HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

12, ఆగస్టు 2011, శుక్రవారం

శుభ కార్యాల్లో పసుపు వస్త్రాలు ఎందుకు?

శుభ కార్యాల్లో పసుపు వస్త్రాలు ఎందుకు? (Purpose of Yellow Clothes)....

శుభ కార్యాల్లో పసుపు వస్త్రాలు ఎందుకు?

(Purpose of Yellow Clothes)

హిందువుల పూజాది కార్యక్రమాల్లో, పెళ్ళిళ్ళు ఇతర శుభ కార్యాల్లో పసుపు బట్టలకు చాలా ప్రాధాన్యత ఉంది. హోమం పూర్తయిన తర్వాత కృష్ణాజినపు ముక్క, మోదుగు చేతి కర్ర, మౌంజిలతో బాటు పీతవస్త్రం ధరించాల్సి ఉంటుంది. కానీ, ఎందుకు, ఏమిటి అనేది మాత్రం చాలామందికి తెలీదు. అసలు పీతవస్త్రం ఎందుకు ధరిస్తారో, పసుపు రంగులో ఉన్న గొప్పతనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపులో క్రిమి నాశక గుణం ఉంది. అందుకే మనం పసుపును ఏదో రూపంలో ఉపయోగిస్తుంటాం. గడపకు పసుపు రాయడంలో కళాత్మకత మాత్రమే పరమార్థం కాదు. చీమలు, ఇతర సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయనే ఆలోచతో ఈ ఆచారం బయల్దేరింది. అలాగే కూరల్లో పసుపు వేయడంవల్ల ఆకర్షణీయమైన రంగు రావడమే కాకుండా ఆరోగ్యానికీ మంచిది. స్నానం చేసేముందు ముఖానికి, వంటికి పసుపు రాసుకుంటారు. ఇలా చేయడంవల్ల శరీర ఛాయ పెరుగుతుందని, అనేక రుగ్మతలు తగ్గుతాయని, చర్మ వ్యాధుల్లాంటివి రావని పెద్దలు చెప్తారు.

శ్రీచూర్ణం, కుంకుమల్లో కూడా పసుపు ఉంది. ముగ్గుల్లో పసుపు జల్లుతాం. ఆయుర్వేద వైద్యంలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. తులసి మొక్కకు పసుపు రాస్తాం. హిందూ సంస్కృతిలో పసుపు వాడకం ఒక అలవాటుగా, ఆచారంగా ఉంది. దీన్ని మంగళప్రదమైన ద్రవ్యంగా వాడుతున్నాం.

పసుపు చర్మ వ్యాధులను నయం చేస్తుంది. అలాగే, చర్మ రోగాల కారణంగా వచ్చే ఇతర రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. పరిణామశూల లాంటి ఇబ్బందికరమైన వ్యాధులను నయం చేస్తుంది. పైకి కనిపించే జబ్బులను, కనపడకుండా బాధ కలిగించే వ్యాధులను కూడా పసుపు నివారిస్తుంది.

పసుపురంగులో ఒక వింత ఆకర్షణ ఉంది. ఈ రంగు దుస్తులు ధరించడంవల్ల శరీర వర్చస్సు పెరుగుతుంది. దాతో పసుపు బట్టలు వేసుకున్నవారిపట్ల ఎదుటివికి ఒకవిధమైన సద్భావం కలుగుతుంది. పసుపు రంగు నరాలను కూడా ఉత్తేజపరుస్తుంది.

మానవ శరీరం పంచభూతాల సమ్మేళనం. అనుక్షణం నవగ్రహాల ప్రభావం మనమీద పడుతుంటుంది. పసుపురంగుకు పంచభూతాలు, నవగ్రహాలను అనుకూలంగా మార్చే శక్తి ఉంది. అందుకే మహర్షులు ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకునేలా ఆచారాలను ప్రబోధించారు. తపస్వుల అనుభవ జ్ఞానంతో అంకురించినవే వివిధ ఆచారాలు. వాటిని మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడిప్పుడు రంగుల చికిత్స లేదా కలర్ థెరపీ అమల్లోకి వస్తోంది. కానీ మన మహర్షులు ఈ జ్ఞానామృతాన్ని ఏనాడో బోధించారు.

పూర్వం విద్యార్థులు గురుకులానికి వెళ్ళి చదువుకునేవారు. అక్కడ అనేకమంది కలిసి ఉంటారు కనుక ఎవరికైనా వ్యాధులు ఉంటే, ఇతరులకు సోకే ఇబ్బంది ఉందని, పీత వస్త్ర ధారణ చేసేవారు. అలా విద్యాభ్యాసం చేసేంతకాలం పీత వస్త్రాలు మాత్రమే ధరించేవారు.

హిందూ సంప్రదాయాన్ని అనుసరించి, పెళ్ళిలో వధూవరులు పసుపుబట్టలు ధరిస్తారు. అలాగే పెళ్ళికూతురి తలపై పసుపు అద్దిన చట్రం ఉంచుతారు. వధువు అత్తగారిల్లు చేరేవరకూ ఆ చట్రం అలాగే ఉంటుంది. ఆంగ్లేయుల పరిపాలన మొదలైన తర్వాత వధూవరులు పసుపు బట్టలే ధరించాలి అనే నియమం సడలినప్పటికీ, తలంబ్రాలు పోసుకునే సమయంలో పసుపు అద్దిన వస్త్రాలనే ధరిస్తున్నారు. అలాగే, తలంబ్రాలు పడటంవల్ల కూడా అవి మరింత పచ్చగా తయారవుతాయి.

26, జులై 2011, మంగళవారం

ఆదివారంప్రత్యేకత ఏమిటి?

ఆదివారంప్రత్యేకత ఏమిటి?

(Speciality of Sunday)

సూర్యుణ్ణి గ్రహరాజు లేదా గ్రహాలకి అధిపతి అంటాం. ఆ సంగతి అలా ఉంచితే సూర్యుడు లేకపోతే మనకు వెలుగే లేదు. అంధకారంలో పడి కొట్టుకుపోయేవాళ్ళం. అంతకంటే ముందు అసలు జీవించడమే దుర్భరం అవుతుంది. ఇంతకీ సూర్యుడికి ఇష్టమైన రోజు ఏమిటో తెలుసా? ఆదివారం. ఆదివారాన్ని 'రవివారం' అని కూడా అంటారు. అసలు ఆదిత్యుడి పేరు మీదే ఆదిత్యవారం అని వచ్చింది. క్రమంగా వ్యావహారికంలో (వాడుక భాష) ఆదివారంగా మారింది. సంస్కృతంలో భానువారం అని కూడా అంటారు.

అవునూ, మనకంటే ఆఫీసులకి సెలవు కావట్టి ఆదివారం అంటే ఇష్టం. సూర్యుడికి కూడా ఆదివారమే ఇష్టం కావడమేంటి?సూర్యుడిక్కూడా ఆదివారం రోజు సెలవా ఏమిటి – అని నవ్వుకుంటున్నారా? ప్చ్.. సూర్యుడు కనుక సెలవు తీసుకుంటే మనకు మనుగడే లేదులెండి. మొత్తానికి ఆదిత్యునికి రవివారం మహా ప్రియమైన రోజు.

మనలో కొందరికి గ్రహ దోషాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. రాహువు, కేతువు, కుజుడు మొదలైన గ్రహాల్లాగే ఆదిత్యునికి కూడా దోష నివారణ కోసం గ్రహ సంతులు చేస్తారు. కోణార్క్ సూర్య దేవాలయం ఒరిస్సా రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. మొత్తం దేశంలోనే ఈ సూర్యదేవాలయం ప్రసిద్ధి కాంచింది.

మామూలు ఆదివారాల సంగతి కాసేపు పక్కన పెడితే తాటాకు ఆదివారం అని ఒకటుంది. తాటాకు ఆదివారం నాడు ప్రత్యేక క్రైస్తవ మతస్తులు విందు భోజనం ఏర్పాటు చేసుకుంటారు. ఈ తాటాకు ఆదివారం ఎప్పుడూ ఈస్టర్ ఆదివారం కంటే ముందు ఆదివారం వస్తుందన్నమాట. ఆవేళ నాలుగు సువార్తలను చెప్పిన రోజును గుర్తు చేసుకుంటారు. జీసస్ తన వాంఛ కన్నా ముందు జెరూసలేం లోనికి దగ్విజయంగా ప్రవేశించాడు కనుక దీన్ని వాంఛ ఆదివారం లేదా దేవుని వాంఛతో కూడిన తాటాకు ఆదివారం అంటారు.

ఆదివారం నాడు

"భాస్వన్ కాస్యపగోత్రజో రుణరుచిస్సింహపోర్కస్సమి

త్వట్త్రిస్థో దశశోభానో గురుశశీ భౌమ స్సుమిత్రాస్సదా

శుక్రో మస్తరిపు: కళింగజన పశ్చాగ్నీశ్వరో దేవతా

మధ్యేవర్తుల పూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళమ్!”

- అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకుంటే చాలా మంచిది.

Share

23, జులై 2011, శనివారం

మధు మేహం లేక షుగర్ [డయాబిటిస్ వ్యాధి]-3

షుగర్ వ్యాధి అంటువ్యాధి కాదు. ఇది సూక్ష్మ జీవుల వలన కూడా రాదు. ఇది వంస పారంపర్యం వలన కూడా ఎక్కువమందిలో వస్తున్నది. 40 సం. పైబదినవారిలో వంసపారంపర్యముగా వస్తున్నది.తల్లితండ్రులిద్దరికి ఈ వ్యాధి ఉంటె వారి సంతానం లో 99% . తల్లితండ్రులలో ఒకరికి షుగర్ వ్యాధి వుండి, మరొకరు కూడా సుగార్వ్యాది కలిగిన కుటుంబములోని వారైతే 70%. తల్లి తండ్రులలో ఒకరికి సుగార్వ్యాది వుండి మరొకరికి లేకపోతె వారి సంతానంలో 40%, అదేవిధముగా కుటుంబములో ఎవరికైనా షుగర్ వ్యాధి వుంటే సంతానానికి 20% రావడానికి అవకాసం వున్నది .
అధిక బరువు ఉండుట, మానసిక వొత్తిడి ,ఆందోళన ,శరీరానికి సరైన వ్యాయామములు లేకపోవుట ,సరైన పోషకాహారము తీసికోననందున మితి మీరి భుజించుటవలన,మితి మీరి ఆల్కహాలు సేవించుటవలన ఈ వ్యాధి వొస్తుంది.
ekkuva బరువున్న శిశువులకు,జనంనిచ్చే తల్లులకు కూడా ఈ వ్యాధి వోచే అవకాసం ఉందికొంతమంది స్త్రీలకూ గర్భిని సమయమందు డైయాబితాస్ కనిపించినా అది ప్రసవానంతరం అదృశ్యమైపోతుంది .కానీ కొంతమంది స్త్రీలలో ప్రసవానతరం కూడా ఈ వ్యాధి కొనసాగా వోచ్చును.

21, జులై 2011, గురువారం

సాయినాథుని దినచర్య

సాయినాథుని దినచర్య

ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే...

బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.

ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.

ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.

సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.

ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.

హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.

సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.

సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.


17, జులై 2011, ఆదివారం

గంధం సంతోషాన్ని ఇస్తుంది తెలుసా?(Sandalwood)

గంధం సంతోషాన్ని ఇస్తుంది తెలుసా?

(Sandalwood)

హిందూ సంస్కృతిలో గంధానికి చాలా ప్రాధాన్యత ఉంది. మన పూజలు, పునస్కారాల్లో గంధాన్ని తప్పక వినియోగిస్తాం. అందరూ ఉపయోగిస్తున్నారు కనుక గంధాన్ని మనమూ వాడుతున్నామే కానీ, దానివల్ల ప్రయోజం ఏమిటో మనకు అంతగా అవగాహన ఉండదు. సర్వసాధారణంగా మన ప్రతి ఆచారం వెనుకా శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది. అందుకే పెద్దలు వాటిని ఆచారాలుగా ప్రతిపాదించారు.

ఇప్పుడు పూజల్లో గంధం ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

అభిషేకం చేసిన తర్వాత దేవునికి వస్త్రం, యజ్ఞోపవీతం, అక్షతలతో బాటు గంధాన్ని సమర్పిస్తాం. వస్త్ర, యజ్ఞోపవీతాలను స్వయంగా సమర్పించక పోయినప్పటికీ, మంత్రపూర్వకంగా సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది.

గంధాన్ని మాత్రం నియమం తప్పకుండా ప్రతిరోజూ సమర్పించుకోవాలి. పూజ ముగిసిన తర్వాత గంధాన్ని మెడకు భక్తిగా రాసుకుని, అక్షతలను తలపై జల్లుకోవడం సంప్రదాయం.

గంధం ఎంత సువాసనాభారితంగా ఉంటుందో మనందరికీ తెలుసు. గంధపు చెట్ల పరిమళాలకు తాచుపాములు సైతం ఆకర్షితమై వస్తాయి. అందుకే గంధపు చెట్లు, పున్నాగ చెట్లు, మొగలి పొదల దగ్గర జాగ్రత్తగా ఉండమని పెద్దలు హెచ్చరిస్తారు. ఆ సంగతి అలా ఉంచితే, మంచి గంధపు సువాసన మాటలకు అందని సంతోషాన్ని ఇస్తుంది. అంతే కాకుండా దయాగుణాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.

మనకు తెలిసి, తెలీకుండా మన మనసు ఎక్కడెక్కడో సంచరిస్తుంటుంది. ఆ చంచలత్వం నుండి తప్పించి, మనసును స్థిరంగా ఉంచుకోడానికే మనం పూజలు, ధ్యానాలు చేస్తాం. మనసులో చెలరేగే ఆలోచనలను నియంత్రించడానికి, కలతలు, కష్టాలూ ఏమైనా ఉంటే అరికట్టడానికి పూజలు దోహదపడతాయి. అందుకు గంధం తనదైన పాత్ర పోషిస్తూ సహకరిస్తుంది.

గంధంలో ఉండే దయ, సంస్కారం అనే మంచి వాసనలు, రాగద్వేషాలు అనే మలినాలను పోగొడతాయి. ఇతరత్రా మనలో పేరుకున్న కుసంస్కారాలను సైతం నశింపచేసి సంతోషం పాదుకునేలా చేస్తాయి. అలాగే, తోటివారి మీద ప్రేమ, దయ అంకురించేలా చేస్తాయి.

ఇంకొంచెం లోతుగా వెళ్తే పూర్వ కర్మల వాసనలను అంతమొందించి మళ్ళీ జన్మ ఉండకూడదు అని పూజించడానికి గంధం, అక్షతలు తోడ్పడతాయి.

గంధం మనసుకే కాదు, శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది. అందుకే గంధాన్ని కేవలం పూజల్లోనే కాకుండా అనేక సందర్భాల్లో శరీరానికి రాసుకుంటాం.

గంధంతో శరీర ఛాయ పెరుగుతుంది.

గంధం సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది.

గంధం వల్ల చర్మం పేలడం, పొక్కడం లాంటి ప్రతిచర్యలు చూపదు.

గంధంతో చర్మవ్యాధులెన్నో నివారణ అవుతాయి. స్కిన్ రాషెస్, స్కిన్ ఎలర్జీలే కాకుండా చర్మపై వచ్చిన మచ్చలు కూడా తగ్గుతాయి. దురదలు నివారింపబడతాయి.

పొరపాటున చర్మం ఏమైనా కాలితే, కొంచెం గంధం రాస్తే వెంటనే ప్రయోజనం ఉంటుంది.

గంధపుచెక్క లేదా గంధపు పొడిని పట్టు వస్త్రాల మధ్య ఉంచితే సువాసన రావడమే కాకుండా పాడవకుండా భద్రంగా ఉంటాయి.

16, జులై 2011, శనివారం

హరిసేవ: మన సోదరి అమ్మఒడి బ్లాగర్ ఆదిలక్ష్మి గారి దుఃఖం మనకు విషాదం

హరిసేవ: మన సోదరి అమ్మఒడి బ్లాగర్ ఆదిలక్ష్మి గారి దుఃఖం మనకు విషాదం
ఆ బాధ ఎటువొంటిదో స్వయముగా అనుభవించిన నాకు తెలుసు. ఈ సమయములో మనో ధైర్యముతో ఆమె ముందుకు సాగాలని కోరుకొంటూ --సోదరుడు మూర్తి

సంకల్పబలం అంటే ఏమిటి? ముహూర్తం ఎందుకు?

సంకల్పబలం అంటే ఏమిటి? ముహూర్తం ఎందుకు?

(Meaning of Sankalpam & Muhurtham)

మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, అది నిర్విఘ్నంగా నేరవేలారని బలంగా సంకల్పించుకోవాలి. చేపట్టిన పని మనసా వాచా కర్మణా కోరుకుంటే తప్పకుండా జరిగితీరుతుంది. కృషి, పట్టుదలతో బాటు సంకల్పబలం కూడా చాలా అవసరం. అంతే కాకుండా మంచి ముహూర్తం చూసి పని మొదలుపెట్టాలి. దృఢ సంకల్పము, శుభ ముహూర్తము ఉంటే మోయలేని బండరాయిని కొండమీదికి ఎక్కించగలం. సంకల్పబలం లేకున్నా, మంచి ముహూర్తం లేకున్నా అదే రాతిని కిందికి కూడా తోయలేం.

మనవాళ్ళు భూమిలో విత్తనాలు నాటినా తిథి, వార, నక్షత్రాలు చూస్తారు. ఇదంతా చాదస్తం అని కొట్టిపడేసేవారు ఉన్నారు. కానీ, ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అలా అనరు. ఇందులో శాస్త్రం ఇమిడి ఉంది. ఏ టెక్నాలజీ, పరికరాలు లేని కాలంలోనే మహర్షులు ఎంతో పరిశ్రమించి, పరిశోధన చేసి, గ్రహాలూ, నక్షత్రాల చలన స్థితి, పరిణామాలు, వాటివల్ల కలిగే ప్రభావాలను ప్రబోధించారు. ఆ అద్భుతమైన, అమూల్యమైన విషయ సమాచారాన్ని తర్వాతి తరాలకోసం నిక్షిప్తం చేసి ఉంచారు.

అందుకే పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకే కాకుండా ఏ పని ప్రారంభించాలన్నా తిథి, వార, నక్షత్రాలు, నెలలు, సంవత్సరాలు చూడటం అలవాటుగా మారింది. వీటిని సరిగ్గా లెక్కలు వేసి చూస్తే గనుక సత్ఫలితాలు ఉంటాయి. లేకుంటే అనుకున్న పని సవ్యంగా నెరవేరదు. ముహూర్తబలం అలాంటిది. కొన్ని కొన్ని నెలల్లో పెళ్ళిళ్ళు చేయరు. గృహప్రవేశం తలపెట్టరు. వారి వారి నక్షత్రాలను బట్టి ఆయా రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గమనం ఎలా ఉంటుందో లెక్క చూసి, ఆ ప్రకారం పరిగణిస్తారు. అలాగే శుక్లపక్ష, కృష్ణపక్షాలకు కూడా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ప్రతిరోజూ ఒకేలా ఉండదు.

కేవలం పనుల గురించే కాదు, ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా సంకల్పబలం కావాలి. గ్రహబలం ఉండాలి. చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఏ రకమైన అనారోగ్య సమస్యలూ లేకుండా హాయిగా, ఆనందంగా ఉండాలని బలంగా సంకల్పించుకోవాలి. ఆయా దినాలు, గ్రహ స్థితులను అనుసరించి అలవాట్లు, ఆచారాలను నిర్ధారించుకోవాలి.

ఉపవాసాలు కూడా గ్రహస్థితులను అనుసరించి వచ్చినవే. ఉదాహరణకు మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో, ఏకాదశి మొదలైన ప్రత్యేక రోజుల్లో, గ్రహణ సమయాల్లో సూర్యచంద్రుల స్థానాన్ని బట్టి పొట్ట బరువుగా ఉండకపోవడం మంచిది. అందుకే ఆయా రోజుల్లో ఉపవాసం ఉంటారు. మన పెద్దలు ఆచారం, నమ్మకం పేరుతో ప్రతిపాదించినవన్నీ కూడా శాస్త్రీయమైనవే అని గుర్తించి, గుర్తుంచుకోవాలి.