ఇకపై పావలా కనిపించదు!
ముంబై: ఇంతకాలం అరకొరగా చలామణీలో ఉన్న పావలా, అంత కన్నా తక్కువ విలువ గల నాణేలకు ఇకపై కాలం చెల్లనుంది. ఇలాంటి నాణేలను జూన్ 30 లోగా బ్యాంకుల్లో చెల్లుబాటు చేసుకోవాలని, జూలై 1 అనంతరం వీటి చలామణీని రద్దు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించటమే ఇందుకు కారణం. జూన్ తర్వాత ఆయా నాణేల చలామణీని ఉపసంహరించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఈ మేరకు 25 పైసలు అంతకన్నా తక్కువ విలువ గల నాణేలను రిజర్వ్ బ్యాంక్ అన్ని శాఖలతో పాటు ఇలాంటి నాణేల కోసం ప్రత్యేక విభాగాలు కలిగిన బ్యాంకుల్లోనూ మార్చుకోవచ్చని తెలిపింది. జూన్ 29 లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.