సప్త చిరంజీవులు
౧.అశ్వద్దామ ,౨. బలి ,౩.వ్యాసుడు,౪.హనుమంతుడు,౫.విభీషణుడు,౬.కృపుడు,౭.పరశురాముడు.
౧.అశ్వద్దామ:- ద్రోణాచార్యుని కుమారుడు,మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు.
ఇతడు చిరంజీవి.
౨.బలి :-ప్రహలాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు,ఇంద్రుని జయించినవాడు,వామనమూర్తి కి మూడడుగుల భూమిని దానం చేసి,అతని చే పాతాళమునకు త్రోక్కబడినాడు .కానీ ఈతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గదాదారిగా ఈతని వాకిటికి కావాలి కాచేవాడు .యితడు చిరజీవి. ఇతని సత్య సంధతకు మెచ్చిన మహా విష్టువు ఈమన్వన్తరములో దైత్త్యేద్రత్వమును , పై మన్వంతరములో దేవేంద్రపదవిని అనుగ్రహించాడు .
౩.వ్యాసుడు :-సత్యవతీ పరాసరుల కుమారుడు.కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబదేవాడు. అస్తాదాస పురాణాలను, బ్రహ్మసూత్రములను,భారత భాగవతములను ఇంకనూ అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వానిని వ్యాసుడు అని పేర్కొంటారు. ఒక్కొక్క యుగములో ప్రశంసింప బడినారు .
౪.హనుమంతుడు:-కేసరి భార్య అగు అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో వున్నా శివుని శక్తిని ఆమెకు ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టినాడు .సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు .పరమేశ్వరుని అపరావతారముగా కొలవబదినవాడు హనుమంతుడు .రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ .మహా భారతయుడంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయమునకు కూడా దోహదకారి ఇనాడు .ఇతడు చిరంజీవుడు .రామ భాక్తాగ్రేస్వరుడైన ఆంజనేయుడు చిరంజేవిగా తన భక్తులకు సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉంటాడు.
౫.విభీషణుడు:-కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు . బ్రహ్మపరమున ఈతడు సుశీలుడైనాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ .రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి ,సన్మార్గము గూర్చి చెప్పేవాడు .సముద్రమును దాటుటకు శ్రీ రామునకు ఉపాయము చెప్పినవాడు .రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పినవాడు.రావణుని అనంతరం లకాధిపతి ఇనాడు .ఈతడు చిరంజీవుడు.
[మిగిలిన ఇద్దరు గూర్చి తర్వాత పోస్ట్ లో ]