HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "
సాక్షి డైలీ నుండి సేకరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాక్షి డైలీ నుండి సేకరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మే 2011, గురువారం

ఇకపై పావలా కనుమరుగు

ఇకపై పావలా కనిపించదు!
ముంబై: ఇంతకాలం అరకొరగా చలామణీలో ఉన్న పావలా, అంత కన్నా తక్కువ విలువ గల నాణేలకు ఇకపై కాలం చెల్లనుంది. ఇలాంటి నాణేలను జూన్ 30 లోగా బ్యాంకుల్లో చెల్లుబాటు చేసుకోవాలని, జూలై 1 అనంతరం వీటి చలామణీని రద్దు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించటమే ఇందుకు కారణం. జూన్ తర్వాత ఆయా నాణేల చలామణీని ఉపసంహరించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఈ మేరకు 25 పైసలు అంతకన్నా తక్కువ విలువ గల నాణేలను రిజర్వ్ బ్యాంక్ అన్ని శాఖలతో పాటు ఇలాంటి నాణేల కోసం ప్రత్యేక విభాగాలు కలిగిన బ్యాంకుల్లోనూ మార్చుకోవచ్చని తెలిపింది. జూన్ 29 లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.