సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు బ్లాగ్ బ్లాగ్...
సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు నిత్యం తమ భావాలను వెలిబుచ్చడానికి బ్లాగ్‌లను వాడుతున్నారు. అనేక విషయాలపై అందరితో భావాల
ను పంచుకోవడానికి ఈ బ్లాగ్‌లు ఉపయోగపడుతున్నాయి. 2003లో
జరిగిన ఇరాక్ యుద్ధంలో పాల్గన్న సైనికులు యుద్ధ అకృత్యాలను, వారి భావాలను
ఈ బ్లాగ్‌లలో వుంచడంతో అమెరికా దుష్ట చర్యలు లోకానికి తెలియవచ్చింది.
అలాగే
అనేక విషయాలను చర్చించడానికి ఈ బ్లాగ్‌లు ఉపయోగపడుతున్నాయి. మొదట
కంప్యూటర్, తరువాత ఇంటర్నెట్, అటు తర్వాత ఈ మెయిల్స్ ఈ వాడకం, ఇప్పుడు
బ్లాగ్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తమకు ఇష్టమొచ్చింది దీనిలో
పెట్టుకోవచ్చు. ఒకరికి నచ్చినా, నచ్చకపోయినా పనిలేదు. మంచి చెడులను
చర్చించవచ్చు. ఈనాడు వార్తా పత్రికలు, టివీలకన్నా ఈ బ్లాగ్‌లకు ఆదరణ
పెరిగింది. నేను ఒక కవిత లేదా కథ వ్రాశాననుకోండి. మాములుగా అయితే దానిని
ప్రచురించడానికి ఏ పత్రికకైన పంపాలి. దాని వారు పరిశీలించి ప్రచురణకు
యోగ్యమైందో లేదో చూడాలి. యోగ్యమైతే ప్రచురిస్తారు. అనోగ్యమైతే తిప్పి
పంపుతారు. ఈ ప్రక్రియ అంతా చాలా కాలం పడుతుంది. అదే బ్లాగ్‌లో అయితే మనము
రాసిన వెంటనే పెట్టేయ (పోస్టు) వచ్చు. అందరికీ అందుబాటులో కొద్ది
నిముషాలలోనే తీసుకురావచ్చు. అంతటి మహత్తరమైన ప్రక్రియే ఈ బ్లాగ్. అందుకే
అనతికాలంలోనే అపరిమితమైన ఆదరణకు నోచుకుంది.
ఒక
విధంగా చెప్పాలంటే తెరచిన పుస్తకం. ఎవరైనా చదవచ్చు. తమ అభిప్రాయాలను
వెలిబుచ్చవచ్చు. ఇంటర్నెట్ వాడకానికి రాకమునుపు ఎలక్రానిక్ సంభాషణలు,
వైర్ సంభాషణలు వుండేవి. అమెచ్యూర్ రేడియోని దీనికి ఉదాహరణగా
చెప్పుకోవచ్చు. ఈ అమెచ్యూర్ రేడియో యూజర్లు గ్లాగ్ (సైన్‌బోర్గ్‌లాగ్)లు
రాసేవారు. 



అలా వెబ్‌లాగ్ పేరు మరుగునపడి బ్లాగ్‌గా వాడకంలోకి వచ్చింది. 1999 సంవత్సరంలో బ్లాగ్ హౌస్టింగ్ కోసం బ్లాగర్ అనే వెబ్‌సైట్ ముందుకొచ్చింది. బ్లాగ్‌లలో వీడియో బ్లాగ్స్, ఆడియో బ్లాగ్స్, ఫొటో బ్లాగ్స్, మోబ్లాగింగ్స్ వుంటాయి. వీడియో బ్లాగ్స్‌లో మనకు కావలసిన వీడియోలను పెట్టుకోవచ్చు. ఆడియో బ్లాగ్స్‌లో ఆడియోలు వుంచుకోవచ్చు. అలాగే ఫొటో బ్లాగ్స్‌లో మనకు కావలసిన ఫొటోలను పెట్టుకోవచ్చు. మొబైల్ ద్వారా నిర్వహించే బ్లాగ్స్‌ను మోబ్లాగింగ్స్ అంటారు.
[తెలుగు లో కంప్యూటర్ వార్తలు బ్లాగ్ నుండి సేకరణ ]