీ ని ఏమి చేయాలిరా ఈపార్టి ని అనుకుంటున్నా సమయములో ,జగన్ కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ అనుకుంటున్నా సమయాన్ని [రోగి కోరుకోన్నదీ, డాక్టర్ కోరుకోన్నదీ ఒక్కటే అనే చందాన ] ఇద్దరూ అందిపుచ్చుకొని పదవి మాట దేముడెరుగు ఈ బరువు పరువు పోకుండగా దిగేతే చాలనుకున్నారు .[వాళ్ళ దృష్టిలో పరువు పోక పాయినా ఎలాగూ పాయిందనుకోండి ]. 30 years industry మకుటం లేని మహారాజులా వెలిగిన అన్నయ్యను ఎవ్వరేనా ఏమైనా వేలెత్తి చూపితే కబడ్ దార్ అనే తమ్ముళ్ళు ఈ రోజు బుర్ర ఎత్తుకొలేని పరిస్తితి .
# మా పెద్దాయన ఒకరు అనేవారు పార్టీలు అన్ని మఖలో పుట్టి పుబ్బలో పోతాయిరా అని .# ఏమిటా అనుకొనే వాడిని .దాని అర్ధం ఇప్పుడు తెలిసింది .

5, ఫిబ్రవరి 2011, శనివారం

రధ సప్తమి

రవి పుట్టిన రోజు రథ సప్తమి


లోకబాంధవుడు, గ్రహాలకు అధిపతి, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి సూర్యునికి భూమి చేరువ కావడం ప్రారంభమవుతుంది. అంటే భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది. సర్వదేవమయుడైన ఆదిత్యుని ఆరాధించడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. అందుకు అనుకూలమైన రథసప్తమి ఈ నెల 10, గురువారం. ఈ సందర్భంగా ఈ వ్యాసం.

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మించినవాడే సూర్యుడు. ఈయన రవి, భాను, అర్క, భాస్కర, సవిత, వివస్వత, సర్వాత్మక, సహస్రకిరణ, పూష, గభస్తిమాన్, ఆదిత్యుడు అనే ఇతర నామాలతో కూడా ప్రసిద్ధుడు. ఛాయాదేవి, సంజ్ఞాదేవి ఈయన పత్నులు. శనీశ్వరుడు, యముడు, యమున మున్నగువారు వీరి సంతానం.
సూర్యభగవానుడు అన్ని జీవులపట్ల సమదృష్టి కలిగిన వాడు.

ఆరోగ్యప్రదాత. మహాశక్తిమంతుడు. సకల శాస్తప్రారంగతుడు. ఆంజనేయునికి గురువు. సువర్చలాదేవి ఈయన మానస పుత్రిక. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ధనం వ్యయం చేసినా, విద్యాబుద్ధులు ఒంటబట్టక నిరాశలో ఉన్నవారు తమ జాతకం ప్రకారం సూర్యుని పూజించి, ఆయనను ప్రసన్నం చేసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుందని నవగ్రహపురాణం చెబుతోంది. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు.
నేత్రవ్యాధులు, శత్రుబాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శుచిగా ఉండి, నియమాలు పాఠిస్తూ, మండలం రోజులపాటు నిష్ఠగా ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి.

రామరావణ సంగ్రామంలో రాముని బలం క్షీణించి, నిరాశానిస్పృహలలో కూరుకుపోయి ఉన్న సమయంలో... అగస్త్య మహర్షి శ్రీరామునికి వారి వంశ మూలపురుషుడైన సూర్యుని శక్తిని వివరించి, ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు. ఆ దివ్యశ్లోకాలను పఠించిన శ్రీరాముడు నూతన శక్తిని పుంజుకుని యుద్ధంలో విజయం సాధించినట్లు రామాయణ మహాకావ్యం పేర్కొంటోంది. దీనిని బట్టి సూర్యారాధన ఎంతటి శ్రేష్ఠమైనదో తెలుస్తోంది.

రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది.

రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరికి ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ.

- డి.వి.ఆర్. భాస్కర్

తల్లీ నినుతలంచి పుస్తకం చేతన్ బూనితి

ఈ ఆధునిక యుగంలో సమస్తానికీ మూలకారణం విద్య ఒక్కటే. చక్కటి విద్యకారణంగానే పిల్లలు సభ్యమానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. భాషాజ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్పూర్తిగా, నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధిస్తే చాలు ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను ప్రసాదిస్తుంది.

సకల విద్యాస్వరూపిణి, సకల వాజ్ఞయానికీ మూలకారకురాలు, భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. పలుకు తేనెల బంగరు తల్లి, వేదాలకు జనయిత్రి, వీణాపుస్తక ధారిణి అయిన ఆ తల్లి దయ ఉంటే వెర్రిబాగులవాడు వేదవేదాంగవేత్త అవుతాడు, మూర్ఖుడు మహావిద్వాంసుడుగా మారిపోతాడు. ఆమెను తృణీకరిస్తే మహాపండితుడు కూడా వివేకశూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుంటాడు. అందుకే ఆ చల్లని తల్లి కరుణ అందరికీ అవసరం. ఎవరైనా సరే, తమకుగాని, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా ఈ కిందివిధంగా వ్రతాచరణ చేసి, సత్ఫలితాలు పొందవచ్చు. ఈ వ్రతానికి శ్రావణ మాసం లేదా మాఘమాసం శ్రేష్ఠమైనవి.

వసంత పంచమి లేదా ఏదైనా శుక్లపక్ష పంచమి లేదా పూర్ణిమ తిథిన ఉదయం పూట స్నానాదికాలు ముగించుకుని శుచి అయి, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవి ప్రతిమ లేదా చిత్రపటానికి తెల్లని పూలు, అక్షతలు, మంచిగంధం, తెల్లని నగలు అలంకరించి షోడశోపచారాలతో పూజించి, పాయసం నివేదించాలి. పూజానంతరం ఆ పాయసాన్ని ప్రసాదంగా భుజించి, అందరికీ పంచిపెట్టాలి. ఈ విధంగా 5 వారాలు చేయాలి. ఆఖరి వారం నాడు ఐదుగురు బాలలను అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి, నూతన వస్ర్తాలు కట్టబెట్టి, పలకాబలపాలు లేదా పుస్తకం, కలం ఇచ్చి సంవత్సరంపాటు వారి చదువుకు అయ్యే ఖర్చును భరించాలి.

సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వులతో చేసిన లడ్లు, చెరుకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్లు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి.

పుస్తక రూపంలో పూజ

సరస్వతీదేవి ఆవిర్భవించిన పర్వదినం మాఘశుద్ధపంచమి లేదా శ్రీపంచమి. ఈ రోజున ఆమెను పుస్తకాది రూపాలలో, విగ్రహంలో ఆవాహన చేసి పూజిస్తే మంచిది. విశేష అర్చన, పూజ, వ్రతోత్సవాలు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది.





- పూర్ణిమా స్వాతి