HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "
పండుగలు పరమార్ధములు పుస్తకం నుండి సేకరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పండుగలు పరమార్ధములు పుస్తకం నుండి సేకరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, ఆగస్టు 2011, బుధవారం

వినాయక పూజకు అర్హమైన 21 ఏక విసంటి పత్రములు

౧]మాచీ పత్రము -దీనినే తెలుగులో "దవనం " అని పిలుస్తారు. దీని వృక్ష శాత్రీయ నామము "aartimaasiyaa valgaarise " ఇది తలనొప్పిని, నులి పురుగును తగ్గిస్తుంది.
౨] బృహతీ పత్రము -దీనినే తెలుగులో "నేలమునగ "అందురు. దీని వృక్ష శాత్రీయ నామము "సోలానం ఇందికం " .ఇది వాతములను,కఫము ,మలబద్దకము,ఉబ్బసము,దగ్గులను నివారించును.
౩] బిల్వ పత్రము- తెలుగులో దీనిని "మారేడు" అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "అయగల్మార్మియోలాస్ ".ఇది మధుమేహమునకు ఔషదం గా వాడతారు.
౪]దూర్వాయుగ్మము -దీనినే తెలుగులో "గరిక" అంటారు. దీని వృక్ష శాత్రీయ నామము "పయనదిన్ దక్సిలన్ "అంటారు. ఇది చర్మరోగాములకు,చుండ్రుకు బాగా ఉపయోగపడును.
౫]దుత్తూర పత్రము- దీనినే తెలుగులో "ఉమ్మెత్త "అందురు.దీని వృక్ష శాత్రీయ నామము "దత్తూర్ మెటల్ " అంటారు.ఇది వెంట్రుకలు రాలకుండగా అరికడుతుంది.దీనిని మానసిక రోగముల నివారణలో ఉపయోగిస్తారు.
౬]బదరీ పత్రము-దీనినే తెలుగులో "రేగు" అనిఅంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "జిజిఫన్ మారి షానారక్త దోషములను హరించుట,ఎముకలకు బలము చేకూర్చుట,జీర్ణ శక్తిని కలిగించుట దీని లక్షణము.
౭]అపామార్గ పత్రము- తెలుగులో "ఉత్తరేణి" అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ఎకిరందిస్ అస్సేరా ".మూల సంక ,మలబద్దకాన్ని నివారిస్తుంది.
౮]తులసి పత్రము- ఇది తెలియని వారుండరు,దీని వృక్ష శాత్రీయ నామము "అసిముం sanktam " tuasi dalamula teerdhmu prasatamu .
౯]చూత పత్రము _తెలుగులో దీనిని "మామిడి అంటారు."దీని వృక్ష శాత్రీయ నామము "మంగి ఫరా ఇండికా "అంటారు. పెరుగుతో కలిపి ఆకులూ నూరి కాళ్ళ పగుళ్ళు అరికడతాయి .
౧౦]కరవీర పత్రము- తెలుగులో "గన్నేరు" అంటారు. గన్నేరు పై పూటకు మాత్రమె వాడతారు.మొండి vranamulu tagginchunu .
౧౧] విష్ణు క్రాంత పత్రము- దీనిని తెలుగులో "అవిస" అంటారు. దీని వృక్ష శాత్రీయ నామము "ఇవాల్యులాస్ అన్సినాయిదీస్ ".ఇది పళ్ళను గట్టి పరుస్తుంది,మంచి దృష్టిని, ధారణా శక్తిని ఇస్తుంది.
౧౨]దాడిమీ పత్రము _ తెలుగులో "దానిమ్మ" అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ప్యునికాగానటం" అంటారు. వాతము,పిత్తము,కఫము నివారిస్తుంది.
౧౩]దేవదారు పత్రము= దీనికి తెలుగులో కూడా అలానే పిలుస్తారు.దీని వృక్ష శాత్రీయ నామము "సైద్రాన్ దెఒ దార్ " అంటారు. దీని తైలము కాళ్ళ నొప్పుల బాగా పనిచేస్తుంది.
౧౪]మరువక పత్రము- తెలుగు లో "మరువము" అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ఒరిజినం మరజోరనా" అంటారు.ఇది శరీర దుర్వాసనలను పోగొట్టి,గజ్జి వంటి వాటినుండి రక్షిస్తుంది.
౧౫] సింధువార పత్రము- తెలుగులో దీనిని" వావిలాకు "అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "వై టెక్ ఎక్స్ నిర్గుందే "అంటారు. దీని ఆకులు కీళ్ళ నొప్పిని, తల నొప్పిని తగ్గిస్తుంది.
౧౬]జాజి పత్రము-తెలుగులో "సన్నజాజి " అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "జస్మినం గ్లాంది ఫోరం ".దీని నుండి సుగంధ తైలం తీస్తారు.
౧౭]గండలీ పత్రము- తెలుగులో దీనిని "కామంచి ఆకు అంటారు "దీని వృక్ష శాత్రీయ నామము" సాలోనం నిగ్రకుం ".ఇది అపస్మారక స్తితి, మూర్చ రోగములకు పనిచేయును.౧౮
18] shamee పత్రము= తెలుగులో జమ్మి ఆకు అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ప్రోసో పీస్ స్పెసిగేరా" .ఇది అతి సారము నివారిస్తుంది.
౧౯]అశ్వద్ద పత్రము- తెలుగులో రావి ఆకు అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "ఫికేన్ వేనోసా" ఇది రక్త స్రావమును అరికట్టును.
౨౦]అర్క పత్రము- తెలుగులో జిల్లేడు అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "కిలోత్రోపిస్ ప్రోసిరా "ఇది అరవై నాలుగు వ్యాధులను నివారించునని అంటారు.
౨౧]అర్జున పత్రము- తెలుగులో మద్ది ఆకు అంటారు.దీని వృక్ష శాత్రీయ నామము "తెర్మినాలియా అర్జున " ఇది కీళ్ళ నొప్పిని నివారిస్తుంది.


27, జూన్ 2011, సోమవారం

జేష్ట బహుళ ఏకాదశి --అపర ఏకాదశి

జాష్ట బహుళ ఏకాదశి అపర ఏకాదశి అనియు, పెద్ద ఏకాదశి అనియు పిలుస్తారు .
ఈ ఏకాదశి వ్రతము అనుకున్న పనులు సిద్ధింప చేస్తుందని విశ్వాసము .
ఈ రోజున వ్రత అనంతరము గొడుగును ,చల్లని వస్తువులను దానము చేయవలెనని ధర్మ శాస్త్రము.
కాబట్టి సంవస్త్సరములో మనకు వొచ్చే అన్ని ఏకాదశి ల వెనక విశిష్టమైన పురాణ ఆరోగ్య రహస్యములు కలవు .
తిదులన్నితి లోను ప్రత్యేకత సంతరించుకున్న తిధి ఏకాదశి , మానవుల ఆరోగ్య పరిరక్షనే ధ్యేయంగా ఆచార్య వ్యవహారాలలో చోటుచేసుకున్న ఈ ఏకా దాసి వ్రతము ఆచరించుట ద్వారా అద్యాత్మికముగా అనేక పుణ్య ఫలములే గాక మారుచున్న సామాజిక స్తితి గతులు ,ఆహారపు అలవాట్లు వలన క్రొత్త సమస్యలను, ఆరోగ్య విషయముల నుండి ఉపసమనం పొంద వోచ్చును .

23, జనవరి 2011, ఆదివారం

పుష్య బహుళ ఏకాదశి - సఫల ఏకాదశి- విమల ఏకాదశి

పుష్య బహుళ ఏకాదశి [29-01-2011] కి " సఫల ఏకాదశి " అని "విమల ఏకాదశి" అని పేర్లు .
పూర్వము చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలిచేవాడు .అతనికి లుంభకుడు అనే కుమారుడున్దేవాడు .లుంభకుడు అధర్మ వర్తనుడై జీవిస్తుడడం తో కుమారుడని చూడకనే రాజు వానిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించెను . లుంభకుడు అడవుల పాలై ఆహారము దొరకక ,తన పరిస్తితికి పశ్చాత్తాప పడుతూ తన దురవస్తకు చింతిస్తూ ఒక చెట్టు క్రింద సృహ తప్పి పది పోయాడు .ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసమును అప్రయత్నముగా పాటించడం తో
శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదిన్చినట్లు తెలుస్తోంది .లుంభకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణాంతరము
వైకుంతమునకు చేరుకున్నాడు .అని పురాణ కధనం.
ఈ ఏకాదశి వ్రాత మహత్యాన్ని పరమ శివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు పద్మ పురాణం చెబుతోంది .