HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

1, మే 2010, శనివారం

లంకంత కొంప ,కొంపంతా లంకే

లంకంత కొంప అనే పదం సమాజం లో చాలా విరివిగా వినిపిస్తుంది. కానీ,కొంపంతా లంకే ! అనే పదం క్రొత్తగా అనిపిస్తోంది కదూ!చదివితే మీకే అర్ధమవుతుంది.ఇల్లు కట్టుకొనేటప్పుడు వసతులు, సౌకర్యాలు ,హంగులు ,రంగులతో చాలా విలాసవంతముగాను, ఆకర్షనీయం గాను కట్టుకుంటారు.కానీ మనుష్యులు మాత్రం నవగ్రహాల్లా ఒకరికొకరు పొంతన లేకుండా జీవనం సాగిస్తుంటారు. ఒకరంటే ఇంకొకరికి పడదు.ఒకరి మాట ఇంకొకరి వద్ద చెల్లదు. ఏ దారెటు పోతోందో ఎవరికీ తెలియదు.ఎవరి ధోరణి వారిదే. ఎడమొహం, పెడమొహంగా బ్రతుకును వెళ్ళదీస్తుంటారు. ఇంటిలో వుండడం కంటే బయటనే మనశాంతి గా ఉంటుందని ఎక్కువుగా బయటనే కాలక్షేపం చేస్తుంటారు . నిజంగా అన్నీ వున్నా నోట్లో శని ఉంది అన్నట్లు చాలా దుర్భరమైన జీవితం గడుపుతూవుంటారు.ఇందుకు కారణం......
౧.డబ్బులనే ద్యేయంగా,పరమావధిగా భావించడం.
౨.మానవ సంబంధాలు కేవలం శారీరకమైన సంబంధాలకే పరిమితమవడం .
౩.ఊహాపోహలు, అపార్ధాలు, పొరపొచ్చాలు పెరిగి సత్సంబంధాలు దెబ్బతినడం .
౪.కాలం వెచ్చించి తోటి కుటుంబ సబ్యుల కష్టసుఖాలను,వారి ఇబ్బందులను పట్టించుకోకపోవడం.
౫.సమైక్యతా, అన్యోన్యతలు లోపించడం.
౬.కుటుంబములో ప్రతీ వ్యక్తీ తనవంతు బాద్యతలు,కర్తవ్యాలు నిర్వర్తించాలనే సత్యాన్ని మరవడం.
౭.కుటుంబములో తోటివారి భావాలను తేలికిగా తీసుకొని వారిని చులకనగా మాట్లాడడం .
౮.తనపెత్తనమే చెలామణి కావాలనుకొని మొండిపట్టుదల పట్టడం.
౯.తానూ అనుకొన్నది అనుకొన్నట్లు జరగకపోతే రామరావణ సంగ్రామం తలపించే విధముగా ప్రవర్తించడం .
౧౦.ఇవన్నీ ఒక ఎత్తు. గృహములో ఆద్యాత్మిక వాతావరణం లేకపోవడం,భక్తి భావాలు సన్నగిల్లడం, ధార్మిక చింతన కొరవడడం వంటి అంశాలు ఖచ్చితంగా విపరీతమైన పరిణామాలకు దారితీస్తున్నై .
నిజానికి ఇంట్లో విశాలమైన పడక గదిని, సౌకర్యాలతో కూడిన స్నానపు గదులను,నవీన వసతులతో కూడిన వంట గదులను నిర్మించుకున్టాము.కానీ, ప్రసాంతతను,ఆహ్లాదాన్నిస్పూర్తినివ్వగలిగే పూజామందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాము. ఏదైనా బాధ కలిగినా,మానసికముగా ప్రసాన్తతలోపించినా,ఇబ్బందులు ఎదురైనా,వీటన్నిటిని అధిగమించేందుకు వీలైన పూజా గదిని మన గృహములో ఖచ్చితముగా ఏర్పాటు చేసుకోవాలి.ప్రతీ రోజు నిత్యక్రుత్యలనంతరం శ్రద్దగా ప్రతిఒక్కరూ
పూజా గదిలో వెచ్చించాలి .
స్తోత్ర పారాయణ చేసుకోవడం, భగవంతునికి పుష్పాలను సమర్పించడం, సుగంధభరితమైన ధూపం వేయడం,ఆవు నేటితో కాని, నువ్వులనూనెతో కానీ దీపారాధన చేయడంవలన గృహము లోనూ,కుటుంబ సభ్యులందరి లోను తప్పక మంచి అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంస్కారాన్ని ఇంటిలో ప్రతి ఒక్కరికి అలవాటు చేయించండి. ఈ అలవాటే క్రమేపీ ఆచారముగా మారుతుంది. తద్వారా ప్రతిగృహము దేవాలయముగాను, అందులోని ప్రతిఒక్కరూ సచేతనమైన దేవతా మూర్తులు కాగలరు .
ఇల్లు అనే తెలుగు పదాన్ని ఆంగ్లములో house అని అంటారు. గృహం అనే పదం సంస్కృత సబ్దమైనప్పతికిని తెలుగులో కూడా వాడుతూ వుంటారు. గృహమనే పదము లో అహం అనే ఉచ్చారణ స్పురిస్తుంది. ఇల్లు అనగానే వస్తువులు, పదార్ధాలు, పరికరాలు మాత్రమె కావు, వ్యక్తులే ప్రధానం.కాబట్టి ఈ ఒక్కరి వ్యక్తిత్వాన్ని కించపరచకుండా ప్రతి ఒక్కరినీ తన మాటలతో, చేతలతో, భావాలతో సమన్వయము చేసుకుంటూ సాగే గృహస్తాశ్రమ విధానం స్వర్గంకన్న ఖచ్చితముగా గొప్పదే.
గృహములోని బంధాలు, భాందవ్యాలు మనం కల్పించుకోన్నవి కావు. అవి పరమాత్మ చే అనుగ్రహింప బడినవి. ఈ లోకంలో నేను ఫలానా వాడి కడుపునా పుట్టాలి ,ఫలానా ఇంట్లో పుట్టాలి అని నిర్నించుకొనే అవకాసము ఏ ఒక్కరికి లేదు. అందుకని ఇది కాకతాళీయముగా జరిగిందని చెప్పలేము. వీటన్నిటి వెనుక బల్లెయమైన కారణముందని విశ్వసించే హిందూ సంస్కృతీ మనది.
*కర్తురాజ్ఞాయా ప్రాప్యతే ఫలం * పర మాత్మ అనుగ్రహం తోనే మన జన్మాంతర ఖర్మలు పరిపక్వమై కార్య రూపాన్ని దాలుస్తున్టై .అందులో భాగమే తల్లి,తండ్రి,భార్య, భర్త,పిల్లలు మొదలగునవ్న్ని .వీటన్నిటిని ఈశ్వర ప్రసాదముగా భావించి పక్షపాత ధోరణిని విడిచి, సమన్వయము చేసుకుంటూ కొనసాగే జీవన విదాన్నానే గృహస్తాశ్రమ ధర్మమంటారు .అట్టి ఈ జీవితాన్ని సమర్దవంతముగా కొనసాగించేందుకు వ్యక్తి తనను తను సమస్కరించుకొంటు గృహములో కూడా మంగళకరమైన వాతావరణాన్ని పెంపొందించే దిసేగా ప్రయత్నించాలి. అందుకై ఈ సూచనలు ఏమాత్రము ఉపయోగపడినా ఉభయత్రా లాభం!సర్వత్రా సౌఖ్యం .