HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

13, జనవరి 2011, గురువారం

దీని భావమేమి తిరుమలేశా ?

1] నాడు ఈనాడుపై వై యస్

నేడు సాక్షి పై వి హెచ్


దీని భావమేమి తిరుమలేశా ?
2] శ్రీ కృష్ణ కమిటీకి కోస్తా ఆంధ్రా నేతలు డబ్బులు ఇచ్చి తమకనుకూలముగా తెప్పించుకున్నారని ఒక బాద్త్యతగల పార్లమెంట్ సభ్యుడు చెప్పడం ఎంతవరకూ సమంజసం ,దీనిని బట్టి చాలా విషయాలలో వేసిన ప్రతీ కమిటీ ,ఇకపై ఏవిషయం మీదైనా వేసే కమిటీలకు విలువ ఏమి వుంటుంది ?
దీనిని బట్టి నాయకులకే తాము వేసిన కమిటీల పై నమ్మకం లేనపుడు ,ఇక సామన్యుని పరిస్తితి ఏమిటి తిరుమలేశా ?

8, జనవరి 2011, శనివారం

హిందూ ధర్మ శాస్త్రాలు

దేవాలయమునకుకాని, గృహమునకు కానీ వెళ్ళునపుడు కుడి కాలు ముందు పెట్టవలెను.సూర్యోదయమునకు
ముందే నిద్రలేచి స్నానమాచరించి దైవ పూజ చేసుకొన్నవారికి ఆరోగ్యబలం ,అందం,మంచి శరీరం,వాక్ఫలితాలు,మంచి గుణం,ధర్మం చేసే ఆలోచనలు,గౌరవం,కీర్తి, ధనం ఇవన్నియూ వెతుక్కుంటూ వొస్తాయని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది .
దీనివలన నరాల బలహీనత ,బ్లడ్ ప్రేషేర్ దగ్గరికి రావు.
తెల్లవారుజామున ఆకాశమున నక్షత్రములు ఉండే సమయములో ఊదారంగు కిరణాలు ఆకాసమంతా వ్యపించించి ఉంటాయి .అప్పుడు స్నానం చేయడం వలన అల్ట్రా ,ఊదా కిరణాలు మన శరీరం లోనికి వెళ్ళడానికి హేతువు అవుతుంది .నదీ స్నానమైతే మరీ మంచిది.

7, జనవరి 2011, శుక్రవారం

అక్షర సత్యాలు

జీవించడం గొప్ప కాదు !
మనిషిగా మరొకరికి సాయపడుతూ జీవించడం గొప్ప !!
మరనిచాక కూడా జీవించేలా జీవించడం ఇంకా గొప్ప !!!

మనసుచేప్పినట్టు మనం వినడం కాదు !
మనం చెప్పినట్టు మనస్సు వినేలా చేయాలి !!

చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేక పోవొచ్చు !
కానీ ఏ పనీ చేయకుండా ఆనందాన్ని పొందలేము !!

మూర్ఖులు సుఖం ఎక్కడో వుందని ఎదురు చూస్తుంటారు !
కానీ వివేకవంతులు తమ వద్ద ఉన్న దానితో సుఖముగా జీవిస్తారు !!

పొగడ్త మూడుకాళ్ల కుర్చీ లాంటిది !
విర్రవీగి కూర్చుంటే వెనక్కు తూలె ప్రమాదముంది !!

మనం మనకోసం చేసుకునేది మనతోనే అంతరించి పోతుంది !
కానీ ఇతరులకోసం చేసేది శాశ్వతం గా నిలిచి వుంటుంది !!

సద్గుణాలు వుంటే చాలదు వాటిని మంచి కొరకు వినియో గించాలి !

అస్సాద్యాన్ని సుసాద్యం చేయటమే ఉత్తముని లక్ష్యం !

అందరినీ ఆనందిమ్పచేసేవారు ఎల్లప్పుడూ ఆనందం గా వుంటారు !

భౌతిక సంపదలకన్నా శరీర ఆరోగ్యం చాలా విలువైనది !

కోరికలు తక్కువ ఉన్నవారే అనడరికన్నా ధనవంతులు !

జీవితం లో కష్టపడని వారికి సుఖం విలువ తెలియదు !

కీర్తి ప్రతిష్టల లేనివారికి నిజమైన కీర్తి లభిస్తుంది !

ఎల్లప్పుడూ నవ్వుతూ కనపడే మనిషికి ఏ కస్టాలు లేవని కాదు !
కానీ నవ్వు అతని కస్టాలు ఎదుర్కొనే సామర్ద్యానికి ప్రతీక !!
కనుక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా వుండండి!!!

1, జనవరి 2011, శనివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

తోటి బ్లాగ్గర్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ ౨౦౧౧ లో మన బ్లాగ్గర్ కుటుంబం మరింత దినదినాభి వృద్ధి చెందాలని మనసార కోరుకుంటూ
-------మారుతి [msr murthy]

18, నవంబర్ 2010, గురువారం

చికెన్ గున్యా ఫీవర్

ఈ ఫీవర్ వొచ్చిన ప్రతీ వ్యక్తీ జ్వరం తగ్గినా కానీ మోకాళ్ళు ,మోచేతులు ,జాయింట్లు దగ్గర నొప్పులు వుంటున్నై .ఎవ్వరిని అడిగినా కానీ ఇవి మూడు నేలలున్టై, ఆరునేలలున్టై అంటున్నారే కానీ సరైన మందు ,వ్యాయామ పద్దతులు చెప్పట్లేదు .దయచేసి ఎవ్వరైనా ఈ నొప్పులు ఎలా తగ్గుతాయో తెలియచేయగలరు .పెయిన్ కిల్లెర్స్ వాడడం వలన తాత్కాలిక ఉపసమనం తప్పించి ప్రయోజనం ఉండుటలేదు .పెయిన్ కిల్లెర్స్ఎక్కువుగా వాడవోద్దని అందరూ చేపుతూవుంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు అస్సలు ఎక్కువ పెయిన్ కిల్లెర్స్ వాడకూదదంటారు. నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ఈ నేప్పులతో బాధపడుతున్నారు .ఎవ్వరైనా అనుభవంతో నిప్పుల నివారణ చెప్పగలరని ఆశిస్తున్నాను.

15, నవంబర్ 2010, సోమవారం

తెలుగు పద్య నాటకం

తెలుగు నాటక రంగం ఆదరణ కోల్పోతున్న ఈ దశలో కాజ రామ కృష్ణ & మాధురి గారు [www.andhranatakam.com] అనే వెబ్సైటు ఒకటి ప్రారం భిన్చారు .అది ప్రారంభించి ఎన్నాళ్లైందో తెలియదు గాని నేను ఈరోజే చూసాను . చాలా బాగా డిజైన్ చేసారు .తెలుగునాతకానికి సంబంధించి అందరి పద్యాలు మనకి మాములుగా దొరకనివి కూడా అందులో ఉంచారు .నేను ఆ సైట్ చూసి చాలా ఇంప్రెస్స్ అయ్యాను .ఇదే విషయం అందరికి తెలిచేయాలని ఉద్దేశంతో ఈ పోస్ట్ రాసాను .పద్యనాటక అభిమానులందరూ ఈ సైట్ ద్వారా తమతమ ఇష్టమైన ఆర్టిస్టుల పద్యాలను విని ఆనదిస్తారని ఆశిస్తూ--

25, అక్టోబర్ 2010, సోమవారం

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి సోలో నాటిక అల్లెగ్జాన్దర్

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి తన j p ధిఏటర్ బ్యానర్ పై రాజముండ్రి లో నిన్నటి రోజున తన స్వీయ దర్సకత్వంలో Allegjander అనే నాటిక సోలో గా ప్రదర్శించారు ఆ నాటికలో ఆయన ఒక retaired ఆర్మీ ఆఫీసర్ ఆయన ఒక హెల్ప్ లైన్ నడుపుతూ ఆ లైన్ కు ఫోన్ చేసినవాళ్ళకు వాళ్ళ వాళ్ళ సమస్యలు బట్టి సలహాలు ఇస్తూ సమస్యల పరిస్ఖారానికి సహాయపడతారు. ఇందులో మిగిలిన నటులు ఎవరూ లేకుండగా వారి వాయిస్ ను మాత్రమె రికార్డు చేసి వాళ్ళు ఫోన్ లో మాట్లాడు తున్నట్లుగా వినిపించారు .ఈ ప్రయోగం చాలా బాగుంది దాదాపు ఒక ఘంటా నలభై నిమిషాలు బాగా రక్తి కట్టించారు.నేటి సమాజం లో జరుగుతున్న సమస్యలు గృహ హింస ,ర్యాగింగ్ ,ఆసిడ్ దాడులు , భగ్నప్రేమ మొదలైన విషయాలమీద చెపుతూ తనకు తానుగా తాగుడు ,పొగాకు వలన ఎంత నష్ట పోయాడో తెలియచేస్తూ ముగించారు. ఈ ప్రదర్శనకు నేను ,నా స్నేహితులతో వెళ్లాను వాళ్లకు అస్సలు డ్రామా ,నాటకాలు అంటే పడదు కాని నా బలవంతం మీద వొచ్చారు .ఆడిటోరియం లోపలి వొస్తూ వాళ్ళు చివరగా కూర్చుందాము మద్యలో పారిపోవొచ్చు అన్నారు .అల్లా అని కూర్చొన్న వాళ్ళు పూర్తీ అయ్యేవరకూ లేవలేదు .ఇది ఎందుకు చెపుతున్నాను అంటే ఈ నాటిక మీకు దగ్గరలో ఎక్కడైనా వేస్తున్నట్లు గా తెలిస్తే తప్పక చూడండి .ఈ సోలో ప్రయోగం బాగుంది. ఈనాటికలో రికార్డు చేసిన వాయిస్ ను ఆపరేట్ చేసే vyakti పై ఈ vijayam aadhaara padi vuntundi